11 భాషలకు ఒకే కీప్యాడ్... స్వలేఖ్ | 11 languages in the same keypad | Sakshi
Sakshi News home page

11 భాషలకు ఒకే కీప్యాడ్... స్వలేఖ్

Published Wed, Feb 4 2015 12:18 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

11 భాషలకు ఒకే కీప్యాడ్... స్వలేఖ్ - Sakshi

11 భాషలకు ఒకే కీప్యాడ్... స్వలేఖ్

స్మార్ట్‌ఫోన్‌పై తెలుగులో ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లు టైప్ చేసుకునేందుకు ఎన్నో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. మరి తెలుగుతోపాటు మీకు తమిళమూ తెలిసుంటే? ఆ భాషలోనూ టైప్ చేయాలనుకుంటే... రెండో అప్లికేషన్‌ను కాకుండా... స్వలేఖ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇంగ్లీషుతోపాటు ఏకంగా 11 భారతీయ భాషల్లో టైప్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రివియేరా లాంగ్వేజ్ టెక్నాలజీస్ అభివౄద్ధి చేసిన ఈ వినూత్నమైన కీప్యాడ్‌తో ఎన్నో ఉపయోగాలున్నాయి. భారతీయ భాషల్లో నేరుగా టైప్ చేసుకోవడంతోపాటు ఇంగ్లీషు లిపి సాయంతోనూ టైప్ చేసుకోవచ్చు. వాట్సప్‌తోపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, మెయిల్స్ అన్నింటిలోనూ పనిచేయగల సామర్థ్యం దీని సొంతం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement