సాక్షి, బెంగళూరు : అధిష్టానం తనకు టికెట్ నిరాకరించినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాన ని కుమార బంగారప్ప వెల్లడించారు. ఈయనకు శివమొగ్గ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలోని పార్టీ కార్యకర్తలు, కేపీసీసీ, ఏఐసీసీ నేతల కోరిక మేరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. తన తండ్రి బంగారప్ప రాజకీయంగా కష్ట సమయంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆయన్ను ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని, కేపీసీసీ సూచనల మేరకు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.
శివమొగ్గలోనూ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారా?.. అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ కేపీసీసీ సూచనల ప్రకారం నడుచుకోవాలని తాను నిర్ణయించుకున్నానని, తన సోదరి గీతా శివరాజ్‌కుమార్ జేడీఎస్ తరఫున శివమొగ్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నంత మాత్రాన ప్రచారం నిర్వహించకుండా ఉండిపోలేనని అన్నారు. అయితే రాజకీయాల కోసం బంగారప్ప, రాజ్‌కుమార్‌ల కుటుంబాల ప్రతిష్టకు భంగం కలిగేలా మాత్రం నడుచుకోబోనని స్పష్టం చేశారు. ఇక గీతా శివరాజ్‌కుమార్ తరఫున శివరాజ్‌కుమార్ ప్రచారం చేయడం వల్ల విజయావ కాశాలు పెరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.... కేవలం సినీ గ్లామర్‌కే ఓట్లు పడతాయనుకుంటే అది పొరబాటేనని అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వీడను
Published Wed, Mar 26 2014 8:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement