జనాభాలో సగం..చట్టసభల్లో... | Only 8 women Candidates contest in Arunachal Assembly Election | Sakshi
Sakshi News home page

జనాభాలో సగం..చట్టసభల్లో...

Published Mon, Mar 24 2014 9:47 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Only 8 women Candidates contest in Arunachal Assembly Election

ఇటానగర్: జనాభాలో సగం ఉన్న మహిళల పరిస్థితి చట్టసభల్లో మరీదయనీయంగా ఉంది.  చట్టసభల్లో వారికి ఆ సగంలో సగమైనా  ప్రాతినిధ్యం దక్కడంలేదు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ 60 శాసనసభా స్థానాలుండగా, పోటికి నిలిచిన మహిళా అభ్యర్థులు  కేవలం 8 మంది. వీరిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు.  అప్పుడు మాత్రమే చట్టసభలో వారి శాతం తెలుస్తుంది.

 ఇక్కడ బీజేపీ ఒక్క మహిళా అభ్యర్థిని కూడా బరిలో దింపలేదు. కాంగ్రెస్ మాత్రం ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించింది. ఎన్సీపీ ఇద్దరు, పీపీఏ ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చాయి. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా పలు స్థానాల్లో పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement