India Constitutional
-
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!
ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది. రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్‌లో 44 ర్యాంక్‌లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి. రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్ని ఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్) – డాక్టర్ పి.ఎస్. చారి, మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
భారత రాజ్యాంగ రచన - సమగ్ర పరిశీలన భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, సంస్కరణలు దోహదం చేశాయి. రెగ్యులేటింగ్ చట్టం 1773తో రాజ్యాంగ వికాసం ప్రారంభమైందని చెప్పొచ్చు. అందువల్ల ఈ చట్టాన్ని తొలి లిఖిత చట్టంగా పరిగణిస్తారు. ఆ తర్వాత అనేక చట్టాలు రూపొందించారు. చార్టర్ చట్టాలు (1773-1853), కౌన్సిల్ చట్టాలు (1858-1935), సైమన్ కమిషన్ నివేదిక (1927), నెహ్రూ రిపోర్ట (1928), మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు (1930-1932), క్రిప్స్ ప్రతిపాదనలు (1942), సి.ఆర్. ఫార్ములా (1944), వేవెల్ ప్రణాళిక (1945), కేబినెట్ మిషన్ ప్లాన్ (1946) లాంటివన్నీ రాజ్యాంగ రచనకు దోహదం చేశాయి. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, పనితీరు 1946లో కేబినెట్ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. నిర్మాణం, ఎన్నిక పద్ధతి, సభ్యుల సంఖ్య, ఇతర విధి విధానాలు ఖరారైనప్పటికీ, 1947లో భారత స్వాతంత్య్ర చట్టం ద్వారా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. - కేబినెట్ మిషన్ప్లాన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్‌కు 1946 జూలై-ఆగస్టుల్లో ఎన్నికలు నిర్వహించారు. - రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్యను 389గా నిర్ణయించారు. వీరిలో 296 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికవగా, 93 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. - 296 మందిలో 292 మంది పదకొండు ప్రావిన్సల్లోని శాసన సభ్యుల ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో పరోక్షంగా ఎన్నికయ్యారు. మిగిలిన నలుగురు సభ్యులు చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ, బెలూచిస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. - ప్రతి ప్రావిన్స నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడే ప్రాతినిధ్యం వహించాడు. - బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మూడు ప్రధాన వర్గాలైన హిందువులు, మహమ్మ దీయులు, సిక్కులకు వారి జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు. - రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా, నామినేషన్ ద్వారా ఎంపికయ్యారు. కమిటీల ద్వారా సమాచార సేకరణ - రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేశారు. అవి.. - విషయ కమిటీలు-12, ప్రక్రియ కమిటీలు-10 - మైనర్ కమిటీలు - 15, ఉప కమిటీలు - 7 - అతిపెద్ద కమిటీ - సలహా కమిటీ (54 మంది సభ్యులు) - అతి ముఖ్య కమిటీ - ముసాయిదా కమిటీ రాజ్యాంగం ఆమోదం, అమలు ముసాయిదా కమిటీ రెండు ముసాయిదాలను (ఈట్చజ్ట) తయారు చేసింది. మొదటి ముసాయిదా 1948 ఫిబ్రవరి 21నప్రచురితమైంది. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా 2,473 చర్చకు వచ్చాయి. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949, నవంబరు 26న ఆమోదించి చట్టంగా మార్చింది. అయితే ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో జనవరి 26ను పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా ప్రకటించారు. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు. అయితే రాజ్యాంగంలో కొన్ని అంశాలు ముఖ్యంగా పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, రాష్ర్టపతి పదవి ప్రమాణ స్వీకార పద్ధతి, గీగీఐ, గీగీఐఐ భాగంలోని తాత్కాలిక అంశాలు 1949, నవంబరు 26తో అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ - ఇతర విధులు: రాజ్యాంగ రచనతో పాటు రాజ్యాంగ పరిషత్ కొన్ని ఇతర చట్టాలను కూడా రూపొందించింది. అందులోని ముఖ్యాంశాలు.. - రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగును గుర్తించడం. (ఏనుగు అత్యంత శక్తిమంతమైన, బలమైన జంతువుకు ప్రతీక) - మొదటి రాష్ర్టపతిగా రాజేంద్ర ప్రసాద్‌ను ఎన్నుకుంది. (నె్రహూ, పటేల్ ప్రతిపాదించారు) - 1947, జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది. డాక్టర్ హన్సా జవేరి మెహతా మహిళల తరఫున జాతీయ జెండాను ప్రవేశపెట్టారు. - కామన్వెల్త్లో భారత్ సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది. - 1950, జనవరి 24న జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది. - రాజ్యాంగ పరిషత్‌ను ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్. మాదిరి ప్రశ్నలు 1. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం? ఎ) పార్లమెంట్ బి) రాష్ర్టపతి సి) రాజ్యాంగం డి) ప్రజలు 2. రాజ్యాంగ పరిషత్ సభ్యులు? ఎ) బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా నామినేట్ అయ్యారు బి) గవర్నర్ జనరల్ నామినేట్ చేశాడు సి) రాజకీయ పార్టీలు నైష్పత్తిక పద్ధతిలో నామినేట్ చేశాయి డి) పైవేవీ కాదు 3. కింది వాటిలో సరికానిది. ఎ) రూల్స్ కమిటీ - రాజేంద్ర ప్రసాద్ బి) సలహా కమిటీ - సర్దార్ వల్లభాయ్ పటేల్ సి) స్టీరింగ్ కమిటీ - జవహర్లాల్ న్రహూ డి) భాషా కమిటీ - మోటూరి సత్యనారాయణ 4. ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? ఎ) కె.ఎం. మున్షి బి) ఎన్. మాధవరావు సి) కె.టి. షా డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ 5. భారత రాజ్యాంగం- ఎ) పరిణామాత్మకం బి) శాసనీకృతం సి) సంప్రదాయీకృతం డి) పైవేవీ కాదు 6. రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్ అనుసరించిన పద్ధతి? ఎ) విభజన-ఓటింగ్ పద్ధతి బి) మెజారిటీ ఓటింగ్ పద్ధతి సి) ఏకాభిప్రాయ సర్దుబాటు సాధన పద్ధతి డి) నైష్పత్తిక ఓటింగ్ పద్ధతి 7. రాజ్యాంగ వికాసంతో సంబంధం లేని సంఘటన? ఎ) ఆగస్టు ప్రతిపాదన బి) క్రిప్స్ ప్రతిపాదన సి) మౌంట్‌బాటన్ ప్రతిపాదన డి) కేబినెట్ రాయబార ప్రతిపాదన 8. రాజ్యాంగ పరిషత్‌లోని తెలుగువారు? ఎ) వి.సి. కేశవరావ్ బి) పట్టాభి సీతారామయ్య సి) ఎన్.జి. రంగా డి) పైవారందరూ 9. అమెరికా-భారత్ రాజకీయ వ్యవస్థలో ఉమ్మడిగా ఉన్న అంశం? ఎ) హక్కులు బి) న్యాయసమీక్ష సి) మహాభియోగ తీర్మానం డి) పైవన్నీ 10. కింది వాటిలో సరికానిది- ఎ) రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో ప్రజాభిప్రాయ ఛాయలు లేవు - కె. సంతానం బి) రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటుకే ప్రాధాన్యం ఇచ్చారు - ఒ.పి. గోయల్ సి) రాజ్యాంగ పరిషత్ కొన్ని వర్గాల ప్రజలకే ప్రాతినిధ్యం వహించింది - విన్స్టన్ చర్చిల్ డి) నా అభిష్టానికి వ్యతిరేకంగానే రచన చేశాను - రాజేంద్ర ప్రసాద్ 11. ‘రాజ్యాంగ పరిషత్’ ప్రతిపాదనను అధికార పూర్వకంగా ఎప్పుడు ప్రకటించారు? ఎ) క్రిప్స్ ప్రతిపాదన-1942 బి) భారత ప్రభుత్వ చట్టం-1935 సి) కేబినెట్ రాయబారం-1946 డి) వేవెల్ ప్రణాళిక-1945 12. భారత రాజ్యాంగ రచనకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. అయితే సుదీర్ఘకాలం (7 ఏళ్లు) సమయం తీసుకున్న రాజ్యాంగం? ఎ) అమెరికా బి) ఆస్ట్రేలియా సి) కెనడా డి) దక్షిణాఫ్రికా 13. ఏ దేశ రాజ్యాంగం సంప్రదాయాల ఆధారంగా పనిచేస్తుంది? ఎ) ఇంగ్లండ్ బి) ఐర్లాండ్ సి) నైజీరియా డి) జపాన్ సమాధానాలు 1) డి 2) డి 3) సి 4) సి 5) బి 6) సి 7) ఎ 8) డి 9) డి 10) డి 11) ఎ 12) బి 13) ఎ