రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? | What is the Constitutional Parishad symbol? | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?

Published Tue, Jul 1 2014 10:38 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? - Sakshi

రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?

భారత రాజ్యాంగ రచన - సమగ్ర పరిశీలన
భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, సంస్కరణలు దోహదం చేశాయి. రెగ్యులేటింగ్ చట్టం 1773తో  రాజ్యాంగ వికాసం ప్రారంభమైందని చెప్పొచ్చు. అందువల్ల ఈ చట్టాన్ని తొలి లిఖిత చట్టంగా పరిగణిస్తారు. ఆ తర్వాత అనేక చట్టాలు రూపొందించారు. చార్టర్ చట్టాలు (1773-1853), కౌన్సిల్ చట్టాలు (1858-1935), సైమన్ కమిషన్ నివేదిక (1927), నెహ్రూ రిపోర్‌‌ట (1928), మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు (1930-1932), క్రిప్స్ ప్రతిపాదనలు (1942), సి.ఆర్. ఫార్ములా (1944), వేవెల్ ప్రణాళిక (1945), కేబినెట్ మిషన్ ప్లాన్ (1946) లాంటివన్నీ  రాజ్యాంగ రచనకు దోహదం చేశాయి.
 
రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, పనితీరు
1946లో కేబినెట్ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. నిర్మాణం, ఎన్నిక పద్ధతి, సభ్యుల సంఖ్య, ఇతర విధి విధానాలు ఖరారైనప్పటికీ, 1947లో భారత స్వాతంత్య్ర చట్టం ద్వారా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు.
- కేబినెట్ మిషన్‌ప్లాన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్‌కు 1946 జూలై-ఆగస్టుల్లో ఎన్నికలు నిర్వహించారు.
- రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్యను 389గా నిర్ణయించారు. వీరిలో 296 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికవగా, 93 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు.
- 296 మందిలో 292 మంది పదకొండు ప్రావిన్‌‌సల్లోని శాసన సభ్యుల ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో పరోక్షంగా ఎన్నికయ్యారు. మిగిలిన నలుగురు సభ్యులు చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్‌‌గ, బెలూచిస్థాన్ నుంచి ఎన్నికయ్యారు.
- ప్రతి ప్రావిన్‌‌స నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడే ప్రాతినిధ్యం వహించాడు.
- బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మూడు ప్రధాన వర్గాలైన హిందువులు, మహమ్మ దీయులు, సిక్కులకు వారి జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు.
- రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా, నామినేషన్ ద్వారా ఎంపికయ్యారు.
 
కమిటీల ద్వారా సమాచార సేకరణ
- రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేశారు. అవి..
- విషయ కమిటీలు-12, ప్రక్రియ కమిటీలు-10
- మైనర్ కమిటీలు - 15, ఉప కమిటీలు - 7
- అతిపెద్ద కమిటీ - సలహా కమిటీ (54 మంది సభ్యులు)
- అతి ముఖ్య కమిటీ - ముసాయిదా కమిటీ
 
రాజ్యాంగం ఆమోదం, అమలు
ముసాయిదా కమిటీ రెండు ముసాయిదాలను (ఈట్చజ్ట) తయారు చేసింది. మొదటి ముసాయిదా 1948 ఫిబ్రవరి 21నప్రచురితమైంది. రాజ్యాంగ  ప్రతిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా 2,473 చర్చకు వచ్చాయి. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949, నవంబరు 26న ఆమోదించి చట్టంగా మార్చింది. అయితే ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది.

జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో జనవరి 26ను పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా ప్రకటించారు. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు.
 అయితే రాజ్యాంగంలో కొన్ని అంశాలు ముఖ్యంగా పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, రాష్ర్టపతి పదవి ప్రమాణ స్వీకార పద్ధతి, గీగీఐ, గీగీఐఐ భాగంలోని తాత్కాలిక అంశాలు 1949, నవంబరు 26తో అమల్లోకి వచ్చాయి.
 
రాజ్యాంగ పరిషత్ - ఇతర విధులు:
రాజ్యాంగ రచనతో పాటు రాజ్యాంగ పరిషత్ కొన్ని ఇతర చట్టాలను కూడా రూపొందించింది. అందులోని ముఖ్యాంశాలు..
- రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగును గుర్తించడం. (ఏనుగు అత్యంత శక్తిమంతమైన, బలమైన జంతువుకు ప్రతీక)
- మొదటి రాష్ర్టపతిగా రాజేంద్ర ప్రసాద్‌ను ఎన్నుకుంది. (నె్రహూ, పటేల్ ప్రతిపాదించారు)
- 1947, జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది. డాక్టర్ హన్సా జవేరి మెహతా మహిళల తరఫున జాతీయ జెండాను ప్రవేశపెట్టారు.
- కామన్‌వెల్త్‌లో భారత్ సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది.
- 1950, జనవరి 24న జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది.
- రాజ్యాంగ పరిషత్‌ను ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన వ్యక్తి డాక్టర్ బాబు  రాజేంద్రప్రసాద్.
 
మాదిరి ప్రశ్నలు
 1.    భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం?
     ఎ) పార్లమెంట్    బి) రాష్ర్టపతి
     సి) రాజ్యాంగం    డి) ప్రజలు

 2.    రాజ్యాంగ పరిషత్ సభ్యులు?
 ఎ)    బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా నామినేట్ అయ్యారు
 బి)    గవర్నర్ జనరల్ నామినేట్ చేశాడు
 సి)    రాజకీయ పార్టీలు నైష్పత్తిక పద్ధతిలో నామినేట్ చేశాయి
 డి)    పైవేవీ కాదు

 3.    కింది వాటిలో సరికానిది.
 ఎ)    రూల్స్ కమిటీ - రాజేంద్ర ప్రసాద్
 బి)    సలహా కమిటీ - సర్దార్ వల్లభాయ్ పటేల్
 సి)    స్టీరింగ్ కమిటీ - జవహర్‌లాల్ న్రహూ
 డి)    భాషా కమిటీ - మోటూరి సత్యనారాయణ

 4.    ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు ఎవరు?
 ఎ)    కె.ఎం. మున్షి బి) ఎన్. మాధవరావు
 సి)    కె.టి. షా
 డి)    అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

 5.    భారత రాజ్యాంగం-
 ఎ)    పరిణామాత్మకం
 బి)    శాసనీకృతం సి)    సంప్రదాయీకృతం
 డి)    పైవేవీ కాదు

 6.    రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్ అనుసరించిన పద్ధతి?
 ఎ)    విభజన-ఓటింగ్ పద్ధతి
 బి)    మెజారిటీ ఓటింగ్ పద్ధతి
 సి)    ఏకాభిప్రాయ సర్దుబాటు సాధన పద్ధతి
 డి)    నైష్పత్తిక ఓటింగ్ పద్ధతి

 7.    రాజ్యాంగ వికాసంతో సంబంధం లేని సంఘటన?
     ఎ) ఆగస్టు ప్రతిపాదన
     బి) క్రిప్స్ ప్రతిపాదన
     సి) మౌంట్‌బాటన్ ప్రతిపాదన
     డి) కేబినెట్ రాయబార ప్రతిపాదన

 8.    రాజ్యాంగ పరిషత్‌లోని తెలుగువారు?
     ఎ) వి.సి. కేశవరావ్
     బి) పట్టాభి సీతారామయ్య
     సి) ఎన్.జి. రంగా    డి) పైవారందరూ

 9.    అమెరికా-భారత్ రాజకీయ వ్యవస్థలో ఉమ్మడిగా ఉన్న అంశం?
     ఎ) హక్కులు    
     బి) న్యాయసమీక్ష
     సి) మహాభియోగ తీర్మానం
     డి) పైవన్నీ

 10.    కింది వాటిలో సరికానిది-
 ఎ)    రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో ప్రజాభిప్రాయ ఛాయలు లేవు - కె. సంతానం
 బి)    రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటుకే ప్రాధాన్యం ఇచ్చారు - ఒ.పి. గోయల్
 సి)    రాజ్యాంగ పరిషత్ కొన్ని వర్గాల ప్రజలకే ప్రాతినిధ్యం వహించింది - విన్‌స్టన్ చర్చిల్
 డి)    నా అభిష్టానికి వ్యతిరేకంగానే రచన చేశాను - రాజేంద్ర ప్రసాద్

 11.    ‘రాజ్యాంగ పరిషత్’ ప్రతిపాదనను అధికార పూర్వకంగా ఎప్పుడు ప్రకటించారు?
     ఎ) క్రిప్స్ ప్రతిపాదన-1942
     బి) భారత ప్రభుత్వ చట్టం-1935
     సి) కేబినెట్ రాయబారం-1946
     డి) వేవెల్ ప్రణాళిక-1945

 12.    భారత రాజ్యాంగ రచనకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. అయితే సుదీర్ఘకాలం (7 ఏళ్లు) సమయం తీసుకున్న రాజ్యాంగం?
     ఎ) అమెరికా    బి) ఆస్ట్రేలియా
     సి) కెనడా    
     డి) దక్షిణాఫ్రికా

 13.    ఏ దేశ రాజ్యాంగం సంప్రదాయాల ఆధారంగా పనిచేస్తుంది?
     ఎ) ఇంగ్లండ్    బి) ఐర్లాండ్
     సి) నైజీరియా    డి) జపాన్
 
 సమాధానాలు

 1) డి    2) డి    3) సి    4) సి
 5) బి    6) సి    7) ఎ    8) డి
 9) డి    10) డి    11) ఎ    12) బి
 13) ఎ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement