నేనే గబ్బర్సింగ్ | Krishnalanka ci Harassment on ysr congress party workers | Sakshi
Sakshi News home page

నేనే గబ్బర్సింగ్

Published Mon, May 5 2014 8:49 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

నేనే గబ్బర్సింగ్ - Sakshi

నేనే గబ్బర్సింగ్

'నేను మంచోణ్ణి... అయినా కొద్దిగా తిక్కుంది. పై అధికారులకు చెపుతారా? ఇంకా సమయం ఉంది. అప్పుడు నా తడాఖా చూపుతా?' అంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. జేబు ఖర్చులకు రూ.100 ఉంటే చాలు... ఓటర్లకు  పంచేందుకు వెళుతున్నారంటూ కార్యకర్తలను స్టేషన్కు తరలిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు  చెందిన వారు డబ్బు పంచుతున్నట్టు సమాచారం  ఇచ్చినా ఆయన స్పందించటం లేదు. కృష్ణలంక ఇన్స్పెక్టర్ వేధింపులకు తాళలేక అతడి చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే... వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను కృష్ణలంక సీఐ గత వారం రోజులుగా అకారణంగా వేధిస్తున్నారు. పార్టీ కార్యకర్త కనిపిస్తే చాలు జేబులు తనిఖీ చేసిన తర్వాతనే వదిలేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చేతి ఖర్చుల కోసం జేబులో రూ.100 ఉంచుకుంటే ఓటర్లకు పంచేందుకంటూ తీసుకెళ్లి లాకప్లో ఉంచుతున్ఆరు. పైగా స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా... కోర్టుకు పంపాలంటూ  రోజులు తరబడి ఉంచుతున్నారు. అది మరీ శ్రుతిమించి ఇంట్లో నుంచి కార్యకర్తలు బయటకు వస్తే తనిఖీలు అంటూ స్టేషన్కు తీసుకు వెళుతున్నారు. దాంతో తూర్పు నియోజకవర్గం అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ నగర పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement