సార్వత్రిక ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ప్రచార ఘట్టానికి ఇంకా తొమ్మిది రోజులు గడువు ఉండగా ప్రధా న పార్టీల అగ్రనేతలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించే బహిరంగసభలకు స్థలాల ఎంపికను ఆయా పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ నిజామాబాద్‌లో పర్యటించి వెళ్లారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. రేయన క, పగలనక ఊరూవాడ, గడపగడపకు తిరుగుతున్నారు. ప్రచార రథాలు, అగ్రనేతల క టౌట్లతో వాహనాలు, మైకుల మోతలు పల్లెనక, పట్నమనక జనం చెవులు గింగుర్లెత్తుతున్నాయి. ప్రచార ఘట్టం ముగింపునకు ఇంకా తొమ్మిది రోజులే గడువుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు అగ్రనేతలను రంగంలోకి దింపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులు, అధినేతలు, ముఖ్యనేతలతో బహిరంగ సభలను ఖరారు చేస్తున్నా రు. దీంతో ఎన్నికల ప్రచారం మరింత వేగం పుంజుకోనుంది.
22న జిల్లాకు నరేంద్రమోడీ
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి న రేంద్ర మోడీ ఈ నెల 22న జిల్లాకు రానున్నా రు. బీజేపీ, టీడీపీ కూటమిలో భాగంగా ప్ర చారం నిర్వహించేందుకు వస్తున్న ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూ డా వస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవా రం బీజేపీ జాతీయ నాయకులు నిజామాబా ద్ వచ్చారు. నగరంలోని గిరిరాజ్ కాలేజ్, క లెక్టరేట్ మైదానంతో పాటు మరో రెండు స్థ లాలను వారు చూశారు.
ఈ సందర్భంగా రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు మోడీ సభకు జనాన్ని తరలించే బాధ్యతలు తీసుకోవాలని ఆయా పార్టీల అధిష్టానాలు సూచించినట్లు తెలిసింది. మోడీ సభ తర్వాత జిల్లా కేంద్రంతోపాటు మరోచోట కూడ బీజేపీ, టీడీపీ అగ్రనేతలతో సభలు నిర్వ హించాలనే యోచనలో కూడ ఆ రెండు పార్టీలున్నట్లు సమాచారం.
21న డిచ్‌పల్లికి రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 21న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. డిచ్‌పల్లిలో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ డిచ్‌పల్లిలో రాహుల్‌గాంధీ సభను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భద్రతాచర్యల దృష్ట్యా రాహుల్‌గాం ధీ 21న డిచ్‌పల్లిలో పాల్గొనే బహిరంగ సభాస్థలిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి శుక్రవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ) అధికారులు వచ్చారు. వారితో కలిసి డి.శ్రీనివాస్, జిల్లా ఎస్‌పీ డాక్టర్ తరుణ్‌జోషి తదితరులు రాహుల్ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. నేరుగా హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకునే రాహుల్‌గాంధీ సభలో మాట్లాడి తిరిగి వెళ్లే వరకు చేపట్టాల్సిన భద్రతా చర్యలపైనా చర్చించారు. కాగా రాహుల్ సభకు భారీ జనసమీకరణ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
మలి విడత ప్రచారానికి కేసీఆర్
ఇప్పటి వరకు జిల్లాకు రెండు సార్లు వచ్చిన టీఆర్‌ఎ స్ అధినేత కేసీఆర్ ఈనెల 24న మలివిడత రాను న్నారు. తెలం గాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ‘మట్టిముడుపు’ విప్పేందుకు బాల్కొండ నియోజకవర్గం మోతెకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.
మిగతా ప్రధాన రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపేందుకు వ్యూహం రూపొందిస్తుండగా, ఇందూరు జిల్లా ఎన్నికల ప్రచారంతో మార్మో గనుంది.
24న కేసీఆర్ పర్యటన
ఆర్మూర్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 24న జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బోధన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిం చిన అనంతరం 2.48 గంటలకు బాల్కొండ, 3.20 గంటలకు ఆర్మూర్, 4 గంటలకు నిజామాబాద్ రూర ల్ నియోజకవర్గాల మీదుగా కామారె డ్డికి చేరుకోనున్నట్లు వారు వివరించారు.
ఇందూరు..ప్రచార హోరు
Published Sat, Apr 19 2014 2:34 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement