ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతికి 2014 ఏప్రిల్/మేలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీ ఓపెన్ స్కూల్స్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
హైదరాబాద్: ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతికి 2014 ఏప్రిల్ / మేలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీ ఓపెన్ స్కూల్స్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్, ఏపీఓఎస్‌ఎస్ వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 84,672 మంది విద్యార్థులు హాజరవగా 54,576 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఎస్‌ఎస్‌సీ ఫలితాల కోసం చూడండి http://www.sakshieducation.com/results2014/sscaposs.htm