ఒంగోలు, న్యూస్‌లైన్:
జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో ఎన్నికల ఘట్టం తారస్థాయికి చేరుకుంది. జిల్లాలోని మొత్తం 145 వార్డులకుగాను 1217 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్లకు ఉపసంహరణ పూర్తికావడంతో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 వార్డుల్లో పోటీ తప్పనిసరైంది. ఇందుకుగాను మొత్తం 592 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రాథమిక ఘట్టం పూర్తవడంతో బుధవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది.
ఈనెల 30న ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల) ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈవీఎంలను సిద్ధం చేశారు. ఎన్నికల అనంతరం ఏప్రిల్ 2వ తేదీ కౌంటింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తికాగానే ఎవరు గెలుపొందారనే విషయాన్ని ప్రకటిస్తారు.
చీరాల మున్సిపాలిటీ...
మొత్తం 275 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 161మంది బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్‌సీపీ 33, టీడీపీ 32, బీజేపీ 1, కాంగ్రెస్ 9, చీరాల పరిరక్షణ సమితి 33, సీపీఎం 1, బీఎస్పీ 3, ఎస్పీ 3, లోక్‌సత్తా 5 మంది ఉన్నారు.
మార్కాపురం మున్సిపాలిటీ..
మొత్తం 252 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ అనంతరం 92 మంది బరిలో ఉన్నారు. వారిలో వైఎస్సార్‌సీపీ 29, టీడీపీ 25, సీపీఐ 2, సీపీఎం 1, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా 2, స్వతంత్రులు 33 మంది ఉన్నారు. వీరు కాకుండా మున్సిపల్ బరిలో
వైఎస్సార్‌సీపీ 1, టీడీపీ 2 నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయి.
అద్దంకి నగర పంచాయతీ:
మొత్తం 150 మంది నామినేషన్లు వేయగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 68 మంది బరిలో దిగారు. వారిలో వైఎస్సార్‌సీపీ 19, టీడీపీ 20, కాంగ్రెస్ 5, సీపీఎం 3, లోక్‌సత్తా 2, స్వతంత్రులు19 మంది ఉన్నారు.
కనిగిరి నగర పంచాయతీ:
మొత్తం 236 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 105 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 20, కాంగ్రెస్ 17, బీజేపీ 7, సీపీఐ 1, సీపీఎం 2, లోక్‌సత్తా 4, ఇతరులు 34 మంది ఉన్నారు.
గిద్దలూరు నగర పంచాయతీ:
మొత్తం 183 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణల అనంతరం 88 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 18, కాంగ్రెస్ 4, బీజేపీ 5 పోటీలో ఉన్నారు. వీరు కాకుండా బీఎస్పీ 12, ఇండిపెండెంట్లు 29 మంది ఉన్నారు.
చీమకుర్తి నగర పంచాయతీ:
మొత్తం 121 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణల అనంతరం 78 మంది బరిలో ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 20, కాంగ్రెస్ 15, బీజేపీ 1, సీపీఎం 4, సీపీఐ 2, స్వతంత్రులు 16 మంది ఉన్నారు.