అల్లూరు, న్యూస్‌లైన్ : మండలంలోని నార్తుమోపూరుకు చెందిన టీడీపీ సీని యర్ నేతలు పిడూరు పరమేశ్వరరెడ్డి, నూకలపాటి శివకుమార్‌రెడ్డి శుక్రవారం కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో 100 మంది అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
త్వరలో జ రుగబోయే సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ప్రజ లకు సుభిక్షమైన పాలనను అందించాలంటే రాష్ట్రానికి యువకుడైన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మీదున్న నమ్మకంతో నే తనతో పాటు తన అనుచర వర్గమం తా వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.
గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీలో తా ను సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించామన్నారు. ప్రస్తు తం వైఎస్సార్‌సీపీలో ఉన్న అందరిని క లుపుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థు ల విజయానికి కృషి చేస్తామన్నారు. పా ర్టీ సీనియర్ నాయకుడు మేడా అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భవననిర్మాణానికి పునాదులు ఎంతగట్టిగా ఉంటాయో పార్టీ నిలబడాలంటే కార్యకర్తలు అంతగట్టిగా ఉండాలన్నారు. పరమేశ్వరరెడ్డి పార్టీలో చేరడం ఎంతో సంతోషమన్నారు.
అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, యువజన విభాగ కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పార్టీనాయకులు బాలకృష్ణంరాజు, అక్కల రాఘవరెడ్డి, కేతిరెడ్డి కృష్ణారెడ్డి, ఊటు అశోక్‌రెడ్డి, కేతిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.
కావలి: బోగోలు మండలం అనంతరాజువారింకండ్రిగకు చెందిన కొందరు టీ డీపీ నేతలు శుక్రవారం వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. స్థానిక పుల్లారెడ్డినగర్ లో ఉన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం లో వారికి పార్టీ కండువా వేసి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో బాలకృష్ణ, హరి, వెంకటేశ్వర్లు, సురేష్, సురేంద్ర, శ్రీనాథ్, ప్రసా ద్, సిద్దయ్య, సుదర్శన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు రమణయ్యనాయుడు, కిషోర్‌బాబు, శ్రీను ఉన్నారు