ప్రజా తీర్పు నేడే
* దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
* ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీల కౌంటింగ్ కూడా
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏలేదెవరన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అత్యంత సుదీర్ఘంగా తొమ్మిది దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు ఏమిటో నేడే తేలనుంది. దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో 66.38 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. 543 లోక్‌సభ స్థానాలకు 8,251 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికే అధికార పీఠం దక్కవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని కౌంటింగ్ టేబుళ్ల వద్ద సూక్ష్మ పరిశీలకులను నియమించింది.
ఆంధ్రప్రదేశ్