బీర్కూర్,న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, తెలంగాణ అభివృద్ధి ఒక్క టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బీర్కూర్ మండలంలోని దామరంచ, రైతునగర్, అన్నారం తదితర గ్రామాల్లో ఆయన ఎంపీటీసీ, జడ్పిటీసీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓపెన్‌టాప్ జీపులో గ్రామంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దామరంచ గ్రామంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన త ర్వాత వచ్చే మూడేళ్లలో రైతులకు 24గంటల కరెంటును అందిస్తామని తెలిపారు. ప్రతీ మండలంలోను గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు పెర్క శ్రీనివాస్, ద్రోణవల్లి సతీష్, తోట నారాయణ, అప్పారావ్, ఎంపీటీసీ అభ్యర్థి గంగారాం, జడ్పీటీసీ అభ్యర్థి కిషన్‌నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ
Published Sun, Mar 30 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM
Advertisement
Advertisement