9న మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు | Results at 3 o'clock on 9th | Sakshi
Sakshi News home page

9న మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు

Published Tue, Apr 1 2014 7:05 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

రమాకాంత రెడ్డి - Sakshi

రమాకాంత రెడ్డి

హైదరాబాద్: ఈ నెల 9న మునిసిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రోజునే ఫలితాలు  వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి చెప్పారు.  ఆ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓట్ల లెక్కింపు  ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని  రమాకాంత్‌ రెడ్డి చెప్పారు.


మునిసిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్‌ 9న నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. పోలింగ్ బాక్కులను భద్రపరచలేమన్న ఎన్నికల సంఘం వాదనను పరిశీలించకుండా ఉండలేమని కోర్టు చెప్పింది. ఎన్నికల ఫలితాలతో ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిషనర్ల వాదన అసంబద్దమని కోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement