హైదరాబాద్: పదో తరగతి తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ పరీక్ష ఫలితాలను మే 31న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఫలితాలు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మే 21న నిర్వహించిన పాలీసెట్ పరీక్షకు 2,38,947 మంది హాజరు కాగా 1,67,360 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.
అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 9 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. తమ వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకొని 9 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా జూన్ 4వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సాక్షి వెబ్‌సైట్‌లో పాలీసెట్ మాక్ కౌన్సెలింగ్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా విద్యార్థులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటొస్తుందో కూడా తెలుసుకోవచ్చు.
పాలీసెట్ 2014 ఫలితాల కోసం చూడండి http://www.sakshieducation.com/results2014/polycet.htm
ఏపీఆర్జేసీ, ఆర్డీసీ ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్జేసీ, ఆర్డీసీ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. అభ్యర్థులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో తమ మార్కులు, ర్యాంకులు చూసుకోవచ్చు.
'సాక్షి'లో పాలీసెట్ 2014 ఫలితాలు
Published Mon, Jun 2 2014 10:51 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
Advertisement
Advertisement