
మోడీని ఓడిస్తా
ఢిల్లీ నుంచి రైల్లో వారణాసికి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోకసభ స్థానం నుంచి బరిలో ఉన్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీని ఓడిస్తానన్న నమ్మకం తనకుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీలో శివ్‌గంగా ఎక్స్‌ప్రెస్ రెలైక్కి వారణాసికి బయల్దేరారు. కేజ్రీవాల్‌ను సాగనంపేందుకు వందలాది మంది కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకున్నారు.
‘‘ విప్లవం సృష్టించడానికే నేను వారణాసికి వెళ్తున్నాను. వారణాసి నుంచే విప్లవం మొదలవుతుంది. దేశాన్ని రక్షించడం కోసం నన్ను గెలిపించండని వారణాసి ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నా. దేశక్షేమం కోసం అమేథీలో రాహుల్‌ను, వారణాసిలో మోడీని ఓడించాల్సి ఉంది.’’ అని కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.