మలేరియా ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది? | malaria disease | Sakshi
Sakshi News home page

మలేరియా ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?

Published Sat, Sep 10 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

మలేరియా ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?

మలేరియా ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?

పోటీపరీక్షల్లో బయాలజీకి సంబంధించి జీవప్రపంచం, హార్మోన్లు, విటమిన్లు, మూలకాలు, మానవ అవయవ వ్వవస్థ - నిర్మాణం, పనితీరు, వ్యాధులు - అవి వ్యాపించే విధానం, నివారణ పద్ధతులు, వ్యాక్సిన్లు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
 
 హార్మోన్లు
 మొక్కల్లో, జంతువుల్లో వివిధ రకాల హార్మోన్లు ఉంటాయి.
 మొక్కల్లో ఉండే హార్మోన్లు: 1. ఆక్సిన్లు, 2. జిబ్బరెల్లిన్లు, 3. సైటోకైనిన్లు, 4. ఇథిలిన్, 5. అబ్‌సిసిక్ ఆమ్లం
  జంతువుల్లో ఉండే హార్మోన్లు: జంతువుల్లో వివిధ గ్రంథులు వివిధ హార్మోన్లను స్రవిస్తాయి.  
 హార్మోన్లను స్రవించే గ్రంథులు: పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్, పారా థైరాయిడ్, అడ్రినల్,     పాంక్రియాస్ (క్లోమం),     గోనాడ్‌‌స (బీజకోశాలు).
 ఈ అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చదివితే కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు.
 గతంలో కింది ప్రశ్న అడిగారు..
  శరీరంలో ఎముక నిర్మాణానికి అవ సరమైన మూలకాలను సమతాస్థితిలో ఉంచే గ్రంథి?
 ఎ) థైరాయిడ్     బి) అడ్రినల్
 సి) పారాథైరాయిడ్     డి) పిట్యూటరీ
 జ: (సి) అడ్రినలిన్ అయాన్లను నియంత్రి స్తుంది. థైరాయిడ్‌కు అయోడిన్‌తో సంబంధం ఉంటుంది. ఇలాంటి అంశాలను గుర్తుంచుకుంటే తేలిగ్గా సమాధానం గుర్తించొచ్చు.
 కింది ప్రశ్నలను గమనించండి..
  మానవ శరీరంలో అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది?
 ఎ) కాలేయం    బి) క్లోమం
 సి) పిట్యూటరీ    డి) థైరాయిడ్    
 జ. (డి) అతిపెద్దగ్రంథి, అతి ప్రధాన గ్రంథి, అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి వంటి వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈపదాలతో తికమక పెట్టొచ్చు.   కాబట్టి ప్రతి పదానికీ సంబంధించిన విష యాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే సుల భంగా సమాధానం గుర్తించొచ్చు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. అతి ప్రధాన గ్రంథి పిట్యూటరీ, మిశ్రమ గ్రంథి- క్లోమం.
  కింది వాటిలో మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది?
 ఎ) థైరాయిడ్     బి) కాలేయం
 సి) అడ్రినల్     డి) క్లోమం
 జ: (డి) క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇది ఎంజైములను, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది విడుదల చేసే హార్మోన్లు...
 ఎ) ఇన్సులిన్    బి) గ్లూకగాన్.
  ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. ఎక్కువైన గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మారుస్తుంది.
  ఇది గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి సరైన సమాధానం క్లోమం.
 
  విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
 ఎ) ఆక్సిన్    బి) జిబ్బరెల్లిన్
 సి) సైటోకైనిన్    డి) ఇథిలిన్
 జ: (బి) జిబ్బరెల్లిన్, ఇథిలిన్ ఫలాలకు సంబంధించిన హార్మోన్లు. విత్తనాలు లేని (అనిషేక) ఫలాలు ఏర్పడటానికి  జిబ్బరెల్లిన్; ఫలాలు త్వరగా పక్వం చెందడానికి ఇథిలిన్ తోడ్పడతాయి.
 
  కింది వాటిలో గుల్మనాశకాన్ని  గుర్తించండి?
 ఎ) ఐఅఅ     బి) ఐఆఅ
 సి) ూఅఅ    డి) 2, 4ఈ
 జ: (డి) ఆక్సిన్ల గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించొచ్చు. మొక్కల్లో సహజంగా ఉండే ఆక్సిన్ ఐఅఅ. మిగిలి నవి కృత్రిమంగా రూపొందించినవి. వీటిలో ఐఆఅ వేర్ల ఉత్పత్తికి, ూఅఅ పుష్పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. 2,4ఈ, 2,4,5ఖీ అనేవి గుల్మనాశకాలు (కలుపు మొక్కలనాశని) అని గుర్తుంచుకోవాలి.
 
 మోడల్ ప్రశ్నలు
 1.    భారత్‌లో అంధత్వానికి ముఖ్యమైన కారణం?
 1) ట్రకోమా    2) కాటరాక్ట్
 3) గ్లుకోమా    4) రోడ్డు ప్రమాదాలు
 2.    మానవ శరీరంలోని ఏ అవయవం దెబ్బతినడం వల్ల ‘ఎన్‌సెఫలైటిస్’ వ్యాధి వస్తుంది?
 1) గుండె    2) మూత్రపిండాలు
 3) మెదడు    4) కాలేయం
 3.    వేటిని నశింపజేయడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు?
 1) జీవులు    2) సూక్ష్మజీవులు
 3) వైరస్    4) బ్యాక్టీరియా
 4.    లాలాజలంలో ఉండే ఎంజైమ్?
 1) లైపేజ్    2) పెప్సిన్
 3) ట్రిప్సిన్    4) థయలిన్
 5.    ల్యుకేమియా వ్యాధి దేనికి సంబంధించింది?
 1) నాడీ వ్యవస్థ     2)గిఆఇ అధికమవడం
 3) చర్మం     4) శ్వాసక్రియ
 6.    కింది వాటిలో రైబోజోమ్స్ అధికంగా కలిగి ఉన్నది?
 1) డీఎన్‌ఏ    2) ఆర్‌ఎన్‌ఏ
 3) హిమోగ్లోబిన్    4) ఏదీకాదు
 7.    మానవ మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రం ఎక్కడ ఉంటుంది?
 1) సెరిబ్రం    2) సెరిబెల్లం
 3) మెడుల్లా    4) వల్కలం
 8.    ఎండుకుళ్లు తెగులుకు కారణం?
 1) కీటకాలు    2) ఫంగస్
 3) బ్యాక్టీరియా    4) ఏదీకాదు
 9.
 మెనింజైటిస్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది?
 1) వైరస్    2) ఫంగస్
 3) బ్యాక్టీరియా    4) మెనింజోకోకస్
 10.    కింది వాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి?
 1) మశూచి    2) కలరా
 3) టెటానస్    4) ట్యూబర్‌క్యులోసిస్
 11.    పాలను పాశ్చరైజేషన్ చేయటం అంటే?
 1) కొవ్వును పెంచటం
 2) ప్రొటీన్‌‌సను పెంచటం
 3) సూక్ష్మజీవులను చంపటం
 4) నాణ్యతను మార్చటం
 12.    మలేరియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?
 1) ప్లీహం    2) పేగు
 3) కాలేయం    4) ఊపిరితిత్తులు
 13.    ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు?
 1) ఆల్ఫా      2) బీటా
 3) గామా     4) పైవన్నీ
 14.    వనస్పతితో కాకుండా, నూనెతో వంట చేసుకోవాలని చాలామంది డాక్టర్లు సూచిస్తారు. ఎందుకు?
 1) నూనెలో సంతృప్త కొవ్వులుంటాయి
 2) కొవ్వులో అసంతృప్త కొవ్వులుంటాయి
 3) నూనెతో సులువుగా వంట చేయొచ్చు
 4) నూనె చాలా చవక
 15.    విటమిన్-ఎ అధికంగా దేనిలో ఉంటుంది?
 1) యాపిల్    2) అరటి
 3) నారింజ    4) గుడ్డు
 సమాధానాలు
 1) 2     2) 3     3) 4     4) 4
 5) 2     6) 2     7) 1     8) 2
 9) 4     10) 1     11) 3     12) 3
 13) 2     14) 2     15) 4     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement