26 మంది సిట్టింగ్‌లకు అవకాశం
M>…తాచారి తల్లికి హుజూర్‌నగర్
వెయిటింగ్‌లో ఎమ్మెల్యేలు భిక్షపతి, ఆకుల రాజేందర్
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విషయంలోనూ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సెంటిమెంట్‌ను పాటించారు. 69 తన అదృష్ట సంఖ్య కావడంతో మొదటి విడతలో ఆ మేరకే అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనుండగా.. జాబితాలో మొత్తం 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో పది మంది టీడీపీ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. మరో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మేల్యేలు భిక్షపతి(పరకాల), ఆకుల రాజేందర్(మల్కాజిగిరి)లకు తొలి జాబితాలో అవకాశం దక్కలేదు. పలువురు ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ టికెట్లు దక్కాయి.తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకునల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ కేటాయించారు. అలాగే మానకొండూర్ నుంచి ర సమయి బాలకిషన్‌కు, మహాబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం దక్కింది. తొలి జాబితాలో 14 మంది ఎస్సీ, 16 మంది బీసీ, ఆరుగురు ఎస్టీ, ఓ మైనారిటీ అభ్యర్థి ఉన్నారు. మిగిలిన 32 మందిలో రెడ్డి, వెలమ, బ్రాహ్మణ వంటి ఓసీ వర్గాల వారున్నారు. కాగా, శుక్రవారం జాబితా ప్రకటన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అభ్యర్థులందరి చేత కేసీఆర్ ప్రమాణం చేయించారు.
టీఆర్‌ఎస్ తొలి జాబితా: గజ్వేల్ - కె. చంద్రశేఖర్‌రావు, హుజూరాబాద్ - ఈటెల రాజేందర్, సిద్దిపేట - టి. హరీష్‌రావు, బాన్సువాడ - పోచారం శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ - జోగు రామన్న, పరిగి - కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, బోథ్ - జి. నగేష్, కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు, ముధోల్ - వేణుగోపాలాచారి, తాండూరు - పి. మహేందర్‌రెడ్డి, దోర్నకల్ - సత్యవతి రాథోడ్, ధర్మపురి- కొప్పుల ఈశ్వర్, వరంగల్ వెస్ట్ - దాస్యం వినయ్ భాస్కర్, వేములవాడ - సిహెచ్. రమేష్ బాబు, కరీంనగర్ - గంగుల కమలాకర్, కోరుట్ల - కె. విద్యాసాగర్ రావు, చెన్నూరు - నల్లాల ఓదేలు, ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్ - హనుమంతు షిండే, కామారెడ్డి - గంపా గోవర్దన్, రామగుండం - సోమారపు సత్యనారాయణ, స్టేషన్ ఘన్‌పూర్ - టి రాజయ్య, సిర్పూర్ - కావేటి సమ్మయ్య, చేవెళ్ల - కెఎస్ రత్నం, సిరిసిల్ల - కె.టి.రామారావు, మక్తల్ - వై. ఎల్లారెడ్డి, కల్వకుర్తి - జైపాల్‌యాదవ్, సికింద్రాబాద్ - టి. పద్మారావుగౌడ్, భూపాలపల్లి - ఎస్. మధుసూదనాచారి, సూర్యాపేట - జి. జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ - వి. శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి - ఎస్. నిరంజన్‌రెడ్డి, సత్తుపల్లి - పిడమర్తి రవి, నరసంపేట -పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు - అజ్మీరా చందులాల్, జడ్చర్ల - సి. లక్ష్మారెడ్డి, వరంగల్ ఈస్ట్ -కొండా సురేఖ, బోదన్ - షకీల్ ఆహ్మద్, ఆలేరు - గొంగిడి సునిత, అచ్చంపేట - జి. బాలరాజు, పాలకుర్తి - ఎన్. సుధాకర్‌రావు, దేవరకద్ర - ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మానుకొండూర్ - ఈర్పుల బాలకిషన్(రసమయి), హూస్నాబాద్ - వి. సతీష్ కుమార్, ఆలంపూర్ - మందా శ్రీనాథ్, జనగాం - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవరకొండ - లాలు నాయక్ , పెద్దపల్లి - దాసరి మనోహర్‌రెడ్డి, ఆందోల్ - పి. బాబూమోహన్, మెదక్ - పద్మా దేవేందర్‌రెడ్డి, వర్దన్నపేట - ఆలూర్ రమేష్, నిర్మల్ - కె.శ్రీహరి రావు, బెల్లంపల్లి - చిన్నయ్య, నాగర్‌కర్నూల్ - మర్రి జనార్ధన్‌రెడ్డి, ఖానాపూర్ - రేఖ నాయక్, ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అసీఫాబాద్ - కోవ లక్షి్ష్మ, బాల్కొండ - వేముల ప్రశాంత్‌రెడ్డి, సంగారెడ్డి - చింత ప్రభాకర్, కొత్తగూడెం - జలగం వెంకట్ రావు, మంథని - పుట్ట మధు, మిర్యాలగూడ - అమరేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్ - కాసోజు శంకరమ్మ, జగిత్యాల - ఎం. సంజయ్ కుమార్, పటాన్‌చెరువు - గూడెం మహిపాల్‌రెడ్డి, వికారాబాద్ - బి. సంజీవరావు, గద్వాల - బి. కృష్ణమోహన్‌రెడ్డి, నకిరేకల్ - వీరేశం, మేడ్చల్ - ఎం. సుధీర్‌రెడ్డి.
గజ్వేల్ నుంచి కేసీఆర్
Published Sat, Apr 5 2014 2:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement