విజేతలెవరో..!
విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో అందరికీ తెలిసిందే. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా 43 రోజులుగా రెట్టింపు ఆత్రంతో నిరీక్షిస్తున్నారు. అయితే వారి నిరీక్షణకు సోమవారం తెరపడనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా యంత్రాం గం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్‌లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి విజయనగరం, సాలూ రు, బొబ్బిలి,పార్వతీపురం మున్సిపాలిటీ ల్లో జరగనున్న ఓట్ల లెక్కింపులో ఎటువంటి అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా నిఘా నీడలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఆయా మున్సిపల్ కమిషనర్‌లు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియో గ్రాఫర్‌లను ఏర్పాటు చేసినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది.
తేలనున్న భవితవ్యం
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 129 వార్డులుండ గా ఎన్నికల బరిలో 534 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. విజయనగరం మున్సిపాలిటీలో 40 వార్డులకుగాను 169 మంది, సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డులకు 95 మంది, బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 117 మంది, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 153 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 30న పూర్తి కాగా ఏప్రిల్ నెలలో ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు సార్వత్రి క ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న భావ న వ్యక్తమైన నేపథ్యంలో ఫలితాల ప్రకటన వాయిదా వేసిన విషయం విదితమే. దీంతో సుమారు 43 రోజుల పాటు అభ్యర్థులు తమ గెలుపు ఓటములను ఊహించుకుంటూ విపరీతమైన టెన్షన్‌లో గడిపారు.
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల ప్రకటన కు సంబంధించి ఆయా మున్సిపల్ కమిషనర్‌లు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయనగరం మున్సిపాలిటీలో రెండు రౌండ్‌లలో ఫలితాలు ప్రకటించేందుకు లెక్కింపు కేంద్రంలో 20 టేబుళ్లు ఏర్పాటు చేశా రు. బొబ్బిలి మున్సిపాలిటీలో ఫలితాల ప్రకట నకు 10 టేబుళ్లు ఏర్పాటు చేసి మూడు రౌండ్‌ల లో అభ్యర్థుల గెలుపోటములు ప్రకటించనున్నారు. సాలూరు మున్సిపాలిటీలో ఓట్ల లెక్కిం పునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలి రెం డు రౌండ్‌లలో 28 వార్డుల ఫలితాలు ప్రకటిం చే విధంగా ఏర్పాట్లు చేయగా చివరి రౌండ్‌లో మిగిలిన ఒక వార్డు ఫలితాన్ని ప్రకటించనున్నా రు. పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మూడు రౌండ్‌ల లో ఫలితాలు ప్రకటించనున్నారు. ఆయా లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్ల వద్ద అసిస్టెంట్ పోలింగ్ అధికారితో పాటు మరో ఇ ద్దరు కౌంటింగ్ అధికారులను నియమించారు. మైక్‌లలో ప్రకటన జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గెలుపు, ఓటముల ప్రకటనలను అధికారులు మైక్‌ల ద్వారా వెల్లడించనున్నారు. ఇందుకోసం ప్రత్యే క ఏర్పాట్లను కూడా ఆయా కమిషనర్‌లు పూర్తి చేశారు.
లెక్కింపు కేంద్రాల్లో సెల్‌ఫోన్‌ల నిషేధం
నేడు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేం ద్రాల్లోకి వచ్చే వారితో సెల్‌ఫోన్‌లు అనుమతిం చబోమని విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ స్పష్టం చేశారు. కేవలం మున్సిపల్ అధికారులు జారీ చేసిన పాస్‌లు ఉన్న వారినే కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. వారు తమ సెల్‌ఫోన్లను బయటే వదిలేసి రావాలని స్పష్టం చేశారు.
144వ సెక్షన్ అమల్లో ఉంటుంది:
డీఎస్పీ శ్రీనివాస్
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపు లు నిర్వహించరాదని డీఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, నలుగురి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఒకే దగ్గర ఉండరాదన్నారు. పోలీసు ఆదేశాలు ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.