New merchandise
-
షియోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్
కొత్త సరుకు తక్కువ ధరకే అద్భుతమైన నాణ్యతతో కూడిన ఆండ్రాయిడ్ డివైస్‌లు అందించడంలో పేరు పొందిన చైనా కంపెనీ జియోవోమీ తాజాగా భారత్‌లో ‘ఎంఐ 3’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని విడుదల చేసిన ఐదు సెకన్లకే మొత్తం 10 వేల ఫోన్లూ అమ్ముడయ్యాయట. ఈ ఫోన్ కోసం ఫి్లప్కార్ట్లో సుమారు లక్ష మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారట. ఆకర్షణీయమైన అల్యూమినియం- మెగ్నీషియం చాసిస్, 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే తెర, గీతలు పడకుండా ఉండే గొరిల్లా గ్లాస్3 దీని ప్రత్యేకతలు. ర్యామ్ 2 జీబీ. ఇంటర్నల్ స్టోరేజీ 16-64 జీబీ. ప్రాసెసర్ వేగం 2.3 గిగాహెర్జ్. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 3050 ఎంఏహెచ్. ధర రూ.13,999 మాత్రమే. రానున్న నెలల్లో రెడ్మి 1ఎస్(రూ.6,999), రెడ్మి నోట్(రూ.9,999) స్మార్ట్ఫోన్లను కూడా భారత్‌లో విడుదల చేసేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. -
కొత్త సరుకు
ఇండియాలోకి ఎల్జీ జీ3 ఎల్జీ కంపెనీ తన జీ3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.5 ఇంచెస్ ఎల్సీడీ క్యూహెచ్డీ డిస్ప్లేతో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ వెర్షన్‌పై పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16 జీబీతో ఉండే స్మార్ట్‌ఫోన్ ధర 47,990 కాగా, 3జీబీ ర్యామ్‌తో 32 జీబీతో ఉండే స్మార్ట్‌ఫోన్ ధర రూ.50,990. అత్యంత తేలికగా ‘లావా ఐరిస్ ప్రో 30’ కేవలం 114 గ్రాముల బరువుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది లావా. ఐరిస్ ప్రో 30 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్‌ను ఆల్ట్రా లగ్జరియస్ స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొంది. ఇది నమ్మలేనంత తేలికగా ఉంటుందని రివ్యూల్లో పేర్కొన్నారు. యూత్ లక్ష్యంగా రూపొందిన ఈ మిడ్‌రేంజ్ ఫోన్ ధర రూ.15,999. -
కొత్త సరుకు
లావా ఐరిస్ ఎక్స్1 దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐరిస్ ఎక్స్1 పేరుతో కిట్‌క్యాట్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్ షాపింగ్ పోర్టల్ ద్వారా లభిస్తున్న ఎక్స్1 ధర దాదాపు రూ.7999. రెండు జీఎస్ఎం సిమ్‌లను సపోర్ట్ చేసే ఎక్స్1 స్క్రీన్ సైజు దాదాపు 4.5 అంగుళాలు. స్క్రీన్ రెజల్యూషన్ 480 బై 854గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.2 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేసే బ్రాడ్‌కామ్ బీసీఎం 23550 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెండు ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది. రెజల్యూషన్ 8 మెగాపిక్సెల్స్. వీడియోకాలింగ్ కోసం రెండు ఎంపీల కెమెరా ఉంటుంది. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీ కార్డు ద్వారా 32జీబీకి పెంచుకోవచ్చు) ఉంటుంది. త్రీజీతోపాటు వైఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్/ఎడ్జ్, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ స్మార్ట్‌ఫోన్‌లో తాజా ఓఎస్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎంగేజ్... మైక్రోమ్యాక్స్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కాన్వాస్ ఎంగేజ్ను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే కొనుక్కోగల ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.6199 మాత్రమే కావడం గమనార్హం. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌ను ఉపయోగించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (1.2 గిగాహెర్ట్జ్) ఉన్నప్పటికీ ర్యామ్ మాత్రం 512 ఎంబీ మాత్రమే ఉండటం కొంచెం నిరాశపరిచే అంశం. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 5 ఎంపీ కాగా, వీడియోకాలింగ్ కెమెరా రెజల్యూషన్ 0.3 మెగాపిక్సెల్స్. బ్యాటరీ సామర్థ్యం 1500 ఎంఏహెచ్. ఈ బ్యాటరీతో 5.5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, హైక్, ఎంఐగేమ్స్, గేమ్స్క్లబ్, రివెరై ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి సాఫ్ట్వేర్లు దీంట్లో ప్రీలోడెడ్. గెలాక్సీ ఎస్4 వాల్యూ ఎడిషన్... శామ్సంగ్ తాజాగా కిట్‌క్యాట్‌తో నడిచే గెలాక్సీ ఎస్4 వాల్యూ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి దీన్ని ఆన్లైన్ స్టోర్ ద్వారా నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ధర దాదాపు రూ.31,700. అయిదు అంగుళాల ఫుల్హెచ్డీ స్క్రీన్‌తో వచ్చే ఎస్4 వాల్యూ ఎడిషన్‌లో శక్తిమంతమైన 1.9 గిగాహెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ మైక్రోప్రాసెసర్‌ను ఉపయోగించారు. రెండు గిగాబైట్ల ర్యామ్, 15 జీబీల ఇంటర్నల్ మెమరీ దీని సొంతం. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెళ్లు. వీడియో కాలింగ్ కెమెరా రెజల్యూషన్ 2 ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 2600 ఎంఏహెచ్. -
కొత్త సరుకు
క్యూప్యాడ్ ఈ704 దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తాజాగా క్యూప్యాడ్ ఈ704 పేరుతో ఓ టాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దాదాపు రూ.9999 ఖరీదు చేసే ఈ టాబ్లెట్‌ను ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్, కంపెనీలను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేశారు. వీడియో, వాయిస్ కాల్స్ రెండింటినీ సపోర్ట్ చేసే ఈ డ్యుయెల్ సిమ్ టాబ్లెట్ 1.2 క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఏడు అంగుళాల ఐపీఎస్ ఫుల్ డిస్ప్లే స్క్రీన్, 1024 బై 600 రెజల్యూషన్ దీని సొంతం. ఒక గిగాబైట్ ర్యామ్, నాలుగు గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజీ (మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు)లతో వచ్చే క్యూప్యాడ్లో ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. గేమ్స్ కోసం వీడియోకోర్ మల్టీమీడియా టెక్నాలజీని వాడారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ కాగా, ఫ్రంట్ కెమెరాది 0.2 ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌తో...గెలాక్సీ ఏస్ స్టైల్ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ 4.4 కిట్‌క్యాట్‌తో పనిచేసే సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏస్ స్టైల్‌ను సాంసంగ్ అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటగా జర్మనీలో విడుదలయ్యే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందన్నది స్పష్టం కావాల్సి ఉంది. నాలుగు అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే స్క్రీన్‌తో వచ్చే ఏస్ స్టైల్ 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ర్యామ్ కేవలం 512 మెగాబైట్స్ మాత్రమే ఉండటం గమనార్హం. మైక్రోఎస్డీ కార్డు ద్వారా 64 గిగాబైట్ల సమాచారాన్ని స్టోర్ చేసుకునే అవకాశముంటుంది. ఇంటర్నల్ స్టోరేజీ 4 గిగాబైట్లు మాత్రమే. బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్లతోపాటు త్రీజీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఛాట్ఆన్ ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసు అప్లికేషన్‌తో కలిపి వచ్చే ఏస్ స్టైల్ క్రీమ్వైట్, గ్రే రంగుల్లో లభ్యం కానుంది. ధర ఎంతన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రూ.16,500 నుంచి రూ.25,000 మధ్యలో ఉండవచ్చునని అంచనా. -
కొత్త సరుకు...
మతిమరపు రాయుళ్ల కోసం... స్మార్ట్‌ఫోన్, కళ్లజోడు, పర్స్... ఇలా ముఖ్యమైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ మరచిపోయే వాళ్లు మనలో చాలామంది ఉంటారు. ఇలాంటివారి కోసమే తయారైన ఎలక్ట్రానిక్ పరికరం బ్రింగర్! మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువులకు చిన్న ట్యాగ్‌ను తగిలిస్తే చాలు.. అన్ని వస్తువులు ఉన్నాయా? లేదా? అన్నది చెక్ చేసి దేన్ని మరచిపోయారో మీకు గుర్తు చేస్తుంది. బ్లూ టూత్ ఆధారంగా పనిచేసే ఈ గాడ్జెట్ కారులో లైటర్ స్టాండ్‌లో ఇమిడిపోతుంది. కారెక్కగానే... ట్యాగ్స్ ఉన్న పరికరాలన్నీ మీతోనే ఉన్నాయా? లేదా? అన్నది చూస్తుందన్నమాట. ప్రస్తుతానికి దీన్ని కారు ఉన్నవారు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. భవిష్యత్తులో ఇతరులకూ పనికొచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లల కోసం ఎడ్డీ... స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టాబ్లెట్‌ను మెటిస్ లెర్నింగ్ కంపెనీ ఇటీవలే భారత్‌లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ టాబ్లెట్ ఏకంగా 1.6 గిగాహెర్ట్జ్ డ్యుయల్‌కోర్ ప్రాసెసర్‌పై నడుస్తూండటం విశేషం. అంతేకాదు... ఏడు అంగుళాల స్క్రీన్‌సైజ్‌తో లభించే ఎడ్డీలో ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది గిగాబైట్ల మెమరీ ఏర్పాటు చేశారు. రెండు మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. స్కూల్ కరిక్యులమ్‌కు అనుగుణమైన ప్రీలోడెడ్ ఆప్స్, ఆటల ద్వారా కొత్త విషయాలను నేర్పే టెక్నిక్స్ కూడా దీంట్లో ఉన్నాయని, తద్వారా పిల్లలు వేగంగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని కంపెనీ తెలిపింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా ఇబ్బంది లేకుండా టాబ్లెట్ చుట్టూ రబ్బర్ ఫ్రేమ్ ఒకటి ఏర్పాటు చేశారు. రెండు నుంచి 10 ఏళ్ల వయసు మధ్యవారి కోసం ఉద్దేశించిన ఎడ్డీలోని కంటెంట్‌ను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నియంత్రించే వీలుంది. రెండేళ్ల పసివాళ్లు కూడా రోజుకు రెండు గంటల వరకూ టాబ్లెట్‌ను వాడినా కంటికి ఇబ్బంది లేని స్క్రీన్, రెజల్యూషన్‌ను ఉపయోగించామని కంపెనీ తెలిపింది. ధర దాదాపు రూ.10వేలు. మరిన్ని వివరాల కోసం www.eddytablet.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. జియోనీ జీ4 ఫాబ్లెట్... చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోనీ తాజాగా జీప్యాడ్4 పేరుతో ఓ శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 5.7 అంగుళాల స్క్రీన్‌సైజ్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 7.95 మిల్లీమీటర్ల మందంతో ఉండే అల్యూమినియం యునీబాడీ జీప్యాడ్ మరో ప్రత్యేకత. 1280 బై 720 ఫుల్హెచ్డీ డిస్ప్లేతో చిత్రం స్పష్టతపై ఢోకా ఉండదు. అప్లికేషన్లు లాంచ్ చేసేందుకు, ఇతర కర్యాకలాపాల కోసం సంజ్ఞలు చేస్తే సరిపోయేలా దీంట్లో గెస్చర్ కంట్రోల్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. ఆటోఫోకస్, ఎల్ఈడీ ఫ్లాష్‌లతో కూడిన 13 మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3200 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆమిగో ఓఎస్‌ను దీంట్లో ఉపయోగించారు. ఫలితంగా ఫేస్‌బ్యూటీ ఎఫెక్ట్స్, హ్యాండ్స్‌ఫ్రీ ఫొటో, గెస్చర్ రికగ్నిషన్, మోషన్ సెన్సింగ్, పనోరమా మోడ్ (హారిజాంటల్, వెర్టికల్ కూడా) ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్ వంటి అదనపు హంగులు చేరాయి. డిజిటల్ థియేటర్ సిస్టమ్‌ను కూడా కలిపి ఉంచిన ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.18999.