స్వచ్ఛమైన గాలికి ఎయిర్‌బాక్స్‌! | Airbox For Clean Air | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన గాలికి ఎయిర్‌బాక్స్‌!

Published Mon, Dec 16 2019 12:26 AM | Last Updated on Mon, Dec 16 2019 12:26 AM

Airbox For Clean Air - Sakshi

పీల్చే గాలి విషమవుతోంది. రుజువు కావాలా? ఒక్కసారి ఢిల్లీకెళ్లి చూడండి. ఆ సంగతి ఇప్పుడెందుకంటారా? ఫొటో చూసేయండి.. విషయం మీకే అర్థమైపోతుంది. ఫొటోలో కనిపిస్తున్నది అత్యాధునిక ఎయిర్‌ ఫిల్టర్‌. పేరు ఎయిర్‌బాక్స్‌. పిట్టకొంచెం కూత ఘనం అంటామే ఆ టైప్‌ అన్నమాట. బాత్రూముల్లోని సూక్ష్మజీవులు మొదలుకొని రసాయనిక రంగుల్లోని హానికారక కాలుస్యాల వరకూ అన్నింటినీ ఇట్టే పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అప్పుడప్పుడూ ఇందులోని ఫిల్టర్‌ను బయటకు తీసి శుభ్రం చేసుకోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని.

అరచేతిలో ఇమిడిపోయే ఈ ఎయిర్‌ ఫిల్టర్‌లోకి కలుషితాలతో కూడిన గాలి ప్రవేశించిన వెంటనే ముందుగా ఈ ఫిల్టర్‌ ద్వారా ప్రయాణించి పెద్దపెద్ద ధూళికణాలను తీసేస్తుంది. ఆ తరువాత ఓ యూవీ ఎల్‌ఈడీ లైటు సాయంతో ఓ నానో రియాక్టర్‌ హానికారక రసాయన కణాలను ధ్వంసం చేస్తుంది. చివరగా నెగటివ్‌ అయాన్‌ జనరేటర్‌ సెకనుకు రెండు కోట్ల అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది అతిసూక్ష్మమైన పిఎం 2.5 కణాలకు అతుక్కుని తొలగిస్తుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌బాక్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన నిధులను కిక్‌స్టార్టర్‌ వేదికగా సేకరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement