ఆరోపణలు రుజువు చేయండి | To prove the allegations says kalvakuntla kavitha | Sakshi
Sakshi News home page

ఆరోపణలు రుజువు చేయండి

Published Mon, Apr 28 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

To prove the allegations says kalvakuntla kavitha

 ఆర్మూర్, న్యూస్‌లైన్ : దమ్ముంటే టీఆర్‌ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ఆర్మూర్ మండలం ఆలూర్‌లో ఆదివారం రాత్రి కవిత, జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు.

 అందుకే  తన స్థాయిని మరిచి ఇష్టానుసారంగా అసత్యపు ఆరోపణలను ప్రచారం చేయిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఎర్రజొన్నల బకాయిలు రూ. రూ. పది కోట్ల 83 లక్షలు రైతులకు చెల్లిస్తామన్నారు.

 టీఆర్‌ఎస్‌కు ముంబైకర్ల మద్దతు
 తెలంగాణ ప్రాంతం నుంచి ఉపాధి వేట లో ముంబయ్‌కి వలస వెళ్లిన ముంబయ్‌కర్లు ఆదివారం టీఆర్‌ఎస్‌కుమద్దతు తె లుపుతున్నట్లు తీర్మానించారు. ముంబ య్ తెలంగాణ జేఏసీ చైర్మన్ మూల్ ని వాస్ మాల ఆధ్వర్యంలో వలస జీవులు టీఆర్‌ఎస్ట్‌కు మద్దతు తెలియజేశారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితను, ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎ జీవన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మద్దతు పలుకుతూ చేసిన తీర్మానం ప్రతిని కవితకు అందజేశారు.

 ఓసీ పేదల  సంక్షేమ సంఘం మద్దతు..
 భిక్కనూరు : ఓసీల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినందున ఆ పార్టీకి ఓసీ పేదల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచర్ల మహేందర్‌రెడ్డి, కామారెడ్డి కన్వీనర్ బాలుగుప్తా అన్నారు. ఆదివారం వారు జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌తో కలిసి తమ మద్దతును తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement