భలే ఆప్స్
లైఫ్ అన్‌ప్లగ్డ్
మెయిళ్లు, ఫోన్లు... ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్‌లు... హైక్‌లు. అబ్బో... రోజువారీ వ్యవహారాల్లో ఎంత హడావుడో! ఏ పనీ కుదురుగా, శ్రద్ధగా పూర్తి చేసే అవకాశమే ఉండదు. ఇదేనా మీ బెంగ? అయితే లై్‌ఫ్ అన్‌ప్లగ్డ్ మీ కోసమే. గూగుల్ ప్లే స్టోర్‌లో (ఆఫ్‌టైమ్) లైఫ్ అన్‌ప్లగ్డ్ పేరుతో ఉచితంగా లభిస్తున్న ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఎప్పుడు అవసరమైనప్పుడల్లా అన్ని రకాల సమాచార మార్గాలను మూసేయవచ్చు. టెక్ట్స్‌లు, నోటిఫికేషన్లతోపాటు కాల్స్‌ను కూడా మీకు కావాల్సినంత సమయం బ్లాక్ చేయడంతోపాటు ఒక్కో రకం మెసేజీలకు ఒక్కోరకమైన సమాధానం ఇచ్చేలా సెట్ చేసుకోవచ్చు. మీ పని పూర్తి చేసుకున్న తరువాత ఒక్కసారి రీకనెక్ట్ అయితే సరి... మీరు ఆఫ్‌టైమ్‌లో ఉన్నప్పుడు ఏమేం మెసేజీలు వచ్చాయి? ఎవరెవరు కాల్స్ చేశారన్నది తెలుసుకోవచ్చు.
7 మినిట్ వర్కవుట్
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. డాక్టర్లు ఇచ్చే సలహా కూడా ఇదే. కానీ మనమేమో టైం లేదనో... మరో ఇతర కారణం చేతనో ఎక్సర్‌సైజులకు దూరంగా ఉంటాం. ‘‘అంత టైమెక్కడండీ?’’ అనేస్తాం. కానీ ‘7 మినిట్ వర్కవుట్’ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి... పేరులో ఉన్నట్లే... ఏడంటే ఏడు నిమిషాల్లో మీకు ఎంతో ఉపయోగపడేలా ఎలా వ్యాయామం చేయవచ్చో నేర్పుతుంది. ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమయ్యే అప్లికేషనే. మొత్తం పన్నెండు రకాల ఎక్సర్‌సైజులతో దీన్ని రూపొందించారు. పరికరాలు కూడా పెద్దగా అవసరముండదు. మీతోపాటు ఓ కుర్చీ, గోడ ఉంటే చాలు. ఇంట్లోనే రోజూ ఏడు నిమిషాల్లో చెమటలు కక్కేయవచ్చు.
మీ భాషలోనే హంగామా
స్మార్ట్‌ఫోన్ల ద్వారా సంగీతం వినడం దాదాపు అందరూ చేసే పనే. ఇందుకోసం అనేక రకాల అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒకటైన హంగామా.కామ్ ఇటీవలే ఓ వినూత్నమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ మాతభాషలోనే మీరు వినాలనుకుంటున్న పాటను వెతుక్కునేలా అప్లికేషన్‌ను అధునికీకరించింది. అంటే... తెలుగు పదాలను ఇంగ్లీషులో కాకుండా... తెలుగులోనే చూసుకోవచ్చునన్నమాట. దేశంలోనే తొలిసారి తాము ఇలాంటి సర్వీసు అందిస్తున్నామని, తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, పంజాబీ వంటి పది భారతీయ భాషల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ చెబుతోంది. అప్లికేషన్‌లోని సెట్టింగ్స్‌లో ఒకసారి మార్పులు చేసుకుంటే చాలు.. ఆ తరువాత మీకు నచ్చిన భాషలో పాటల పేర్లు, అలర్ట్ మెసేజీలు పొందవచ్చు. ఆండ్రాయిడ్‌తోపాటు, ఆపిల్ ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.