జంతు శాస్త్రం
పాక్టికల్స్ - ప్రాముఖ్యత:
ఇంటర్మీడియెట్ బయాలజీ విద్యార్థులకు ప్రాక్టికల్ విజ్ఞానం ప్రధానం. సబ్జెక్టును పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఇది ఎంతో కీలకం.
గత ప్రణాళిక ప్రకారం విద్యార్థులు వానపాము, బొద్దింక, కప్ప లాంటి జీవుల విచ్ఛేదన, వివిధ వ్యవస్థల పరిశీలన తదితర విషయాలను నేర్చుకోవాల్సి వచ్చేది. దీనివల్ల విద్యార్థులకు విచ్ఛేదనల్లో అనుసరించాల్సిన ప్రాథమిక అంశాల గురించి సమగ్ర అవగాహన ఏర్పడేది.
కానీ ఈ ఏడాది నుంచి ఎన్‌సీఈఆర్‌టీ సూత్రాల ప్రకారం విచ్ఛేదన అంశాన్ని పాఠ్యప్రణాళిక నుంచి తొలగించారు. ఇది కొంతమేరకు విద్యార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం పొందడంలో నష్టం కలిగించేదే అయినా ప్రత్యామ్నాయ విధానాల్లో దాన్ని భర్తీ చేసుకునే వీలుంది.
ప్రాక్టికల్ - నమూనా ప్రశ్నపత్రం:
మార్చి 2014 నుంచి అమల్లోకి వచ్చే విధంగా జంతు శాస్త్రం ప్రయోగ పరీక్ష మాదిరి ప్రశ్నపత్రాన్ని ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది. దాని ప్రకారం మూడు గంటల వ్యవధి ఉండే పరీక్షలో 4 భాగాలుంటాయి.
అవి...
భాగం ఐ - వానపాము, బొద్దింక, మానవుడు....
వీటిలోని వివిధ వ్యవస్థల పటాలు/నమూనాలు విద్యార్థులకు ప్రదర్శిస్తారు. విద్యార్థులు ఆయా వ్యవస్థలను గుర్తించి, వాటి పటం గీసి కనీసం నాలుగు భాగాలను గుర్తించాలి (లేబుల్ చేయా లి). దీనికి ‘6’ మార్కులు కేటాయించారు. వీటిలో గుర్తింపునకు 1 మార్కు, పటానికి 3, భాగాల గుర్తింపునకు 2 మార్కులు ఉంటాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఈ భాగంలో వానపాముకు సంబంధించిన జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ, శుక్రగ్రాహికలు ఉన్నాయి.
విద్యార్థులు వానపాములోని మూడు వ్యవస్థలకు సంబంధించి జీవి ఖండితాలను గుర్తించాలి. ఆయా వ్యవస్థల్లోని భాగాలను, అవి విస్తరించి ఉండే ఖండితాలను జాగ్రత్త గా పరిశీలించాలి. భాగాల గుర్తింపులో దీనికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
బొద్దింక ముఖ భాగాలు, జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ పటాలను కూడా పైవిధంగానే సాధన చేయాలి.
మానవునికి సంబంధించి జీర్ణ, ధమనీ, సిరా, పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు (మూత్ర జననేంద్రియ వ్యవస్థ) ప్రణాళికలో ఉన్నా యి. విద్యార్థులు వీటిని కూడా తగినంతగా సాధన చేయాలి.
భాగం ఐఐ - శరీరధర్మ ప్రయోగాలు:
ఇచ్చిన శాంపుల్స్‌లో పిండి పదార్థం, గ్లూకోజ్, కొవ్వు పదార్థాలను, ఆల్బుమిన్‌ను గుర్తించడం. అదే విధంగా పిండి పదార్థాల జీర్ణక్రియలో లాలాజల అమైలేజ్ పాత్రను నిరూపించడం.
ఈ భాగానికి 5 మార్కులు కేటాయించారు. వీటిలో ఉద్దేశం/ప్రిన్సిపల్‌కు 1, ప్రయోగ విధానానికి 3, ఫలితానికి 1 మార్కు కేటాయించారు.
పాఠ్యప్రణాళికలో ఇచ్చిన ‘5’ ప్రయోగాల గురించి విద్యార్థులు... ప్రయోగ ఉద్దేశం, విధానం, ఫలితాల సరళి లాంటి అన్ని వివరాలను క్షుణ్నంగా సాధన చేయాలి.
భాగం - ఐఐఐ: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ క్రమంలో అమర్చిన స్టాటర్‌సను గుర్తించి, పటం గీసి, గుర్తింపు లక్షణాలను రాయాలి. ఒక్కో స్టాటర్‌కు 2 మార్కులు (7 ణ 2 = 14).
ఈ 2 మార్కులను కూడా గుర్తింపునకు - బీ, పటానికి బీ, గుర్తింపు లక్షణాలకు 1 మార్కు కేటాయించారు. విద్యార్థులు ఈ భాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే మొత్తం ప్రాక్టికల్ 30 మార్కుల్లో దాదాపు 50% (14 మార్కులు) ఈ భాగానికి చెందినవే.
ఈ భాగంలోని 7 అంశాల గురించి ప్రయోగదీపికలో ఉదాహరణలు ఇచ్చారు.
అ) అకశేరుకాల స్లైడ్లు: అమీబా, యూగ్లీనా, పారమీషియం, హైడ్రా, లివర్‌ఫ్లూక్.
ఆ) అకశేరుకాల నమూనాలు (ఞ్ఛఛిజీఝ్ఛట): యూస్పాంజియా, అరేలియా, మెట్రిడియం, టీనియాసోలియం, ఆడ ఆస్కారిస్, మగ ఆస్కారిస్, నీరిస్, జలగ.
ఇ) అకశేరుకాల నమూనాలు: స్కోలోపెండ్రా, జూలస్, పేలిమాన్, అరేనియా, తేలు, పట్టుకీటకం, తేనెటీగ, నత్త, ఆల్చిప్ప, సముద్ర నక్షత్రం.
ఈ) కణజాల స్లైడ్లు: శల్కల ఉపకళ, స్తంభాకార ఉపకళ, మృదులాస్థి - అడ్డుకోత, అస్థి - అడ్డుకోత, క్షీరద రక్తం - రేఖిత కండరం, నునుపు కండరం.
ఉ) సకశేరుకాల స్లైడ్లు: జీర్ణాశయం - చిన్నపేగు, మూత్రపిండం, కాలేయం, క్లోమం, ముష్కం, స్త్రీ బీజకోశం లాంటి అవయవాల అడ్డుకోతలు.
ఊ) సకశేరుకాల నమూనాలు/ఞ్ఛఛిజీఝ్ఛట: సొరచేప, లేబియోరోహిట, కట్ల, సిర్హెనస్ మృగల, కప్ప, సముద్రసర్పం, నాగు పాము, రక్తపింజర, పావురం, కుందేలు.
ఎ) కీళ్లు: బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, పైవోట్ కీలు, జారుడు కీలు.
పైన ఇచ్చిన 7 అంశాల గురించి విపులంగా అధ్యయనం చేయాలి. ఈ విషయంలో విద్యార్థులు తమ అధ్యాపకుల సలహాలను తీసుకొని ఏయే అంశాలు గుర్తింపు లక్షణాలుగా రాయాలో సాధన చేయాలి.
పటాలు కూడా సాధన చేయాలి.
భాగం ఐగ : రికార్డు 5 మార్కులు.
ఈ భాగం కూడా ముఖ్యమైందే. విద్యార్థులు ప్రయోగ దీపికలోని అన్ని అంశాలను ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత వాటిని తమ అబ్జర్వేషన్ నోట్ పుస్తకాల్లో రాయాలి. రికార్‌డ షీట్లలో సరైన పటం, అంశాలను పొందుపరుచుకోవాలి. లెక్చరర్ల నుంచి సంతకాలు తీసుకోవాలి.
రికార్డు బుక్‌ను బైండింగ్ చేయించి దానిపై తమ రిజిస్టర్‌డ నంబర్‌ను రాయాలి.
పై విధంగా అన్ని అంశాలను విపులంగా నేర్చుకొని సరైన విధానంలో సాధన చేయాలి. ఈ విధంగా చేస్తే గరిష్ఠ మార్కులు సాధించవచ్చు.