Malaria disease
-
మలేరియాకు ముకుతాడు!
సాక్షి, అమరావతి: మలేరియా తగ్గుముఖం పట్టింది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 2020లోనే అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ వైపు భారీగా వర్షాలు పడుతున్నా కేసుల నమోదు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది దోమ కాటు జ్వరాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు తేలింది. ఓ వైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే మరోవైపు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చారు. ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో దోమకాటు వ్యాధులపై పర్యవేక్షణ చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పారిశుధ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 2016 తర్వాత తగ్గుముఖం ► 2016తో పోల్చుకుంటే 2019 నాటికి 87.60 శాతం మలేరియా కేసులు తగ్గాయి. రాష్ట్రంలో 11 సెంటినల్ సర్వెలెన్స్ ఆస్పత్రుల్లో కేసుల నిర్ధారణ, చికిత్స జరిగింది. ఈ ఏడాది మృతుల సంఖ్య ఒక్కటి కూడా లేదు. ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 13.33 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. 446 హైరిస్క్ గ్రామాల్లో మలేరియా స్క్రీనింగ్ కార్యక్రమం పూర్తి అయింది. ఇప్పటిదాకా 1.48 కోట్ల మందికి మలేరియాపై స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ► చికున్‌గున్యా, డెంగీ కేసుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దోమకాటు జ్వరాలు రాకుండా క్షేత్ర స్థాయిలో సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షించారు. డెంగీ, గున్యా జ్వరాలు సోకిన బాధితులకు తక్షణమే వైద్యమందేలా చర్యలు తీసుకున్నారు. నవంబర్ మాసాంతం వరకు మలాథియాన్, పైరిథ్రిమ్ మందులు పిచికారి చేయాలని నిర్ణయించారు. -
తగ్గని సీజనల్ జ్వరాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాను సీజనల్ జ్వ రాలు వదలడం లేదు. పల్లె, పట్నం అని తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నా యి. వానాకాలం ముగిసి నెలరోజులు గడుస్తున్నా తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. టైఫాయిడ్, డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్లతో ప్రజలు ఆస్పత్రులపాలవుతున్నారు. టెస్టుల పేరుతో బాధితుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ అరకొర వైద్యంతో సరిపెడుతోంది. దీంతో మెరుగైన సేవలకోసం రోగులు పరకాల, హన్మకొండ, వరంగల్ లాంటి ప్రాంతాలకు పరుగుపెడుతున్నారు. వణికిస్తున్న జ్వరాలు.. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల క్రితం తగ్గినట్టు కనిపించిన జ్వరాలు మళ్లీ వణికిస్తున్నాయి. ముఖ్యంగా టైఫాయిడ్, వైరల్ జ్వరాల తీవ్రత అధికమైంది. దీనికితోడు వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పగలు విపరీతమైన ఎండవేడి.. రాత్రి సయంలో చలి పెరిగింది. దీంతో దగ్గు, జలుబులతో జనాలు గోసపడుతున్నారు. మరో వైపు డెంగీ జ్వరాలు కలవరపెడుతున్నాయి. శరీరం ఏమాత్రం వేడిగా అనిపించినా డెంగీ జ్వరమేమో అని అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అపరిశుభ్రతే అసలు సమస్య వర్షాకాలం పారిశుద్ధ సమస్య ఎక్కువగా ఉంటుంది. జ్వరాల తీవ్రత సైతం అధికంగా ఉంటుంది. జిల్లాలో వానలు తగ్గుముఖం పట్టి దాదాపు నెలరోజులు గడిచినా పారిశుద్ధ్య సమస్య అలాగే ఉంది. ఏ పల్లెను చూసినా మురికి గుంతలు, దోమలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, పందుల బెడద కనిపిస్తోంది. పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభమైనప్పటి నుంచి పారిశుద్ధ్య సమస్య అధికమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చే జ్వరాలకు దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పరీక్షలకు తడిసిమోపెడు.. జిల్లాలోని ప్రజలు ఎక్కువ శాతం హన్మకొండ, వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా ముందుగా పలు రకాల పరీక్షలు చేయినిదే వైద్యులు మందులు రాసే పరిస్థితి లేదు. ఈ టెస్ట్‌ల ఖర్చే తడిసి మోపెడవుతోంది. జ్వరం రాగానే సీబీపీ, వైడల్, మలేరియా, డెంగీ తదితర పరీక్షలు చేయిస్తున్నారు. ఈ నాలుగు టెస్ట్‌లకు ల్యాబ్‌లలో సుమారు రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతోంది. దీనికి పడకల చార్జీలు అదనం. ఆస్పత్రి స్థాయిని బట్టి రోజుకు రూ.400 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. డెంగీ అని తేలితే నిత్యం రక్తకణాల కౌంటింగ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఇందుకు రోజులకు రూ.500 వరకు వెచ్చించాల్సి వస్తోంది. నామామాత్రంగా వైద్య శిబిరాలు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉండడంతో పల్లె ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధ్వర్యంలో స్థానిక పీహెచ్‌సీల వైద్య బృందం గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి ముందుస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా నెలలో ఒకటి రెండు సార్లు క్యాంపులు నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా రెండు మాత్రలు ఇచ్చి సరిపెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దోమల మందు పిచికారీ చేయిస్తాం.. జిల్లాలో విషజ్వరాలు ప్రభలుతున్న గ్రామాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల వైద్యాధికారులను ఆదేశించాం. గుర్తించిన గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు సైతం నిర్వహిస్తున్నాం. మలేరియా విభాగం అధికారులతో దోమల నివారణకు మందు పిచికారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాను. సీజనల్ వ్యాధుల నివారణపై ఆశ వర్కర్లతో ప్రజలకు అవగహన కల్పిస్తాం. ప్రతి శుక్రవారం డ్రైండే పాటించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుదార్‌సింగ్, డీఎంహెచ్ఓ -
మలేరియా ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?
పోటీపరీక్షల్లో బయాలజీకి సంబంధించి జీవప్రపంచం, హార్మోన్లు, విటమిన్లు, మూలకాలు, మానవ అవయవ వ్వవస్థ - నిర్మాణం, పనితీరు, వ్యాధులు - అవి వ్యాపించే విధానం, నివారణ పద్ధతులు, వ్యాక్సిన్లు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. హార్మోన్లు మొక్కల్లో, జంతువుల్లో వివిధ రకాల హార్మోన్లు ఉంటాయి. మొక్కల్లో ఉండే హార్మోన్లు: 1. ఆక్సిన్లు, 2. జిబ్బరెల్లిన్లు, 3. సైటోకైనిన్లు, 4. ఇథిలిన్, 5. అబ్సిసిక్ ఆమ్లం జంతువుల్లో ఉండే హార్మోన్లు: జంతువుల్లో వివిధ గ్రంథులు వివిధ హార్మోన్లను స్రవిస్తాయి. హార్మోన్లను స్రవించే గ్రంథులు: పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్, పారా థైరాయిడ్, అడ్రినల్, పాంక్రియాస్ (క్లోమం), గోనాడ్స (బీజకోశాలు). ఈ అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చదివితే కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు. గతంలో కింది ప్రశ్న అడిగారు.. శరీరంలో ఎముక నిర్మాణానికి అవ సరమైన మూలకాలను సమతాస్థితిలో ఉంచే గ్రంథి? ఎ) థైరాయిడ్ బి) అడ్రినల్ సి) పారాథైరాయిడ్ డి) పిట్యూటరీ జ: (సి) అడ్రినలిన్ అయాన్లను నియంత్రి స్తుంది. థైరాయిడ్‌కు అయోడిన్‌తో సంబంధం ఉంటుంది. ఇలాంటి అంశాలను గుర్తుంచుకుంటే తేలిగ్గా సమాధానం గుర్తించొచ్చు. కింది ప్రశ్నలను గమనించండి.. మానవ శరీరంలో అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది? ఎ) కాలేయం బి) క్లోమం సి) పిట్యూటరీ డి) థైరాయిడ్ జ. (డి) అతిపెద్దగ్రంథి, అతి ప్రధాన గ్రంథి, అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి వంటి వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈపదాలతో తికమక పెట్టొచ్చు. కాబట్టి ప్రతి పదానికీ సంబంధించిన విష యాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే సుల భంగా సమాధానం గుర్తించొచ్చు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. అతి ప్రధాన గ్రంథి పిట్యూటరీ, మిశ్రమ గ్రంథి- క్లోమం. కింది వాటిలో మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది? ఎ) థైరాయిడ్ బి) కాలేయం సి) అడ్రినల్ డి) క్లోమం జ: (డి) క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇది ఎంజైములను, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది విడుదల చేసే హార్మోన్లు... ఎ) ఇన్సులిన్ బి) గ్లూకగాన్. ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. ఎక్కువైన గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మారుస్తుంది. ఇది గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి సరైన సమాధానం క్లోమం. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? ఎ) ఆక్సిన్ బి) జిబ్బరెల్లిన్ సి) సైటోకైనిన్ డి) ఇథిలిన్ జ: (బి) జిబ్బరెల్లిన్, ఇథిలిన్ ఫలాలకు సంబంధించిన హార్మోన్లు. విత్తనాలు లేని (అనిషేక) ఫలాలు ఏర్పడటానికి జిబ్బరెల్లిన్; ఫలాలు త్వరగా పక్వం చెందడానికి ఇథిలిన్ తోడ్పడతాయి. కింది వాటిలో గుల్మనాశకాన్ని గుర్తించండి? ఎ) ఐఅఅ బి) ఐఆఅ సి) ూఅఅ డి) 2, 4ఈ జ: (డి) ఆక్సిన్ల గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించొచ్చు. మొక్కల్లో సహజంగా ఉండే ఆక్సిన్ ఐఅఅ. మిగిలి నవి కృత్రిమంగా రూపొందించినవి. వీటిలో ఐఆఅ వేర్ల ఉత్పత్తికి, ూఅఅ పుష్పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. 2,4ఈ, 2,4,5ఖీ అనేవి గుల్మనాశకాలు (కలుపు మొక్కలనాశని) అని గుర్తుంచుకోవాలి. మోడల్ ప్రశ్నలు 1. భారత్‌లో అంధత్వానికి ముఖ్యమైన కారణం? 1) ట్రకోమా 2) కాటరాక్ట్ 3) గ్లుకోమా 4) రోడ్డు ప్రమాదాలు 2. మానవ శరీరంలోని ఏ అవయవం దెబ్బతినడం వల్ల ‘ఎన్సెఫలైటిస్’ వ్యాధి వస్తుంది? 1) గుండె 2) మూత్రపిండాలు 3) మెదడు 4) కాలేయం 3. వేటిని నశింపజేయడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు? 1) జీవులు 2) సూక్ష్మజీవులు 3) వైరస్ 4) బ్యాక్టీరియా 4. లాలాజలంలో ఉండే ఎంజైమ్? 1) లైపేజ్ 2) పెప్సిన్ 3) ట్రిప్సిన్ 4) థయలిన్ 5. ల్యుకేమియా వ్యాధి దేనికి సంబంధించింది? 1) నాడీ వ్యవస్థ 2)గిఆఇ అధికమవడం 3) చర్మం 4) శ్వాసక్రియ 6. కింది వాటిలో రైబోజోమ్స్ అధికంగా కలిగి ఉన్నది? 1) డీఎన్ఏ 2) ఆర్ఎన్ఏ 3) హిమోగ్లోబిన్ 4) ఏదీకాదు 7. మానవ మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రం ఎక్కడ ఉంటుంది? 1) సెరిబ్రం 2) సెరిబెల్లం 3) మెడుల్లా 4) వల్కలం 8. ఎండుకుళ్లు తెగులుకు కారణం? 1) కీటకాలు 2) ఫంగస్ 3) బ్యాక్టీరియా 4) ఏదీకాదు 9. మెనింజైటిస్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది? 1) వైరస్ 2) ఫంగస్ 3) బ్యాక్టీరియా 4) మెనింజోకోకస్ 10. కింది వాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి? 1) మశూచి 2) కలరా 3) టెటానస్ 4) ట్యూబర్క్యులోసిస్ 11. పాలను పాశ్చరైజేషన్ చేయటం అంటే? 1) కొవ్వును పెంచటం 2) ప్రొటీన్సను పెంచటం 3) సూక్ష్మజీవులను చంపటం 4) నాణ్యతను మార్చటం 12. మలేరియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది? 1) ప్లీహం 2) పేగు 3) కాలేయం 4) ఊపిరితిత్తులు 13. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు? 1) ఆల్ఫా 2) బీటా 3) గామా 4) పైవన్నీ 14. వనస్పతితో కాకుండా, నూనెతో వంట చేసుకోవాలని చాలామంది డాక్టర్లు సూచిస్తారు. ఎందుకు? 1) నూనెలో సంతృప్త కొవ్వులుంటాయి 2) కొవ్వులో అసంతృప్త కొవ్వులుంటాయి 3) నూనెతో సులువుగా వంట చేయొచ్చు 4) నూనె చాలా చవక 15. విటమిన్-ఎ అధికంగా దేనిలో ఉంటుంది? 1) యాపిల్ 2) అరటి 3) నారింజ 4) గుడ్డు సమాధానాలు 1) 2 2) 3 3) 4 4) 4 5) 2 6) 2 7) 1 8) 2 9) 4 10) 1 11) 3 12) 3 13) 2 14) 2 15) 4 -
‘స్వీట్’గా నయం చేస్తారు
అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రదేశాల్లోనే జబ్బువస్తే నయం చేసుకోడానికి బోలెడు తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఆసుపత్రి అనే పదానికి అందనంత దూరంలో ఉండే మారుమూల కొండప్రాంతాల గిరిజనవాసులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే మలేరియా జబ్బు గ్రామాలను పట్టిపీడిస్తుంటే వారిని ఎవరు రక్షిస్తారు? గత ఇరవైఏళ్లుగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్యసేవలందిస్తున్న ఈశ్వరరావుని పలకరిస్తే అడవిబిడ్డలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో అర్థమవుతుంది మనకు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో 49 గ్రామాల్లో గిరిజన ప్రజలు వర్షం పేరు చెబితే వణికిపోతారు. ఆ వణుకొచ్చేది వానతోపాటు వచ్చే చలివల్ల కాదు. వర్షం వచ్చినపుడు కొండప్రాంతాల నుంచి వచ్చే కలుషితనీటి వల్ల. గిరిజనవాడలంటేనే శుభ్రత అంతంతమాత్రం. దానికి తోడు ఇళ్ల ముందుండే పశువుల కొట్టాలు. కారణాలేవైతేనేం, చినుకు పడడంతోటే జ్వరాలు మొదలవుతాయి. వచ్చింది మలేరియా అని తెలిస్తే ఎలాగోలా ఆసుపత్రికెళ్లి వైద్యం చేయించుకుని బతికి బట్టకడతారు. కాని, తమకు వచ్చిన జబ్బేమిటనేది కూడా వారికి అవగాహన లేకపోతే ఏం చేస్తారు..! ఆ సమయంలో ఈశ్వరరావుకు ఒక ఆలోచన వచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, ఆరోగ్యం అనే అంశాలపై సేవ చేయాలనుకున్నారు. ‘స్వీట్’ (సొసైటీ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైనింగ్) పేరుతో స్వచ్ఛందకార్యకర్తల సాయంతో ఆ గ్రామాలకెళ్లి ‘మలేరియా’పై పోరాడుతున్నారు. అవగాహన, వైద్యం... ‘‘చైతన్య యువజన సేవాసంఘం పేరుతో 1991లో గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, నాకు చేతనైనంత సేవ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మారుమూల గ్రామాల్లో మలేరియా వల్ల గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారని తెలిసి వారికి అందుబాటులో ఉండాలనుకున్నాను. అందుకే 1997లో ‘స్వీట్’ ఆర్గనైజేషన్ స్థాపించాను. 49 గ్రామాల్లో... గ్రామానికి ఒకరు చొప్పున వాలంటీర్లను ఏర్పాటుచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాను. వర్షం చినుకులు పడడంతోటే గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీక్షలు మొదలుపెట్టేస్తాం. మలేరియా వచ్చినవారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యపరంగా అభివృద్ధి ఉన్న గ్రామాల్లో మార్పు తేవడం కొంతవరకూ సులువు. కాని ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజల జీవనవిధానాల్లో మార్పులు తేవడం అంత తేలిక కాదు. ఇలా ఇరవై ఏళ్ల నుంచి ఇంటింటికీ తిరుగుతుంటే... ఎట్టకేలకు వారిలో కొద్దిపాటి మార్పు వచ్చింది’’ అని చెప్పారు ఈశ్వరరావు. ‘స్వీట్’ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి ‘వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ మలేరియా నిర్మూలన ప్రాజెక్టును వీరికి అప్పగించింది. కుష్ఠు రోగులకు కూడా... సీజనల్‌గా వచ్చే మలేరియా వంటి జబ్బులొక్కటే కాకుండా కుష్ఠువ్యాధి బాధితులపైన కూడా ‘స్వీట్’ దృష్టి పెట్టింది. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’ వారి సహకారంతో ఆ గ్రామాల్లో కుష్ఠువ్యాధి గ్రస్థులకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్య, వైద్యసౌకర్యాలు అందుబాటులో లేనిచోట ఎన్నిరకాల జబ్బులైనా వస్తాయి. గ్రామాల్లో ఆ రెండింటినీ ఏర్పాటుచేస్తే తప్ప ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరకదు. మా సంస్థ లక్ష్యాల్లో మరొకటి మహిళా సంక్షేమం. వారికి ఉపాధి అవకాశాల్లో భాగంగా అరటినారతో బ్యాగుల్ని తయారుచేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని ముగించారు ఈశ్వరరావు. ‘స్వీట్’ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. - భువనేశ్వరి