functioning
-
Function of the Heart: విశాల హృదయం
క్వశ్చన్ పేపర్లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్ఫుల్గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు. ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్’ అనే హెడ్‌లైన్‌తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది. -
పార్లమెంట్ పనితీరు ఇలాగేనా?
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకొంటున్నాం. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన పార్లమెంట్ పనితీరు ఎంత సమర్థంగా ఉంటోందని ప్రశ్నించుకోవడానికి ఇంతకంటే సముచిత సందర్భం మరొకటి దొరకదు. 1950లు, 60లలో అంటే స్వాతంత్య్రానంతర కాలపు లోక్‌సభలు దాదాపుగా సగటున నాలుగు వేల గంటలు పనిచేశాయి. కానీ అయిదేళ్ల పాటు పూర్తికాలం పనిచేసిన 16వ లోక్‌సభ కేవలం 1,615 గంటలపాటు మాత్రమే పనిచేసింది. అలాగే, లోక్‌సభ ముఖ్యమైన విధులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటిలో ఒకటి – చట్టాలను ఆమోదించడం. వీటికి సంబంధించి తగినంత చర్చ జరగడం లేదు. తొలి రెండు లోక్‌సభా కాలాల్లో 71 శాతం, 60 శాతం బిల్లులను కమిటీల పరిశీలనకు పంపేవారు. కానీ ఇప్పుడు మాత్రం 25 శాతం బిల్లులను మాత్రమే కమిటీల పరిశీలనకు పంపుతున్నారు. అంటే శాసనం అవసరమైనంత మేరకు తనిఖీకి గురవుతోందా అనేది ప్రశ్న. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా పార్లమెంట్ పనితీరు ఎంత సమ ర్థంగా ఉంటున్నదని ప్రశ్నించడం ఎంతో సముచితంగా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలను భారత పార్లమెంట్ నెరవేరుస్తోందా లేక మనల్ని నిరాశపరుస్తోందా? దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పీఆర్ఎస్’(పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ నుంచి సేకరించిన గణాంకాలు ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవ నెత్తడమే కాదు... మనకు కలవరం కలిగించే నిర్ధారణలను కూడా ఇస్తున్నాయి. తగ్గిన పనిగంటలు ముందుగా మనం లోక్‌సభతో ప్రారంభిద్దాము. అయిదేళ్లపాటు పూర్తి కాలం పనిచేసిన 16వ లోక్‌సభ 1,615 గంటలపాటు పనిచేసింది. అంతకుముందు పూర్తికాలం పనిచేసిన లోక్‌సభలతో పోలిస్తే 16వ లోక్ సభ 40 శాతం తక్కువగా పనిచేసింది. 1950లు, 1960ల నాటి లోక్‌సభలు దాదాపుగా సగటున 4,000 గంటలపాటు పనిచేస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుతం లోక్‌సభ పనిచేసే సమయం బాగా తగ్గి పోతోందని అర్థమవుతుంది. లోక్‌సభ ముఖ్యమైన విధులు రెండూ ఇప్పుడు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటిలో మొదటిది, చట్టాలను ఆమోదించడం. 15వ లోక్‌సభలో 26 శాతం బిల్లులు 30 నిమిషాలలోపే ఆమోదం పొందేవి. అదే 16వ లోక్‌సభలో 6 శాతం బిల్లులు 30 నిమిషాల లోపు ఆమోదం పొందగలిగాయి. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి రెండు లోక్‌సభా కాలాల్లో 71 శాతం, 60 శాతం బిల్లులను కమిటీల పరిశీలనకు పంపేవారు. కానీ ఇప్పుడు మాత్రం 25 శాతం బిల్లులు మాత్రమే కమిటీల పరిశీలనకు పంపు తున్నారు. అంటే శాసనం అవసరమైనంత మేరకు తనిఖీకి గురవు తోందా అనేది ప్రశ్న. తగ్గిన ప్రశ్నలు ఇక లోక్‌సభ రెండో ముఖ్యమైన విధి ఏమిటంటే, ప్రభుత్వాన్ని జవాబుదారీతనంలో ఉంచటమే. కానీ గత నాలుగు లోక్‌సభల్లో ప్రశ్నోత్తరాల సమయం దానికి కేటాయించిన సమయంలో 59 శాతం వరకు మాత్రమే పనిచేసింది. ఇక రాజ్యసభలో అది 41 శాతానికి పడిపోయింది. సభలో నిత్యం కలిగే అంతరాయాలు ప్రశ్నించే అవ కాశాన్ని హరించి వేస్తున్నాయి. నిస్సందేహంగా ఎంపీల ప్రవర్తనను దీనికి కొంతవరకు నిందించాల్సి ఉంటుంది. కానీ, సభను క్రమ శిక్షణలో పెట్టడంలో స్పీకర్ పక్షపాతపూరిత వైఫల్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. ఇక రాష్ట్రాల శాసనసభల్లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత సంవత్సరం శాసనసభలు సగటున 21 రోజులు మాత్రమే పనిచేశాయి. 2020లో రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదం పొందిన బిల్లుల్లో సగం పైగా వాటిని ప్రవేశపెట్టిన రోజే ఆమోదం పొందాయి. స్వేచ్ఛ లేదు! ఇక ప్రత్యేకించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఊపిరాడని స్థితిలో ఉండటమే! దీనికి ఫిరా యింపుల చట్టమే కారణమని నేరుగా ఆరోపించవచ్చు. తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాప్రతినిధులు వీరు అని అందరూ చెప్పుకుంటుంటారు. కానీ తమ పార్టీ నాయకత్వానికి వారు బానిసలుగా మారిపోయారు. ఎందుకంటే తమ పార్టీ జారీచేసే విప్‌కి భిన్నంగా ఎంపీలు ఓటు వేయడాన్ని ఈ ఫిరాయింపుల చట్టం నిరో ధిస్తోంది. ఫిరాయింపుల చట్టం పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభల స్వభావాన్ని ప్రాథమికంగా మార్చివేసిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థకు చెందిన చక్షు రాయ్ చెబుతున్నారు. ఎంపీలకు వారి స్వాతంత్య్రాన్ని వారికి ఇవ్వడానికి, ఫిరా యింపుల వ్యతిరేక చట్టాన్ని ఫైనాన్స్ బిల్లులకూ, అవిశ్వాస తీర్మానం సమయంలో ఓట్లకూ మాత్రమే పరిమితం చేయాల్సిన అవసర ముంది. ఇతర అంశాలపై వారి పార్టీ నాయకత్వంతో విభేదించేం దుకు వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. అభిప్రాయ మార్పిడి జరగాలి ఇక రాజ్యసభలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. రాజ్యాంగపరంగా రాజ్యసభ అంటే ఒక సవరించే ఛాంబర్ అని అర్థం. లోక్‌సభ ఆమోదించిన శాసనం ఇక్కడ పునరాలోచనకు గురి కావచ్చు. అలాగే రాష్ట్రాల ఆందోళనలను వ్యక్తీకరించే చాంబర్‌గా కూడా ఇది వ్యవహరిస్తుంది. 2003లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఫిరాయింపు వ్యతిరేక చట్టం, పార్లమెంట్ మొట్టమొదటి విధిని ఛిన్నాభిన్నం చేసిపడేసింది. ఇది రాష్ట్రాలకూ, రాజ్యసభ అభ్యర్థులకూ మధ్య లింకును బద్దలు చేసేసింది. అంటే రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా బలహీనపర్చింది. అంటే రాజ్యసభ తన ఉనికికి సంబంధించిన హేతువును కూడా కోల్పోయినట్లేనా? స్వాతంత్య్రానంతరం భారత పార్లమెంట్ అభివృద్ధి చెందిన తీరును మీరు గమనించినప్పుడు, ఎంపీలను పణంగా పెట్టి పార్టీ నాయకత్వాలు బలం పుంజుకున్నాయి. శాసన సభ్యులను పణంగా పెట్టి రాజకీయ పార్టీలు బలపడుతూ వచ్చాయని అర్థమవుతుంది. కాబట్టి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి మనం రెండు సంప్రదాయాలు తీసుకోవాలి. ప్రస్తుత దుష్ఫలితాలను నివారించడానికి అవి మనకు సహాయం చేయవచ్చు. ప్రధానమంత్రి ప్రతివారం ప్రశ్నోత్తరాల సమయంలో నేరుగా పాల్గొనే చరిత్ర బ్రిటన్‌కు ఉంది. దీనిలో ప్రధాన మంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య ప్రత్యక్ష అభిప్రాయాల మార్పిడి ఉంటుంది. ఇది భూమ్మీద అతి శక్తిమంతమైన రాజ్యాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి అందిస్తుంది. భారత్‌లో మనకు కూడా సరిగ్గా అలాంటి అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. మెరుగుపడాలి! మరో సంప్రదాయం స్పీకర్‌కి సంబంధించింది. బ్రిటన్‌లో ఒకసారి ఎన్నికయ్యాక స్పీకర్ తన పార్టీ నుంచి రాజీనామా చేస్తారు. సిట్టింగ్ స్పీకర్ రీ–ఎలక్షన్‌కు నిలబడినట్లయితే ఎవరూ ఆయనపై పోటీ చేయరు. దీనివల్ల స్పీకర్‌కూ, తన పార్టీకీ మధ్య లింకు తెగిపోతుంది. అంటే తాను పక్షపాత రహితంగా కచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. మనం చేపట్టాల్సిన మరొక మంచి సంప్రదాయం ఇది. అంతిమంగా, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ నిజంగా సమా ధానం చెప్పలేని ప్రశ్న ఒకటి ఉంది. అదేమిటంటే, గత 75 సంవ త్సరాల్లో మన ఎంపీల నాణ్యత, ప్రతిభ, సామర్థ్యం మెరుగు పడ్డాయా? ఏడు దశాబ్దాల క్రితం నాటి కంటే మెరుగైన, ప్రతిభా వంతులైన పార్లమెంట్ ఎంపీలు మనకు ఇప్పుడు ఉన్నారా? 1947 నుంచి సమయం, చర్చ, భద్రత విషయంలో పార్లమెంట్ పనితీరు క్షీణించి పోయిందా అంటే... ఈ ప్రశ్నకు సమాధానం అవును అని రాకుండాపోయే అవకాశం తక్కువ. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ముహూర్తం నేడే..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పరిపాలనను ప్రజల దరికి చేర్చేందుకు ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలయ్యేలా చూడడంతో పాటు ప్రజల వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలు గురువారం నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇక పాత గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు బుధవారంతో ముగియగా.. వీటితో పాటు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో సైతం ప్రత్యేక అధికారుల పాలన గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాన్ని వేడుకగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో అనువుగా గదుల నుంచి పాలన సాగించేందుకు ఏర్పాట్లు చేయగా.. అందుబాటులో లేని ప్రాంతాల్లో అద్దె భవనాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆ యా భవనాల మరమ్మతు, రంగులు వేయడం పూర్తికాగా.. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించా రు. అలాగే, కొత్త గ్రామపంచాయతీల్లో ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఆయా పంచాయతీలను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ వాతావరణం జిల్లాలో 265 కొత్త గ్రామపంచాయతీలు గురువారం నుంచి మనుగడలోకి రానున్నాయి. గ్రామపంచాయతీలుగా మార్చాలనే డిమాండ్ ఉన్నవే కాకుండా డిమాండ్ లేని చాలా గ్రామాలను సైతం పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా, పాత పంచాయతీల పరిధిలో ఇవి ఉండగా.. బుధవారంతో ఆయా పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో గురువారం నుంచి నూతన గ్రామపంచాయతీల్లో పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు పండుగ వాతావరణంలో కొత్త గ్రామపంచాయతీలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలనను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. 265 కొత్త పంచాయతీలు... జిల్లాలో కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 468 పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో కలుపుకుని జిల్లాలో ప్రస్తుతం వీటి సంఖ్య 721కి చేరింది. 500 జనాభా ఉండి సంబంధిత గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న నివాసిత ప్రాంతాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు 500 జనాభా కలిగిన ప్రతీ గిరిజన తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. కొత్త, పాత వాటిని కలుపుకుంటే జిల్లాలో 733 పంచాయతీలు ఉండగా.. ఇందులో 12 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. తద్వారా జిల్లాలో 721 పంచాయతీలు ఉన్నట్లయింది. ప్రత్యేక అధికారుల పాలన జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి కొత్త, పాత గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. గ్రామపంచాయతీల స్థాయి ప్రకారం గెజిటెట్ అధికారులు, మండల స్థాయి అధికారులకు బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు. ఇందులో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు ఈఓపీఆర్డీలు, సీడీపీఓ, ఐసీడీఎస్ సూపరింటెండెంట్లు ఉన్నారు. రెండు, మూడు గ్రామపంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి వాటికి ఒక మండల స్థాయి అధికారిని నియమించారు. -
పార్లమెంటు తీరు మారదా!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తీరు గమనించినవారికి ఈ శీతాకాల సమావేశాలపై పెద్దగా నమ్మకాలు లేవు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన రెండు రోజుల ప్రత్యేక సమావేశాల చివరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అలా నిరాశ పడేవారిని ఆలోచింపజేసింది. అందరినీ కలుపుకొనిపోయే రీతిలో ఆయన మాట్లాడటం...ఆ తర్వాత మోదీ నివాసానికి సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లు వెళ్లడం శుభసూచకమని అందరూ అనుకున్నారు. కానీ అసహనంపై సోమవారం జరిగిన చర్చల్లో రేగిన దుమారం అలాంటి భరోసానివ్వడం లేదు. లోక్‌సభ పదే పదే వాయిదా పడిన తీరు...సభ్యుల ఆగ్రహావేశాలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. నిజానికి ఈ అంశంపై చర్చను సభ్యులంతా సహనంతో సాగిస్తారని, ఆవేశాలు అసలే వ్యక్తం కావని ఎవరూ అనుకోలేదు. కనీసం ఒకరు చెప్పేది ఒకరు వింటారని, జరిగిన ఉదంతాలపై స్పందించే సందర్భంలో ప్రభుత్వ పక్షం కూడా దూకుడుగా వ్యవహరించదని భావించారు. కానీ సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం చేసిన ఆరోపణ తర్వాత సభ యధాప్రకారం వాయిదాల బాణీలో సాగింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక అంతర్గత సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్య గురించి ఆంగ్లపత్రికను ఉటంకిస్తూ సలీం చేసిన ప్రసంగంతో ప్రభుత్వ పక్షం ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాదు, ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టడం...అందుకు సలీం నిరాకరించడంలాంటి పరిణామాలతో సభ స్తంభించిపోయింది. మొత్తంగా రోజులో సగభాగం వృథా అయింది. సాధారణంగా సభను స్తంభింపజేసే పాత్రను విపక్షం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు సాగకుండా అడ్డుకుని దాన్ని దారికి తెచ్చుకోవాలని చూస్తుంది. కానీ ఇవాళ అధికార పక్షమే ఆ పని చేసింది. ఆరోపణలను ఉపసంహరించుకునేవరకూ సభ సాగదని అధికార పక్షం ప్రకటించడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి కావొచ్చు. సలీం ఆరోపణలు రాజ్‌నాథ్‌ను తీవ్రంగానే కదిలించాయని ఆయన స్పందన చూస్తేనే అర్ధమవుతుంది. రాజ్‌నాథ్‌సింగ్ నేపథ్యాన్ని గమనించినా, ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకుండే ప్రాముఖ్యాన్ని గ్రహించినా ఆయన స్పందన ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. రాజ్‌నాథ్‌కు ఆదినుంచీ సౌమ్యుడన్న పేరుంది. ఏ స్థాయికైనా వెళ్లి దూకుడుగా మాట్లాడే నేతలకు ఆయన భిన్నం. పైగా నరేంద్ర మోదీ సర్కారులో ఆయనది రెండో స్థానం. నిరుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడి తీరుపై మోదీ ఆగ్రహించి అతన్ని పిలిచి మందలించారని వార్తలొచ్చినప్పుడు కూడా ఆయన కలవరపడ్డారు. ఇందులో ఏ కొంచెం నిజమున్నా రాజకీయ జీవితంనుంచి తప్పుకుంటానని ప్రకటించారు. సలీం ఆరోపణలకు ఆయన మళ్లీ అదే స్థాయిలో స్పందించారు. చివరికది రికార్డుల్లోకి ఎక్కడం లేదని స్పీకర్ ప్రకటించాక సద్దుమణిగినా రోజులో సగభాగం వాయిదాల్లో గడిచిపోయింది. అసహనానికి సంబంధించి విపక్షాల ఆరోపణల్ని తిప్పికొడుతున్న సందర్భంలో బీజేపీ మొదటినుంచీ చేస్తున్న వాదననే మరోసారి చెప్పింది తప్ప అందులో కొత్తదనం లేదు. అవార్డులు వెనక్కి ఇస్తున్నవారికి 1984లో జరిగిన సిక్కుల ఊచకోత, హషీంపురా, ముజఫర్‌నగర్ మతకల్లోలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించడం...సాహితీవేత్త కల్బుర్గిని కాల్చిచంపడం, దాద్రీలో ఒక ముస్లిం కుటుంబంపై దాడిచేసి యజమానిని కొట్టి చంపడంవంటి అంశాల్లో దర్యాప్తు జరిపి దోషులను పట్టుకునే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదని వాదించడం బీజేపీకి కొత్తేమీ కాదు. లోక్‌సభలో ఆ పార్టీ తరఫున మాట్లాడిన మీనాక్షి లేఖి ఆ మాటలే మరోసారి చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తున్నవారిని ఫలానా సమయంలో ఎందుకివ్వలేదని ప్రశ్నించడం శుద్ధ తర్కమవుతుందేమోగానీ సరైన జవాబు కాదు. ఇదంతా ‘కాంగ్రెస్‌ను అప్పుడేమీ అనలేదు కాబట్టి మమ్మల్ని కూడా ఇప్పుడు ఏం అనకండి’ అని వాదించినట్టుంది. హత్యల విషయంలో బీజేపీ చేస్తున్న వాదన మరీ ఘోరం. హత్య కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివని ఆ పార్టీ ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ అలాంటి ఉదంతాల తర్వాత బీజేపీ నేతలు ఇచ్చిన ప్రకటనలు చూసినా, ఆ పార్టీతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే పరివార్ సంస్థల నేతలు మాట్లాడిన మాటలు విన్నా వాటిని ఏదో మేరకు సమర్థించినట్టే, ఆ మాదిరి శక్తులకు ఊతం ఇచ్చినట్టే కనబడింది. వారలా మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ లేదా మరో ముఖ్య నాయకుడు జోక్యం చేసుకుని చక్కదిద్ది ఉంటే, ఆ అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని చెబితే వేరుగా ఉండేది. అలా చెప్పనందువల్లే ఈ విమర్శలన్నీ వచ్చాయని బీజేపీ నేతలు ఇంకా గ్రహించడంలేదని తాజా చర్చ గమనించాక అర్ధమవుతుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నయం. రాజ్యాంగంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంలో అసహనం అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు అది నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందునుంచీ ఉన్నదని ఆయన అంటూనే... కొందరు నేతలు మాట్లాడిన మాటలు సరిగా లేవని అంగీకరించారు. అలాంటి నాయకులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. మొన్నటి వర్షాకాల సమావేశాలు ఒక్కనాడైనా సజావుగా సాగకుండా వాయిదా పడ్డాయి. లోక్‌సభ సమయంలో 48 శాతం, రాజ్యసభ సమయంలో 9 శాతం మాత్రమే సద్వినియోగమైంది. నిజానికి గత అయిదేళ్లుగా పార్లమెంటు తీరు తెన్నులు ఇలాగే ఉన్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఈమధ్య కనబరిచిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేసి, ఈ స్థితిని మార్చాలి. పార్లమెంటులో జరిగే చర్చలు ప్రజలకు ఒక భరోసానిచ్చేలా, అసహనాన్ని రెచ్చగొట్టే ఉన్మాదులకు హెచ్చరికగా ఉండాలి. అంతేతప్ప ఉన్న వాతావరణాన్ని మరింత దిగజార్చకూడదు. ఆ సంగతిని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. -
రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
