CM Guarantee
-
అదే పాట.. ప్రతీ చోట
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): అదే పాట..ప్రతీ చోట అన్న చందంగా ఉంది టీడీపీ నాయకుల తీరు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నేటి వరకు ఒక్కటీ అమలు చేయలేదు. నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలపై ఐదేళ్లయినా కనీసం పట్టించుకోలేదు. ఇపుడు ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం ప్రచార బాట పట్టారు. అపరిష్కృతంగా ఉన్న పాత సమస్యలను తెరపైకి తెచ్చి పరిష్కరిస్తానని హామీలు గుప్పిస్తున్నారు. ఇందుకు చిలకపాలెంలోని జరిగిన సీఎం సభ ఉదాహరణగా చెప్పవచ్చు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, వెంకట్రావు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని, ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు ఏమి చేస్తారని నియోజకవర్గ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. నీటి మూటలుగానే మిగిలిన బాబు, కళా హామీలు ♦ ఎచ్చెర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు. ♦ లావేరు మండలం బుడుమూరు నారాయణసాగరం చెరువును మినీ రిజర్వాయర్‌గా తీర్చి దిద్ది 2500 ఎకరాలకు సాగునీరు అందించటం. ♦ ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం సముద్ర తీరంలో జెట్టీల నిర్మాణం. ♦ జీరుపాలెంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు. ♦ పైడిభీమవరంలో బీ–ఫార్మసీ కళాశాల ఏర్పాటు. ♦ పైడిభీమవరంలో ఈఎస్ఐ (వంద పడకల ఆస్పత్రి) ♦ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు ప్రచారాల్లో మరలా మాయమాటలు గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, కళా వెంకట్రావు నియోజకవర్గంలోని అభివృద్ధి కోసం ఇచ్చిన ఆయా హామీల్లో ఒక్కటి కూడా నేటి వరకు అమలుచేయకపోవడం విశేషం. ఎన్నికల ప్రచారాల్లో మరోసారి ఆయా సమస్యలనే హైలైట్ చేసి ఈ దఫా పరిష్కరిస్తామని మాయ హామీలు గుప్పిస్తున్నారని ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నారు. టీడీపీకి ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన ప్రజాసంక్షేమం టీడీపీ నాయకులకు ఎన్నికల మందు ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుంది. 2014లో నియోజకవర్గంలో పలు సమస్యలపై ఇచ్చిన హామీలు వారికి ప్రస్తుతం గుర్తుకు లేవు. నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించిన నాయకులు ఓట్లు పొందేందుకు మరలా తప్పుడు హామీలు గుప్పిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గుణపాఠం చెప్పడం ఖాయం. – పి.రవి, కుశాలపురం -
బాబు మాటలు..నీటి మూటలు
ఎన్నికల ముందు గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు గుప్పించి..జన వంచనతో అధికార పీఠమెక్కిన సీఎం చంద్రబాబు ఐదేళ్లపాటు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీల అమలుకు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితంగా బాబు మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయి జిల్లా ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గారడి బాబు మళ్లీ అవే హామీలతో ఓట్లు అడుగుతూ జనం ముందుకొచ్చారు. సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకే విలువ లేకుండా పోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదు. ఇచ్చిన తర్వాత నుంచి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం హామీలు నీటిమూటలయ్యాయి. జిల్లా అధికారులు పదేపదే లేఖలు రాశారు. వివిధ సందర్భాల్లో నివేదికలను పంపారు. అయినా చలనం లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు, ఉన్నత విద్యా రంగం, గనులు, వ్యవసాయం, మౌలిక సదుపాయల కల్పన సంస్థ, గృహ నిర్మాణం వంటి విభాగాల పరిధిలో రకరకాల హామీలు ఇచ్చారు. ఐదేళ్లు కాలం ఇట్టే గడిచి పోయింది. అయినా పురోగతి అడుగు ముందుకు వేయలేదు. సీఎం ఇచ్చిన హామీలను వివిధ సందర్భాల్లో జరిగిన బహిరంగ సభలు, సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వల్లె వేశారు. ఐదేళ్లు ఇదే తంతు. ఎన్నికలు రానే వచ్చాయి. సీఎం హామీలు మాత్రం నీటి మూటలయ్యాయి. వెలిగొండ నుంచి నీళ్లిస్తామన్నారు వెలిగొండ ప్రాజెక్టు పనులు సంక్రాంతికి పూర్తి చేసి నీళ్లిస్తామన్నారు. సొరంగం పనులకు మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి, అంచనా వ్యయాలను పెంచుకున్నారే గానీ పనులను పూర్తి చేసిన పరిస్థితి లేదు. వెలిగొండ సొరంగం–1 పనులను తొలుత 2018 జూన్ నాటికి, మొత్తం ప్రాజెక్టు పని 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,150 కోట్లు కాగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. తాజాగా సొరంగాల ప్రారంభంలోని హెడ్ రెగ్యులేటరీ పనులు సెప్టెంబర్ నాటికి, సొరంగం–1 పనులను మే నాటికి, సొరంగం–2 పనులను డిసెంబర్ ఆఖరి నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు రూ.1,525.27 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు సొరంగం పనుల వద్ద డిజైన్ కూడా మార్చారు. అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు అంచనాలను పెంచినా పనులు ఇంకా పూర్తి కాలేదు. రాళ్లపాడు పరిధిలో తాగునీటి పనులు అంతే సీఎం చంద్రబాబు ఐదో విడత జన్మభూమిలో జీకేఎన్ కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు 600 మీటర్లు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు తీసుకోవడానికి ప్రణాళికను సీఎం ప్రస్తావించారు. సోమశిల నార్త్ ఫీడర్ చానల్ చింతలదీవి దగ్గర నుంచి 0.5 టీఎంసీల నీటిని రాళ్లపాడుకు తీసుకోవాల్సి ఉంది. 2018 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. ఈ వేసవికి ముందే రాళ్లపాడు పరిధిలోని గ్రామాలకు తాగునీటి సమస్య నెలకొంది. ట్రిపుల్ ఐటీ ఎక్కడ ? జిల్లాకు ట్రిపుల్ ఐటీ కలగానే మిగిలింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒంగోలులో ట్రిపుల్ఐటీ రావాలి. జీవో కూడా ఇచ్చారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి సరిపడా స్థలం ఇవ్వలేకపోయారు. అధికారులు కొన్ని స్థలాలకు అడ్వాన్సు పొజిషన్ కూడా ఇచ్చారు. అవి కూడా లిటిగేషన్లలో పడ్డాయి. కందుకూరులో ప్రతిపాదించారు. అక్కడా కుదరలేదు. దీంతో కనిగిరి, పామూరులో 210 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.500 కోట్లు నిధులు కావాలి. ప్రభుత్వం అదిగో ఇదిగో అంటుందే తప్ప నిధులు ఇవ్వలేదు. ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఇడుపులపాయలో నిర్వహిస్తున్నారు. ఒంగోలు మంగమూరురోడ్డులో పరిపాలనా భవనం ఏర్పాటు చేశారు. వీసీని నియమించారు. ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు జరిగి ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలోనే అదనంగా ఉన్న కొన్ని తరగతి గదుల్లో అరకొర వసతులతో నిర్వహిస్తున్నారు. ఇప్పటికి నాలుగు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. నాలుగు వేల మంది ఒంగోలు ట్రిపుల్ ఐటీ కింద ఉన్నారు. రూ.500 కోట్లకు గాను కేటాయించింది కేవలం రూ.2 కోట్లే. ట్రిపుల్ ఐటీ విషయంలోనూ సీఎం హామీ నెరవేరకుండానే ఎన్నికలు వచ్చేశాయి. ఎన్ఎస్పీ కాలువల ఆధునికీకరణ నీటిమూటే.. నాగార్జున సాగర్ కాలువల పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబు కాలువల ఆధునికీకరణకు నిధులు ఇస్తామన్నారు. రూ.150 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆధునికీకరణ పనులకు నిధులు ఇచ్చింది లేదు. పనులు జరగనందున సుమారు 1.5 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టు పెరిగింది. ప్రపంచ బ్యాంకు ఆధునికీకరణ పనుల కోసం రూ.820 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 73 ప్యాకేజీలను రూపొందించారు. గత ఏడాది జూలై నాటికి ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు పూర్తయింది. ప్రతిపాదించిన ప్యాకేజీల్లో 12 ప్యాకేజీలను పూర్తి చేశారు. ఆ తర్వాత సీఎం రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి పనులు పూర్తి చేస్తామన్నారు. ఇంత వరకు ఆధునికీకరణ పనులు పూర్తవలేదు. ఊసే లేని మైనింగ్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌తో పాటు మైనింగ్ ద్వారా ఆదాయం బాగున్నందున జిల్లాలో చీమకుర్తి కేంద్రంగా మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ హామీ నీటి మూటైంది. జిల్లాలో ఐరన్ ఓర్, గ్రానైట్, మైకాహెమటైట్, బ్లాక్ గెలాక్సీ, కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్డు మెటల్, పలకలు, మార్బుల్, సిలికా, క్వార్జ్, పలుగురాయి తదితర ఖనిజాలు ఉన్నాయి. వీటికి గాను 531 లీజులు ఉన్నాయి. 1120 మినరల్ బేస్ యూనిట్లు ఉన్నాయి. 50 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏటా రూ.318 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఇక్కడ మైనింగ్ విశ్వవిద్యాలయం వస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని, చీమకుర్తి బాగా ప్రగతి సాధిస్తుందని భావించినా ఆశ నెరవేరలేదు. అరుంధతి నక్షత్రంలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ దొనకొండ పారిశ్రామికవాడ గురించి తెలుగుదేశం నాయకులు జిల్లా దశదిశలా ప్రచారం చేశారు. ఇంత వరకు దొనకొండ పారిశ్రామికవాడ ఊసే లేదు. 50 వేల ఎకరాల్లో పారిశ్రామికవాడ నిర్మించడానికి సీఎం హామీ ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు.. సీఎం చంద్రబాబు నాయుడు కన్నా అధికంగా దొనకొండ గురించి ప్రచారం చేశారు. అరుంధతి నక్షత్రం చూపించిన చందంగానే దొనకొండ కారిడార్ నెలకొందన్న విమర్శలున్నాయి. 23 గ్రామాల్లో 25,886 ఎకరాలను భూసేకరణ చేయడానికి గుర్తించారు. కానీ దొనకొండ కారిడార్ మాత్రం రాలేదు. రూ.9070 కోట్లతో పారిశ్రామికవాడ అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ మౌలిక వసతులు పూర్తికాలేదు. అసలు ప్రాజెక్టు వస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. ఎన్నెన్నో హామీలు..నెరవేరితే ఒట్టు గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో మూడొంతులకు పైగా నెరవేర్చింది లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హామీల మీద హామీలు ఇచ్చారు. ఎన్నెన్నో హామీలు జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయి. రామాయపట్నం ఓడరేవు హామీకి బదులుగా అతి చిన్న పోర్టుకు శంకుస్ధాపన చేసి మమ అనిపించారు. వివిధ సందర్భాల్లో ఇచ్చిన 23 హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఊసే లేదు. -
అన్నీ ఉత్తుత్తి హామీలే..!
సాక్షి, ఆచంట (పశ్చిమ గోదావరి): రేషన్ డీలర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. హామీలు అమలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు గాలికి వదిలి వేయడంతో వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కమీషన్ పెంపు, నగదు ప్రోత్సాహకాలు, డిమాండ్ల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలనీ కమీషన్‌తో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్న రేషన్ డీలర్లకు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హామీలు గాలికొదిలేసిన ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 2186 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కందిపప్పు, రాగులు, జొన్నలు వంటి నిత్యవసరాల పంపిణీ జరుగుతోంది. రేషన్ దుకాణాలలో ఈ పోస్ యంత్రాలు ప్రవేశపెట్టడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత ఏర్పడింది. నాటి నుంచి డీలర్లు వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో రేషన్ డీలర్ల జేఏసీ 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచింది. అనేక తర్జన భర్జనల అనంతరం వీటిలో ఐదు డిమాండ్లు నెరవేర్చడానికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించారు. వాటిలో రేషన్ సరుకులు ఆయా దుకాణాలకు చేర్చే క్రమంలో హమాలీల ఖర్చులు ప్రభుత్వమే భరించడానికి, డీలరు ఆకస్మికంగా చనిపోతే వారి కుటుంబాల వారికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించడానికి అంగీకరించింది. చంద్రన్న బీమాలో రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు, రేషన్ దుకాణాలకు విద్యుత్ సరఫరా, ఇంటి పన్నులు జనరల్ కేటగిరీలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చింది. ఆయా హామీలను జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఆశలు పెట్టుకున్న డీలర్లకు రోజులు గడుసున్న కొద్దీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక జీవోలు విడుదల కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకు నోచుకోని కమీషన్ పెంపు జీవో డీలర్ల డిమాండ్లలో వేతనం అమలు ప్రధానమైంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదని దీనిపై అధ్యయానికి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుందన్న డీలర్ల వేదనతో స్పందించిన ప్రభుత్వం ప్రస్తుతం క్వింటాలుకు ఇస్తున్న కమీషన్ రూ.70 కు అందనంగా మరో 30 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈమేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. కానీ నేటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. విడుదల చేసిన జీవో కూడా అస్పష్టంగా ఉందని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో జీవోలో పొందుపర్చకపోవడాన్ని డీలర్లు దుయ్యబడుతున్నారు. కంటి తుడుపు చర్యలో భాగంగానే జీవో జారీ చేశారని డీలర్లు వాపోతున్నారు. చెల్లుబాటు కాని చెక్కులు రేషన్ డీలర్ల పనితీరు.. పంపిణీ సంతృప్తికరంగా ఉంటే నగదు పోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. 85 శాతం సరుకులు పంపిణీ చేసిన డీలరుకు రూ.2 వేలు నగదు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. నగదుకు జనవరిలో జిల్లా వ్యాప్తంగా 461 మంది డీలర్లు ఎంపికయ్యారు. గత నెలలో తూతూ మంత్రంగా ఓ 50 మంది డీలర్లకు చెక్కులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆ ఊసే లేదు. ప్రోత్సాహక చెక్కులు పట్టుకుని బ్యాంకులకు వెళ్లిన డీలర్లకు చుక్కెదురైంది. బ్యాంకులో జమ చేసిన డీలర్ల చేతికి నేటికీ సొమ్ములు చేతికందలేదు. ఆరా తీస్తే ఖజానాలో సొమ్ములు లేవంటూ అధికారులు చెప్పుకొస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా రేషన్ పంపిణీ శాతం 85 నుంచి 90 శాతం ఉంటే రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం ఇస్తామంటూ మరో ప్రకటన చేయడాన్ని డీలర్లు ఆక్షేపిస్తున్నారు. ఇచ్చిన చెక్కులకు దిక్కులేదు మరో ఐదు వేలా అంటూ నిట్టూరుస్తున్నారు. గంపెడాశతో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రిని సన్మానించిన డీలర్లకు చివరికు మొండి చేయి చూపడంపై డీలర్లు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం డీలర్లను నమ్మక ద్రోహం చేసిందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రభుత్వం డీలర్ల సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నా హామీలు నెరవేరకపోవడంతో డీలర్లు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం కమీషన్ పెంచుతూ జారీ చేసిన జీవో నేటికీ అమలు కాలేదు. మరో నాలుగు డిమాండ్ల పెంపునకు అంగీకరించి నేటికీ జీవో జారీ చేయలేదు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. – రాజులపాటి గంగాధరావు, రేషన్ డీలర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
తాత్కాలిక విరమణ
► జల్లికట్టు తరహాతో భయపెట్టిన అన్నదాతలు ► మెరీనాలో మోహరించిన పోలీసులు ► రెండు నెలల్లో డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం హామీ సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నదాతలను ఆదుకోకుంటే జల్లికట్టు తరహా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని భయపెట్టారు. నగరం దిగ్బంధం అయిపోయింది. మెరీనా బీచ్ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దిగివచ్చిన ప్రభుత్వం రెండునెలల గడువు కోరడంతో రైతన్నలు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం దక్షిణభారత నదుల అనుసంధానం సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేశారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపి డిమాం డ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఢిల్లీలో ఆందోళన విరమించారు. అయితే సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్లీ ఆందోళనబాట పట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంజలి ఘటించడానికి, రైతులు కోర్కెల సాధన కోసం చెన్నై చేపాక్‌లోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద శుక్రవారం నిరవధిక ఆందోళన ప్రారంభించారు. కాల్పుల్లో మృతి చెందిన రైతుకు తొలిరోజున అంజలి ఘటించేలా ఆం దోళన జరిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి చెన్నైలోని పలు ప్రాంతాల నుంచి వం దల సంఖ్యలో యువకులు రైతుల ఆందోళనా శిబిరానికి చేరుకున్నారు. ఇంకా మరికొందరు ద్విచక్రవాహనాల్లో బయలుదేరగా నగరంలోని పలుచోట్ల పోలీసులు నిలిపివేసి వెనక్కు పంపారు. అ తరువాత రైతుల అందోళనా శిబిరం ఉన్న చేపాక్ ప్రభుత్వ అతిథిగృహం వైపు వెళ్లే అన్ని మార్గాలకు బారికేడ్లను అడ్డుపెట్టి ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఆందోళనా శిబిరం వైపు వాహనాలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. వంద మందికి పైగా పోలీసులు ఆ పరిసరాల్లో బందోబస్తుగా నిలిచారు. వాలాజా రోడ్డులో వాహనాలను అనుమతించకుండా దారిమళ్లించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్యోగాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్నాశాలై, కామరాజర్శాలై ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో యువకులు తరలిరావడంతో మరో జల్లికట్టు ఉద్యమంలా మారుతుందని కంగారుపడిన పోలీసు యంత్రాంగం మెరీనా బీచ్ వద్ద గట్టి బందోబస్తు పెట్టింది. రెండోరోజు ఆందోళన సందర్భంగా అర్ధనగ్నంగా శిబిరంలో కూర్చున్నారు. చేపాక్ స్టేడియం సమీపంలో కార్పొరేషన్ పార్కులోని టాయిలెట్ల వినియోగానికి అనుమతించారు. పోలీసులే రైతులకు ఆహార సదుపాయాన్ని కల్పించారు. కాగా, చెన్నై సచివాలయంలో సీఎంతో చర్చలకు రైతు ప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. అయ్యాకన్ను నేతృత్వంలో ఐదు గురు రైతులు సీఎంతో చర్చలు జరిపారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, చెరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్లను సీఎం ముందుంచారు. ముఖ్యమంత్రితో చర్చించిన ఆంశాలను రైతులకు వివరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సచివాలయంలో మీడియాకు అయ్యాకన్ను చెప్పాడు. సీఎంను కలిసిన అనంతరం అయ్యాకన్ను నేరుగా ఆందోళనా శిబిరానికి వచ్చి సీఎంతో చర్చించిన ఆంశాలను వివరించాడు. పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేద్దామని కోరగా అందరూ చేతులు ఊపుతూ తమ ఆమోదాన్ని తెలిపారు. ఆ తరువాత ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయ్యాకన్ను మీడియా వద్ద ప్రకటించాడు. రెండు నెలల్లోగా తమ డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం అంశాన్ని ప్రస్తావించగా, తమిళనాడులోకి వాటిని రానివ్వమని ఆర్థికమంత్రి జయకుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అర్ధనగ్నంగానే సీఎం వద్దకు: సీఎంతో చర్చలకు వచ్చేవారు చొక్కాలు ధరించి రావాలని పోలీసులు కోరారు. దీంతో ఆందోళనా శిబిరాల్లోని వారికి చొక్కాలు తెచ్చివ్వాలని బందోబస్తులో ఉన్న పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే అయ్యాకన్ను సహా మిగిలిన రైతు ప్రతినిధులు చొక్కా వేసుకునేది లేదని భీష్మించుకోవడంతో అర్ధనగ్నంగానే సీఎం వద్దకు అనుమతించక తప్పలేదు -
'పెద్దల’పోటాపోటీ
‘పెద్దల’ సభపై జిల్లా నేతల కన్ను పడింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు పోటాపోటీ లాబీయింగ్‌కు తెరలేపారు. అధిష్టానం హామీ తమకే ఉందంటూ ఎవరికివారు పావులు కదుపుతుండడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి కే సీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులుహరీశ్వర్రెడ్డి, యాదవరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు రోజలుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఇరువురు నేతలు శాసనమండలి చాన్స్‌పై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. - ఎమ్మెల్యేల కోటాపై హరీశ్వర్, యాదవరెడ్డి కన్ను - జోరుగా లాబీయింగ్.. - సీఎం హామీకి ప్రయత్నాలు - కుదరకపోతే స్థానికసంస్థల కోటాలో చాన్స్‌కు పట్టు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల కోటాలో జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు రానున్నాయి. ఇటీవల పట్నం నరేందర్‌రెడ్డి పదవీ విరమణతో ఒక సీటు ఖాళీ కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో అదనంగా జిల్లాకు మరోస్థానం లభించింది. ఈ రెండింటికీ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు హరీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి సుముఖత చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు, శ్రమతో కూడుకున్నది కావడంతో ఎమ్మెల్యేల కోటావైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయి న యాదవరెడ్డి తనకు మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని గులాబీ అధిష్టానాన్ని కోరుతుం డగా, కష్టకాలంలో టీఆర్ఎస్కు అండగా నిలిచిన తనకు చాన్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉం డడం.. వీటికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నేతల కు అవకాశం లభిస్తుందో లేదో అనేది ఉత్కంఠగా మారింది. ఉభయతారకంగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యాదవరెడ్డి ఆ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగిన యాదవరెడ్డి నవాబుపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. అయితే, జిల్లా పరిషత్ పీఠం దక్కించుకునేందుకు తగినంత సంఖ్యలో సీట్లు దక్కకపోవ డం.. క్యాంపు నిర్వహణ కష్టంగా భావి ంచిన ఆయన అనూహ్యంగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు తారుమారు కావడంతో జెడ్పీ కుర్చీ కాస్తా అధికారపార్టీ వశమైంది. ఇప్పటికీ నవాబ్‌పేట జెడ్పీటీసీగా కొనసాగుతున్న యాదవరెడ్డి మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే గట్టిహామీ తీసుకున్న తర్వాతే గులాబీ కం డువా కప్పుకున్నారనే ప్రచారం జరి గింది. ఎమ్మెల్యేల కోటాలోనే ఆయనకు ఛాన్స్ ఇస్తారని ఆయన సన్నిహితవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యం లోనే ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా హరీశ్వర్‌రెడ్డి తెరమీదకు రావడంతో పోటీ నెల కొంది. లోకల్‌బాడీ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నందున.. ఎమ్మెల్యేల కోటాలో ఒకరికి ఛాన్స్ ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కోటాలో తమ పేరునే ఖరారు చేయాలని ఇరువురు పట్టుబడుతున్నట్లు సమాచారం. స్థానికసంస్థల కోటాలో ఖర్చు భరించ డం తనవల్ల కాదని, గతంలో జెడ్పీ చైర్మన్ పీఠాన్నీ ఇదే కారణంతో వదులుకున్నందున తన పేరును ఎమ్మెల్యేల కో టాలో పరిగణనలోకి తీసుకోవాలని యాదవరెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు తెలిసింది. కాగా, హరీశ్వర్‌రెడ్డి సై తం ఎమ్మెల్యేల కోటాపైనే మొగ్గు చూ పుతున్నారు. పట్టువిడుపులు తప్పవంటే స్థానిక సంస్థల కోటాలోనైనా పోటీకి రెడీ కావాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.