Alluru
-
కర్నూల్ జిల్లా ఆలూర్ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ
-
పండగ పూట విషాదం
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు -భార్యాభర్తలు దుర్మరణం అల్లూరు : దసరా పండగ కావడంతో తన సోదరి ఇంటికి వెళ్తున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు బలిగొంది. ఈ ఘటన మండలంలోని బీరంగుంట వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన రాజేష్ (28)కు కొడవలూరు మండలం గుండాలమ్మపాళెంకు చెందిన శిరిష(22)తో ఐదు నెలల క్రితం వివాహమైంది. దసరా పండగ కావడంతో అత్తారింటికి వచ్చిన రాజేష్ అల్లూరు దళితవాడలో ఉన్న తన సోదరి ఇంటికి భార్యాభర్తలు బయలుదేరారు. బీరంగుంట ఇటుక బట్టీల వద్దకు వచ్చేసరికి నెల్లూరు నుంచి అల్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. బస్సు చక్రాల కింద పడటంతోభార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసి రాజేష్, సోదరి, బావ బంధువులు, శిరిష కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. కోవూరు సీఐ మాధవరావుకు సమాచారం తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అల్లూరు ఎస్ఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటుందనే....
అల్లూరు : మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి అల్లూరు చెరువులో హత్యకు గురైన విషాద సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. కోవూరు సీఐ అశోకవర్ధన్, అల్లూరు ఎస్ఐ చల్లా వాసు కథనం మేరకు.. అల్లూరు వడ్డిపాళెంకు చెందిన వల్లెపు స్వప్నప్రియ, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన వల్లూరు తిరుమలకుమార్ కావలిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గతేడాది ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను పూర్తి చేశారు. అయితే తరచూ ఫోన్లో సంభాషించుకుంటూ అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో స్వప్నప్రియ తన స్నేహితుడు తిరుమలకు రెండున్నర సవర్ల బంగారు చైన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో స్వప్నప్రియకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉంది. దీంతో తనకు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారని, తానిచ్చిన చైన్ తనకు ఇవ్వాలని వారం రోజులుగా తిరుమలకు ఫోన్ చేసి అడుగుతూ ఉంది. అయితే స్వప్న తనను కాదని మరొకరిని వివాహమాడటం ఇష్టం లేని తిరుమల ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసి అల్లూరు కస్తూరిదేవి పార్కు ప్రాంతానికి వచ్చి తన వద్దకు రమ్మన్నాడు. దీంతో స్వప్న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తిరుమల వద్దకు వెళ్లింది. అనంతరం ఇద్దరూ కలిసి అల్లూరు-పల్లిపాడు మధ్యన ఉన్న చెరువుకట్ట ప్రాంతానికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ..తిరుమల ముందుగా తనతో తెచ్చుకున్న చాకుతో ఆమె గొంతు కింది భాగాన పొడిచాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో జుట్ట పట్టుకుని చెరువులోకి లాక్కెళ్లి తలను పూర్తిగా ముంచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు. స్వప్న ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి వల్లెపు పద్మజ, బంధువులు బుధవారం అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం స్వప్నకు సన్నిహితుడైన తిరుమలను అనుమానించారు. బుచ్చిరెడ్డిపాళెంకు వెళ్లి నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు చెరువు ప్రాంతంలో పరిశీలించగా చెట్ల మధ్య స్వప్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా మృతదేహం నీటిలో ఉండటంతో ముఖమంతా బాగా ఉబ్బిపోయి గుర్తు పట్టలేనంతగా తయారైంది. కాళ్లు చేపలు తిని పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోయాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో మృతదేహాన్ని ఎక్కువసేపు బంధువులు సైతం చూడలేకపోయారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన తమ కుమార్తె శవంగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు తిరుమలను శుక్రవారం కోర్టుకు హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రియురాలిని దారుణంగా హతమార్చి...
-
ప్రియురాలిని దారుణంగా హతమార్చి...
నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థినిని... సహ విద్యార్థి హతమార్చి, చెరువులోకి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వల్లూరు తిరుమలకుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే అల్లూరుకు చెందిన స్వప్నప్రియ కావలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలో బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన తిరుమలకుమార్ ను ప్రేమించింది. అతడికి చాలాసార్లు డబ్బు సాయం కూడా చేసింది. ఒకసారి తన బంగారు గొలసును కూడా అతడికి ఇచ్చింది. అయితే వీరి ప్రేమను స్వప్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆమెకు తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. ఈనెల 14న వివాహం నిశ్చయించారు. కాగా మూడు రోజుల క్రితం తిరుమలతో కలిసి బయటకు వెళ్లిన స్వప్న...అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు అల్లూరు చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య జరిగి సుమారు 48 గంటలకు పైగానే అయి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టంకు తరలించారు. కూతురుకి బంగారు భవిష్యత్ కోసం రైతు అయిన స్వప్న తండ్రి కష్టపడి ఆమెను బీటెక్ చదివించినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీలో టీడీపీ నేతల చేరిక
అల్లూరు, న్యూస్‌లైన్ : మండలంలోని నార్తుమోపూరుకు చెందిన టీడీపీ సీని యర్ నేతలు పిడూరు పరమేశ్వరరెడ్డి, నూకలపాటి శివకుమార్‌రెడ్డి శుక్రవారం కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో 100 మంది అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో జ రుగబోయే సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ప్రజ లకు సుభిక్షమైన పాలనను అందించాలంటే రాష్ట్రానికి యువకుడైన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్మోహన్రెడ్డి మీదున్న నమ్మకంతో నే తనతో పాటు తన అనుచర వర్గమం తా వైఎస్సార్సీపీలో చేరామన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీలో తా ను సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించామన్నారు. ప్రస్తు తం వైఎస్సార్సీపీలో ఉన్న అందరిని క లుపుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థు ల విజయానికి కృషి చేస్తామన్నారు. పా ర్టీ సీనియర్ నాయకుడు మేడా అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భవననిర్మాణానికి పునాదులు ఎంతగట్టిగా ఉంటాయో పార్టీ నిలబడాలంటే కార్యకర్తలు అంతగట్టిగా ఉండాలన్నారు. పరమేశ్వరరెడ్డి పార్టీలో చేరడం ఎంతో సంతోషమన్నారు. అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, యువజన విభాగ కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పార్టీనాయకులు బాలకృష్ణంరాజు, అక్కల రాఘవరెడ్డి, కేతిరెడ్డి కృష్ణారెడ్డి, ఊటు అశోక్‌రెడ్డి, కేతిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు. కావలి: బోగోలు మండలం అనంతరాజువారింకండ్రిగకు చెందిన కొందరు టీ డీపీ నేతలు శుక్రవారం వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. స్థానిక పుల్లారెడ్డినగర్ లో ఉన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం లో వారికి పార్టీ కండువా వేసి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో బాలకృష్ణ, హరి, వెంకటేశ్వర్లు, సురేష్, సురేంద్ర, శ్రీనాథ్, ప్రసా ద్, సిద్దయ్య, సుదర్శన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు రమణయ్యనాయుడు, కిషోర్‌బాబు, శ్రీను ఉన్నారు -
టీడీపీలో గుర్తింపు లేనందుకే పార్టీ వీడా
ఆలూరు: తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందుకే పార్టీని వీడానని టీడీపీ ఆలూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి వైకుంఠం శివప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన కుటుంబం పార్టీకి విశేష సేవలు అందించిందన్నారు. చివరికి పార్టీ కోసం తన తల్లిదండ్రులను, తన కుటుంబానికి సహకరించిన కొందరిని కూడా పోగొట్టుకున్నానన్నారు. తమ సేవలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆ పార్టీలో ఉండలేకనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల హైదరాబాద్‌లో కలిసినట్లు చెప్పారు. త్వరలో అధికారికంగా పార్టీలో తన అనుచరవర్గంతో చేరుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా తన అభివృద్ధిని కోరుకునే నాయకులు, కార్యకర్తలకు సహాయ, సహకారాలను అందిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు. -
అల్లూరులో సకలజనుల మహాధర్నా
-
ఓటు వేయలేదని 5 కుటుంబాల వెలి
పిట్టలవానిపాలెం: గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఆగడాలకు హద్దూపద్దూ లేకుండా పోతోంది. ఎన్నికలలో తమకు మద్దతు పలకలేదని ప్రత్యర్థి వర్గానికి చెందినవారిన గ్రామబహిష్కరణ చేయడానికి తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు శివారు రెడ్డిపాలెంలో పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారునికి ఓట్లు వేయలేదని అయిదు కుటుంబాలను వెలేశారు. బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుడిపై వైఎస్ఆర్ సిపి మద్దతుదారుడు స్పర్పంచ్గా గెలిచారు. గ్రామపెద్దలు కాంగ్రెస్ మద్దతుదారులు కావడంతో తమ అభ్యర్థికి మద్దతు పలకలేదని అయిదు కుటుంబాలను వేధించడం మొదలు పెట్టారు. గ్రామం వదిలి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో బాధితులు పిట్టు శివారెడ్డి, పులుగు ఏడుకొండలు రెడ్డి, అక్కల నరసారెడ్డి, చీరాల సుబ్బారెడ్డి, చీరాల నారాయణ రెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దుకాణాల్లో నిత్యావసర వస్తువులు సైతం తమకు అమ్మడంలేదని వారు తెలిపారు. తమతో ఎవరూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించినట్లు వారు వాపోయారు. దీంతో మనస్థాపానికి గురైన అక్కల నరసారెడ్డి ఈ నెల 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతనిని పొన్నూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుమారుడు చంద్రశేఖర రెడ్డి చెప్పారు. గ్రామంలో తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, తెనాలి ఆర్టీఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల డిఎస్పి భాస్కర్లకు లేఖలు రాశారు.