చిన్న చిన్న ఇబ్బందులకే కొందరు విపరీతమైన నిరాశలో కూరుకుపోతుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతుంటారు. మానసిక అలజడి ఫలితంగా తరచు శారీరక రుగ్మతల బారిన పడుతుంటారు. వృత్తి ఉద్యోగాల్లో తగిన పనితీరు చూపలేక వెనుకబడిపోతుంటారు. సాధారణంగా జాతకంలో రవి బలహీనంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. రవి అనుగ్రహం కోసం ఏం చేయాలంటే...
♦ కాస్త బెల్లం కలిపి తయారు చేసిన గోధుమ రొట్టెలను గోవులకు తినిపించండి.
♦ కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు పానకం తాగి, దైవధ్యానం చేసుకుని పని మొదలుపెట్టండి.
♦ ఆదివారం రోజున ఉపవాసం పాటించండి. ఆ రోజున పేదలకు గోధుమలు, బెల్లం దానం చేయండి. వీలుంటే ఆ రోజున ఏదైనా ఆలయానికి రాగి వస్తువులను సమర్పించండి.
♦ ఆదివారం ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు వీలైనంతగా లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉంటూ గాయత్రీ మంత్రాన్ని జపించండి. ఆదిత్యహృదయ పారాయణ చేయండి.
♦ ఆదివారం స్నానాదికాల తర్వాత సూర్యోదయ వేళ బిల్వ వృక్షం నుంచి చిన్న వేరు ముక్కను సేకరించి, దానిని శుభ్రపరచి పూజలో ఉంచండి. తర్వాత దానిని తాయెత్తులా ఎరుపురంగు దారంలో మెడలో ధరించండి.
– పన్యాల జగన్నాథదాసు
నిరాశలో కూరుకు పోతున్నారా..?
Published Sun, Feb 4 2018 1:02 AM | Last Updated on Sun, Feb 4 2018 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment