మర్చంట్ నేవీతో ఖండాంతర అవకాశాలు | Merchant Navy continental Opportunities | Sakshi
Sakshi News home page

మర్చంట్ నేవీతో ఖండాంతర అవకాశాలు

Published Mon, Sep 29 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

మర్చంట్ నేవీతో ఖండాంతర అవకాశాలు

మర్చంట్ నేవీతో ఖండాంతర అవకాశాలు

నిత్య జీవితంలో ఉపయోగించే ఎల్పీజీ, పెట్రోల్ వంటివి మనకు అందుబాటులోకి రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. అవి వేల మైళ్ల దూరంలోని విదేశాల నుంచి నౌకల్లో దిగుమతి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే 90 శాతం వస్తువులు ఒక దేశం నుంచి మరో దేశానికి నౌకల్లో రవాణా అవుతుంటాయి. నౌకల్లో వస్తువుల రవాణా, వ్యక్తుల ప్రయాణాలు సాఫీగా జరిగేలా పర్యవేక్షించేవారే.. మర్చంట్ నేవీ సిబ్బంది. ప్రస్తుతం భారత్‌లో అనుభవజ్ఞులైన మర్చంట్ నేవీ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ రంగంలో నిపుణులైన వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మరోవైపు విదేశీ షిప్పింగ్ కంపెనీలు సైతం భారత్‌లో శిక్షణ పొందినవారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.  ఇంగ్లిష్ పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం, తక్కువ వేతనాలకే లభిస్తుండడమే ఇందుకు కారణం. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మర్చంట్ నేవీలో పనిచేస్తున్నారు. సిటీ యువత సాహసాలతో కూడిన మర్చంట్ నేవీ కెరీర్ పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
 
 అధిక వేతనాలు, సముద్ర యానం, ప్రపంచ దేశాలను సందర్శించే అవకాశం... మర్చంట్ నేవీ ప్రత్యేకతలు. మర్చంట్ నేవీ అంటే చాలామంది నావికా దళంగా పొరపాటు పడుతుంటారు. ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి. నావికా దళం సిబ్బంది సముద్ర తీరాల్లో దేశ రక్షణ బాధ్యతలను నిర్వహిస్తారు. మర్చంట్ నేవీ అధికారులు సరకుల ఎగుమతి, దిగుమతి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. నౌకల్లో మనుషుల ప్రయాణాలు కూడా వీటి పరిధిలోనే కొనసాగుతాయి. మర్చంట్ నేవీ అధికారులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలున్నాయి. నౌకలో డెక్ డిపార్ట్‌మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్, స్టీవార్డ్స్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ట్రెయినీగా కెరీర్ ప్రారంభిం చి కేవలం 12-15 ఏళ్లలో కెప్టెన్/మాస్టర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇందులో కుటుంబ జీవితాన్ని కొంత త్యాగం చేయగలిగితే ఈ రంగంలో భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవచ్చు. షిప్‌పై బాధ్యతలు నిర్వర్తించడానికి సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ(సీఓసీ) పొందాల్సి ఉం టుంది. ఇది ఒక లెసైన్స్‌లాంటిది. చాలా దేశాలు సీఓసీని జారీ చేస్తున్నాయి. ఇండియా, యూకే, సింగపూర్, న్యూజిలాండ్ జారీ చేస్తున్న సీఓసీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
 
 పేరున్న మర్చంట్ నేవీలు
  బ్రిటిష్ మర్చంట్ నేవీ
  కెనడియన్ మర్చంట్ నేవీ
  గ్రీక్ మర్చంట్ నేవీ
  ఇండియన్ మర్చంట్ నేవీ
  న్యూజిలాండ్ మర్చంట్ నేవీ  
  పాకిస్థాన్ మర్చంట్ నేవీ
  పోలిష్ మర్చంట్ నేవీ
  స్విస్ మర్చంట్ నేవీ
  యునెటైడ్ స్టేట్స్ మర్చంట్ నేవీ
 ఏయే సంస్థల్లో ఉద్యోగాలు: బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్సును అభ్యసించినవారికి బ్రిటిష్ పెట్రోలియం, పసిఫిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంగ్లో ఈస్ట్రన్ షిప్ మేనేజ్‌మెంట్(ఇండియా) లిమిటెడ్, ఫ్లీట్ పర్సనల్ ప్రైవేట్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షెల్ షిప్పింగ్, సీ లాండియా గ్రూప్, ఎగ్జిక్యూటివ్ షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉన్నాయి.
 
 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
 భారత్‌లో షిప్పింగ్ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇతర నగరాల్లో శాఖా కార్యాలయాలున్నాయి.
 వెబ్‌సైట్: www.shipindia.com
 
 కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు
 మర్చంట్ నేవీ అధికారులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. భిన్న భాషలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు అవసరం. కొన్ని నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అందుకు సంసిద్ధంగా ఉండాలి. నౌకలపై పనిచేసే సిబ్బందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.
 
 ఎప్పటికప్పడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టిపెట్టాలి. అర్హతలు:  మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో అర్హత సాధించి మూడేళ్ల బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్సులో చేరొచ్చు. అంతేకాకుండా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సులో చేరే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సొంతంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి, సీట్లను భర్తీ చేస్తున్నాయి. నౌకల్లో డెక్ ఆఫీసర్‌గా పనిచేయాలంటే.. ఉపరితల రవాణా శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.   
 
 నిపుణులకు భారీ వేతనాలు: మర్చంట్ నేవీ సిబ్బందికి నౌకలను బట్టి వేతనాలు వేర్వేరుగా ఉంటాయి. గ్యాస్, కెమికల్, ఆయిల్ ట్యాంకర్లు, కంటెయినర్ షిప్‌లు, బల్క్ క్యారియర్స్, జనరల్ కార్గో వెస్సల్స్‌లో అధిక వేతనాలు అందుతాయి. డెక్ ఆఫీసర్‌కు ప్రారంభంలో నెలకు రూ.1.25 లక్షలు, సెకండ్ ఆఫీసర్‌కు రూ.1.50 లక్షలు, చీఫ్ ఆఫీసర్‌కు రూ.2.20 లక్షలు, కెప్టెన్‌కు రూ.3 లక్షల వేతనం ఉంటుంది. విదేశీ నౌకల్లో పనిచేస్తే ఇంకా అధిక జీతభత్యాలు పొందొచ్చు. షిప్పింగ్ కంపెనీలు తమకు అవసరమైన సిబ్బందిని ఆరు ఏడు నెలల చొప్పున కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంటాయి.
 
 మర్చంట్ నేవీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ-విశాఖపట్నం
     వెబ్‌సైట్: www.nsdrc.com
     ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ-చెన్నై
     వెబ్‌సైట్: www.imu.edu.in
     టీఎస్ చాణక్య, ఐఎంయూ-ముంబై
     వెబ్‌సైట్: www.imumumbai.com
     తొలానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్-పుణె
     వెబ్‌సైట్: www.tolani.edu
     అప్లయిడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్-న్యూఢిల్లీ
     వెబ్‌సైట్: www.ariedu.com
     ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్-గ్రేటర్ నోయిడా
     వెబ్‌సైట్: www.imi.edu.in   
 
 వ్యాపార నౌకలో విభాగాలు:
 డెక్ డిపార్ట్‌మెంట్
  మాస్టర్  చీఫ్ ఆఫీసర్
  సెకండ్ ఆఫీసర్  థర్డ్ ఆఫీసర్  డెక్ కేడెట్
  బోట్స్‌వెయిన్  ఏబుల్ సీమెన్  ఆర్డినరీ సీమెన్
 ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్
  చీఫ్ ఇంజనీర్  సెకండ్ ఇంజనీర్  థర్డ్ ఇంజనీర్
  ఫోర్త్ ఇంజనీర్  ఎలక్ట్రికల్ ఇంజనీర్/ఎలక్ట్రీషియన్   ఫిఫ్త్ ఇంజనీర్/ జూనియర్ ఇంజనీర్  ఆయిలర్/మోటార్‌మేన్
  వైపర్/యుటిలిటీ మేన్
 స్టీవార్డ్స్ డిపార్ట్‌మెంట్
  చీఫ్ స్టీవార్డ్  చీఫ్ కుక్  స్టీవార్డ్స్ అసిస్టెంట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement