'పెద్దల’పోటాపోటీ
‘పెద్దల’ సభపై జిల్లా నేతల కన్ను పడింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు పోటాపోటీ లాబీయింగ్‌కు తెరలేపారు. అధిష్టానం హామీ తమకే ఉందంటూ ఎవరికివారు పావులు కదుపుతుండడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి కే సీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులుహరీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు రోజలుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఇరువురు నేతలు శాసనమండలి చాన్స్‌పై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు.
- ఎమ్మెల్యేల కోటాపై హరీశ్వర్, యాదవరెడ్డి కన్ను
- జోరుగా లాబీయింగ్..
- సీఎం హామీకి ప్రయత్నాలు
- కుదరకపోతే స్థానికసంస్థల కోటాలో చాన్స్‌కు పట్టు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల కోటాలో జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు రానున్నాయి. ఇటీవల పట్నం నరేందర్‌రెడ్డి పదవీ విరమణతో ఒక సీటు ఖాళీ కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో అదనంగా జిల్లాకు మరోస్థానం లభించింది. ఈ రెండింటికీ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు హరీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి సుముఖత చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు, శ్రమతో కూడుకున్నది కావడంతో ఎమ్మెల్యేల కోటావైపు మొగ్గు చూపుతున్నారు.
ఇటీవల ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయి న యాదవరెడ్డి తనకు మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని గులాబీ అధిష్టానాన్ని కోరుతుం డగా, కష్టకాలంలో టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన తనకు చాన్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉం డడం.. వీటికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నేతల కు అవకాశం లభిస్తుందో లేదో అనేది ఉత్కంఠగా మారింది.
ఉభయతారకంగా..
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక యాదవరెడ్డి ఆ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగిన యాదవరెడ్డి నవాబుపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. అయితే, జిల్లా పరిషత్ పీఠం దక్కించుకునేందుకు తగినంత సంఖ్యలో సీట్లు దక్కకపోవ డం.. క్యాంపు నిర్వహణ కష్టంగా భావి ంచిన ఆయన అనూహ్యంగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు తారుమారు కావడంతో జెడ్పీ కుర్చీ కాస్తా అధికారపార్టీ వశమైంది. ఇప్పటికీ నవాబ్‌పేట జెడ్పీటీసీగా కొనసాగుతున్న యాదవరెడ్డి మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే గట్టిహామీ తీసుకున్న తర్వాతే గులాబీ కం డువా కప్పుకున్నారనే ప్రచారం జరి గింది. ఎమ్మెల్యేల కోటాలోనే ఆయనకు ఛాన్స్ ఇస్తారని ఆయన సన్నిహితవర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఈ నేపథ్యం లోనే ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా హరీశ్వర్‌రెడ్డి తెరమీదకు రావడంతో పోటీ నెల కొంది. లోకల్‌బాడీ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నందున.. ఎమ్మెల్యేల కోటాలో ఒకరికి ఛాన్స్ ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ కోటాలో తమ పేరునే ఖరారు చేయాలని ఇరువురు పట్టుబడుతున్నట్లు సమాచారం. స్థానికసంస్థల కోటాలో ఖర్చు భరించ డం తనవల్ల కాదని, గతంలో జెడ్పీ చైర్మన్ పీఠాన్నీ ఇదే కారణంతో వదులుకున్నందున తన పేరును ఎమ్మెల్యేల కో టాలో పరిగణనలోకి తీసుకోవాలని యాదవరెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు తెలిసింది. కాగా, హరీశ్వర్‌రెడ్డి సై తం ఎమ్మెల్యేల కోటాపైనే మొగ్గు చూ పుతున్నారు. పట్టువిడుపులు తప్పవంటే స్థానిక సంస్థల కోటాలోనైనా పోటీకి రెడీ కావాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.