సిటీ విద్యార్థుల కోసం.. సరికొత్తగా సాక్షి ఎడ్యుకేషన్
సరికొత్త ప్రయోగాలకు ఎల్లప్పుడూ ముందుండే సాక్షి.. విద్యార్థి లోకం కోసం హైదరాబాద్ సిటీ ప్లస్ ఎడిషన్‌లో.. ‘ఎడ్యుకేషన్’ను వినూత్నంగా అందిస్తోంది. హైదరాబాద్ సిటీ విద్యార్థుల అవసరాలు, ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. సరికొత్త కాన్సెప్ట్స్‌తో మీ ముందుకు వస్తోంది.
భవిత, విద్య, చుక్కాని ద్వారా అకడెమిక్, కెరీర్ ఆర్టికల్స్, పోటీ పరీక్షల కంటెంట్‌ను ఇస్తున్న సాక్షి.. సిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అకడెమిక్ కౌన్సెలింగ్, జాబ్ కౌన్సెలింగ్, కాంపిటీటివ్ కౌన్సెలింగ్‌ను నిపుణుల సాయంతో ప్రత్యేకంగా అందిస్తోంది. ఏఏ పుస్తకాలు చదవాలి.. నేర్చుకున్న విషయాలను పరీక్షలో పొందికగా రాయడం ఎలా..! ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కోవడం.. జాబ్ స్కిల్స్.. కాలేజీల సమాచారం.. ఆయా కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్న వినూత్న కోర్సులు.. వంటి అంశాలపై కౌన్సెలింగ్‌ను అందించనుంది!
అకడెమిక్ కౌన్సెలింగ్‌లో:
ఇంటర్ నుంచి పీజీ, పీహెచ్‌డీ వరకూ.. కోర్సులు, కాలేజీలు, ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ, ఫీజులు, అత్యుత్తమ విద్యాసంస్థలు, అప్‌కమింగ్ కోర్సులు, విదేశీ విద్యావకాశాలు, అర్హత పరీక్షలు, వీసా ప్రక్రియ, ఆయా దేశాల్లో టాప్ యూనివర్సిటీలు తదితర అంశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తాం.
జాబ్ కౌన్సెలింగ్‌లో:
జాబ్ మార్కెట్ ట్రెండ్స్, ఆయా కోర్సులతో అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలు, జాబ్ స్కిల్స్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వివరాలు, రెజ్యూమె ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్, జాబ్ సెర్చ్ టెక్నిక్స్ వంటి అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలు అందిస్తాం.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్‌లో:
పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పుస్తకాలు, కంటెంట్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఏం చదవాలి.. ఏయే పుస్తకాలు చదవాలి.. ఏ పుస్తకాల్లో నాణ్యమైన మెటీరియల్ దొరుకుతుంది.. ఎలా చదవాలి.. మెరుగైన కోచింగ్‌ను అందించే సంస్థలు ఏవి.. నిపుణుల అమూల్య సలహాలు.. ఇలా ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఉద్యోగం వచ్చే వరకూ.. సాక్షి మీకు తోడుగా ఉంటుంది.
పోటీ పరీక్షల కంటెంట్ కావాలనుకునే విద్యార్థులు.. సాక్షిఎడ్యుకేషన్ డాట్‌కామ్ నుంచి విద్య పేజీలను ప్రతిరోజూ నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని సాక్షి కల్పిస్తోంది!