భారత రాజ్యాంగ రచన - సమగ్ర పరిశీలన భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, సంస్కరణలు దోహదం చేశాయి. రెగ్యులేటింగ్ చట్టం 1773తో రాజ్యాంగ వికాసం ప్రారంభమైందని చెప్పొచ్చు. అందువల్ల ఈ చట్టాన్ని తొలి లిఖిత చట్టంగా పరిగణిస్తారు. ఆ తర్వాత అనేక చట్టాలు రూపొందించారు. చార్టర్ చట్టాలు (1773-1853), కౌన్సిల్ చట్టాలు (1858-1935), సైమన్ కమిషన్ నివేదిక (1927), నెహ్రూ రిపోర్ట (1928), మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు (1930-1932), క్రిప్స్ ప్రతిపాదనలు (1942), సి.ఆర్. ఫార్ములా (1944), వేవెల్ ప్రణాళిక (1945), కేబినెట్ మిషన్ ప్లాన్ (1946) లాంటివన్నీ రాజ్యాంగ రచనకు దోహదం చేశాయి. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, పనితీరు 1946లో కేబినెట్ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. నిర్మాణం, ఎన్నిక పద్ధతి, సభ్యుల సంఖ్య, ఇతర విధి విధానాలు ఖరారైనప్పటికీ, 1947లో భారత స్వాతంత్య్ర చట్టం ద్వారా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. - కేబినెట్ మిషన్ప్లాన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్‌కు 1946 జూలై-ఆగస్టుల్లో ఎన్నికలు నిర్వహించారు. - రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్యను 389గా నిర్ణయించారు. వీరిలో 296 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికవగా, 93 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. - 296 మందిలో 292 మంది పదకొండు ప్రావిన్సల్లోని శాసన సభ్యుల ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో పరోక్షంగా ఎన్నికయ్యారు. మిగిలిన నలుగురు సభ్యులు చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ, బెలూచిస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. - ప్రతి ప్రావిన్స నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడే ప్రాతినిధ్యం వహించాడు. - బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మూడు ప్రధాన వర్గాలైన హిందువులు, మహమ్మ దీయులు, సిక్కులకు వారి జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు. - రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా, నామినేషన్ ద్వారా ఎంపికయ్యారు. కమిటీల ద్వారా సమాచార సేకరణ - రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేశారు. అవి.. - విషయ కమిటీలు-12, ప్రక్రియ కమిటీలు-10 - మైనర్ కమిటీలు - 15, ఉప కమిటీలు - 7 - అతిపెద్ద కమిటీ - సలహా కమిటీ (54 మంది సభ్యులు) - అతి ముఖ్య కమిటీ - ముసాయిదా కమిటీ రాజ్యాంగం ఆమోదం, అమలు ముసాయిదా కమిటీ రెండు ముసాయిదాలను (ఈట్చజ్ట) తయారు చేసింది. మొదటి ముసాయిదా 1948 ఫిబ్రవరి 21నప్రచురితమైంది. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా 2,473 చర్చకు వచ్చాయి. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949, నవంబరు 26న ఆమోదించి చట్టంగా మార్చింది. అయితే ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో జనవరి 26ను పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా ప్రకటించారు. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు. అయితే రాజ్యాంగంలో కొన్ని అంశాలు ముఖ్యంగా పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, రాష్ర్టపతి పదవి ప్రమాణ స్వీకార పద్ధతి, గీగీఐ, గీగీఐఐ భాగంలోని తాత్కాలిక అంశాలు 1949, నవంబరు 26తో అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ - ఇతర విధులు: రాజ్యాంగ రచనతో పాటు రాజ్యాంగ పరిషత్ కొన్ని ఇతర చట్టాలను కూడా రూపొందించింది. అందులోని ముఖ్యాంశాలు.. - రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగును గుర్తించడం. (ఏనుగు అత్యంత శక్తిమంతమైన, బలమైన జంతువుకు ప్రతీక) - మొదటి రాష్ర్టపతిగా రాజేంద్ర ప్రసాద్‌ను ఎన్నుకుంది. (నె్రహూ, పటేల్ ప్రతిపాదించారు) - 1947, జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది. డాక్టర్ హన్సా జవేరి మెహతా మహిళల తరఫున జాతీయ జెండాను ప్రవేశపెట్టారు. - కామన్వెల్త్లో భారత్ సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది. - 1950, జనవరి 24న జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది. - రాజ్యాంగ పరిషత్‌ను ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్. మాదిరి ప్రశ్నలు 1. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం? ఎ) పార్లమెంట్ బి) రాష్ర్టపతి సి) రాజ్యాంగం డి) ప్రజలు 2. రాజ్యాంగ పరిషత్ సభ్యులు? ఎ) బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా నామినేట్ అయ్యారు బి) గవర్నర్ జనరల్ నామినేట్ చేశాడు సి) రాజకీయ పార్టీలు నైష్పత్తిక పద్ధతిలో నామినేట్ చేశాయి డి) పైవేవీ కాదు 3. కింది వాటిలో సరికానిది. ఎ) రూల్స్ కమిటీ - రాజేంద్ర ప్రసాద్ బి) సలహా కమిటీ - సర్దార్ వల్లభాయ్ పటేల్ సి) స్టీరింగ్ కమిటీ - జవహర్లాల్ న్రహూ డి) భాషా కమిటీ - మోటూరి సత్యనారాయణ 4. ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? ఎ) కె.ఎం. మున్షి బి) ఎన్. మాధవరావు సి) కె.టి. షా డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ 5. భారత రాజ్యాంగం- ఎ) పరిణామాత్మకం బి) శాసనీకృతం సి) సంప్రదాయీకృతం డి) పైవేవీ కాదు 6. రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్ అనుసరించిన పద్ధతి? ఎ) విభజన-ఓటింగ్ పద్ధతి బి) మెజారిటీ ఓటింగ్ పద్ధతి సి) ఏకాభిప్రాయ సర్దుబాటు సాధన పద్ధతి డి) నైష్పత్తిక ఓటింగ్ పద్ధతి 7. రాజ్యాంగ వికాసంతో సంబంధం లేని సంఘటన? ఎ) ఆగస్టు ప్రతిపాదన బి) క్రిప్స్ ప్రతిపాదన సి) మౌంట్‌బాటన్ ప్రతిపాదన డి) కేబినెట్ రాయబార ప్రతిపాదన 8. రాజ్యాంగ పరిషత్‌లోని తెలుగువారు? ఎ) వి.సి. కేశవరావ్ బి) పట్టాభి సీతారామయ్య సి) ఎన్.జి. రంగా డి) పైవారందరూ 9. అమెరికా-భారత్ రాజకీయ వ్యవస్థలో ఉమ్మడిగా ఉన్న అంశం? ఎ) హక్కులు బి) న్యాయసమీక్ష సి) మహాభియోగ తీర్మానం డి) పైవన్నీ 10. కింది వాటిలో సరికానిది- ఎ) రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో ప్రజాభిప్రాయ ఛాయలు లేవు - కె. సంతానం బి) రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటుకే ప్రాధాన్యం ఇచ్చారు - ఒ.పి. గోయల్ సి) రాజ్యాంగ పరిషత్ కొన్ని వర్గాల ప్రజలకే ప్రాతినిధ్యం వహించింది - విన్స్టన్ చర్చిల్ డి) నా అభిష్టానికి వ్యతిరేకంగానే రచన చేశాను - రాజేంద్ర ప్రసాద్ 11. ‘రాజ్యాంగ పరిషత్’ ప్రతిపాదనను అధికార పూర్వకంగా ఎప్పుడు ప్రకటించారు? ఎ) క్రిప్స్ ప్రతిపాదన-1942 బి) భారత ప్రభుత్వ చట్టం-1935 సి) కేబినెట్ రాయబారం-1946 డి) వేవెల్ ప్రణాళిక-1945 12. భారత రాజ్యాంగ రచనకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. అయితే సుదీర్ఘకాలం (7 ఏళ్లు) సమయం తీసుకున్న రాజ్యాంగం? ఎ) అమెరికా బి) ఆస్ట్రేలియా సి) కెనడా డి) దక్షిణాఫ్రికా 13. ఏ దేశ రాజ్యాంగం సంప్రదాయాల ఆధారంగా పనిచేస్తుంది? ఎ) ఇంగ్లండ్ బి) ఐర్లాండ్ సి) నైజీరియా డి) జపాన్ సమాధానాలు 1) డి 2) డి 3) సి 4) సి 5) బి 6) సి 7) ఎ 8) డి 9) డి 10) డి 11) ఎ 12) బి 13) ఎ