సాక్షి,ముంబయి: బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌తో వివాదంపై హృతిక్ రోషన్ మౌనం వీడారు. కంగనాను తానెప్పుడూ ప్రైవేట్‌గా కలవలేదని, ఇద్దరు హైప్రొఫైల్ సెలబ్రిటీలు ఎలాంటి ఆధారం లేకుండా ఏడేళ్ల పాటు ఎలా ఎఫైర్ సాగిస్తారని ప్రశ్నించారు.తమ మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఉందనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవు...తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు లేవు..ప్యారిస్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగిందనే ప్రచారానికి ఆధారంగా కనీసం సెల్ఫీ కూడా లేదని అంటూ తమ మధ్య అనుబంధం అవాస్తవమని తేల్చిచెప్పారు.
కొన్నిసార్లు చిన్న అనారోగ్య సమస్యనూ నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమవుతుందని, దురదృష్టకరంగా కంగనా వివాదంలో తన పరిస్థితీ అలాగే మలుపు తీసుకుందని సోషల్ మీడియాలో వాపోయారు.తామిద్దరం కలిసి సినిమాల్లో పనిచేసినా ప్రత్యేకంగా ఎన్నడూ కలుసుకోలేదని చెప్పారు. తన జీవితంలో ఎన్నడూ కంగనాను ముఖాముఖీ కలవలేదని ఇది వాస్తవమని స్పష్టం చేశారు. ఆమెతో తనకు ఎఫైర్ ఉందనే ఆరోపణలకు వ్యతిరేకంగా తాను పోరాడటం లేదన్నారు.
అయితే దానికన్నా సున్నితమైన, తీవ్ర సమస్య నుంచి తనను తాను రక్షించుకునే పనిలో ఉన్నానన్నారు. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గత ఏడాది హృతిక్‌ను సిల్లీ ఎక్స్‌గా సంభోదించడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. దీనిపై హృతిక్ మండిపడటం తనతో ఆమె సాగించిన ఈమెయిల్ సంభాషణలను బయటపెట్టారు. దీనిపై కంగనా, హృతిక్‌లు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.కంగనా, ఆమె సోదరి హృతిక్‌పై బురదచల్లుతుండటం, హృతిక్ తరపున ఆయన తండ్రి సీనియర్ రాకేష్ కంగనా సిస్టర్స్‌పై విరుచుకుపడటంతో వివాదం శ్రుతిమించింది.
Comments
Please login to add a commentAdd a comment