రాబోయేది ప్రజల పాలన | upcoming public governance | Sakshi
Sakshi News home page

రాబోయేది ప్రజల పాలన

Published Tue, Apr 1 2014 2:05 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

upcoming public governance

 వీరపునాయునిపల్లె, న్యూస్‌లైన్ :  రెండు నెలల్లో ప్రజలు కోరుకున్న పాలన రాబోతోందని వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఎస్.మునిరెడ్డి, ఆంజనేయరెడ్డి, ఎస్.చిన్నమునిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఓబన్న, ఓబులు, పోతులూరయ్య, బాల వీరయ్య తదితరులు తమ అనుచరులతో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.

వీరిని  రవీంద్రనాథరెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వీరిని అభినందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. త్వరలో మంచి పాలన అందుతుందని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ విద్యుత్ విభాగపు రాష్ట్ర నాయకులు పాండు రంగారెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, స్థానిక నాయకులు శంభురెడ్డి, అడవిచెర్లోపల్లె సర్పంచ్ సాంబశివారెడ్డి  పాల్గొన్నారు.

 నిరుద్యోగ సమస్య నిర్మూలనకే ఫ్యాక్టరీల ఏర్పాటు

 కడప జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వైఎస్ జగన్ భారతి సిమెంటు కర్మాగారం ఏర్పాటు చేశారని వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం అంకిరెడ్డిపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు.   నిరుద్యోగ సమస్యను నిర్మూలించి వెనుకబడిన ప్రాంతమైన కమలాపురం నియోజకవర్గంలో భారతి సిమెంటు కర్మాగారాన్ని జగన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు.  

 ఫ్యాక్టరీ ఏర్పాటుపై కొంతమంది చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.  జగన్ సీఎం అయిన వెంటనే అంబవరం దగ్గర ఉన్న 6వేల ఎకరాలను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారన్నారు. మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి వైఎస్‌ఆర్ టీయూసీ రాష్ట్ర నాయకులు పాండు రంగారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement