
వారంతా ఆడ,మగ కాని వారే..!
టీడీపీలో చేరికలపై పొన్నం వ్యాఖ్య
కథలాపూర్, : రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయిందని, ఆడ, మగ కాకుండా ఉన్నవారే ఆ పార్టీలో చేరుతున్నారని కరీంగనర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కథలాపూర్‌లో మంగళవారం ఆయన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టడం దారుణమన్నారు.
బీజేపీ నేత సుష్మాస్వరాజ్ లోక్‌సభలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాటంతో ఆ పార్టీ ద్వందవైఖరి బహిర్గతమైందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే దక్కుతుందన్నారు. రెండు కళ్ల సిద్ధాంతాలతో ఉన్న టీడీపీ, ద్వంద విధానం అవలంబించిన బీజేపీతో జత కట్టడం ప్రజలను మోసం చేయడానికేనని మండిపడ్డారు.