షియోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్
కొత్త సరుకు
తక్కువ ధరకే అద్భుతమైన నాణ్యతతో కూడిన ఆండ్రాయిడ్ డివైస్‌లు అందించడంలో పేరు పొందిన చైనా కంపెనీ జియోవోమీ తాజాగా భారత్‌లో ‘ఎంఐ 3’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని విడుదల చేసిన ఐదు సెకన్లకే మొత్తం 10 వేల ఫోన్లూ అమ్ముడయ్యాయట. ఈ ఫోన్ కోసం ఫి్‌లప్‌కార్ట్‌లో సుమారు లక్ష మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారట. ఆకర్షణీయమైన అల్యూమినియం- మెగ్నీషియం చాసిస్, 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తెర, గీతలు పడకుండా ఉండే గొరిల్లా గ్లాస్3 దీని ప్రత్యేకతలు. ర్యామ్ 2 జీబీ. ఇంటర్నల్ స్టోరేజీ 16-64 జీబీ. ప్రాసెసర్ వేగం 2.3 గిగాహెర్జ్. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 3050 ఎంఏహెచ్. ధర రూ.13,999 మాత్రమే. రానున్న నెలల్లో రెడ్‌మి 1ఎస్(రూ.6,999), రెడ్‌మి నోట్(రూ.9,999) స్మార్ట్‌ఫోన్లను కూడా భారత్‌లో విడుదల చేసేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.