హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో ఆర్థరైటిస్‌కు... | Arthritis in homeocare International | Sakshi
Sakshi News home page

హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో ఆర్థరైటిస్‌కు...

Published Tue, Dec 9 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో ఆర్థరైటిస్‌కు...

హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో ఆర్థరైటిస్‌కు...

సమర్థవంతమైన వైద్యం
ప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం ప్రకృతి సహజమైన విధానాలకు విరుద్ధంగా ఉండటం వలన సరైన వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరిత గతిన ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని పదార్థం అరుగుదలకు గురికావడంతో ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అధిక బరువు, వయస్సు, ఇన్‌ఫెక్షన్లు, వంశపారంపర్యం, ఇన్‌ఫ్లమేటరీ కారణాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.
 
ఆర్థరైటిస్‌లో రకాలు: ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటిన వారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి పెరగడం వలన వస్తుంది. ఈ విధమైన ‘డీజనరేటివ్ ఆర్థరైటిస్’ మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్ళలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కానీ శరీర బరువునంతటినీ మోసే మోకాలులో ఇది అధికంగా కనబడుతుంది. మోకాళ్ళ వాపు నొప్పి, చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించడం, నడిచే సమయంలో కిరకిరమని శబ్దం, నడిచేందుకు ఇబ్బంది పడటం, కింద కూర్చోలేకపోవడం, ఉదయాన్నే నిద్రలేచేసరికి కీళ్ల నొప్పులు అధికమవడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
 
రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఈ వ్యాధి ప్రధానంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తుంది. ఇదొక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. జీవనక్రియలలో ఏర్పడే అసమతుల్యత వలన తలెత్తే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ శరీరంలో ఇరువైపులా ఉండే కాళ్ళకు సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్ళ వైకల్యానికి దారి తీస్తోంది.
 
గౌటీ ఆర్థరైటిస్: సాధారణంగా మన రక్తంలో ‘యూరిక్ ఆమ్లం’ అనే ముఖ్య రసాయనం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం   వల్ల మోనో సోడియం సిట్రేట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది. మొదట్లో ఇది కాలి బొటనవేలు వంటి ఏదో ఒకటి రెండు కీళ్శకు పరిమితమై క్రమేపీ ఇతరత్రా జాయింట్లకు వ్యాపిస్తుంది.
 
సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సీరో నెగెటివ్ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. దీర్ఘకాలికంగా సోరియాసిస్ బాధితులైన వారిలో 30% మంది ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఈ తరహా కీళ్లనొప్పులనే వైద్య పరిభాషలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు.
 
ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్:
రక్తం ద్వారా గానీ లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్ఫెక్షన్‌కు గురి అయినప్పుడు గానీ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఎక్కువగా ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్‌మెంట్ చేసుకునేవారిలో కనిపిస్తుంది.
 
హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ చికిత్స: పైన చెప్పబడిన అన్ని రకాల ఆర్థరైటిస్‌లకు హోమియో వైద్యంలో మెరుగైన చికిత్సలుంటాయి. మిగతా వైద్య ప్రక్రియలతో పోలిస్తే నొప్పిని తగ్గించడంలోనూ కీళ్ళ కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ హోమియోపతిలో చక్కటి పరిష్కారం లభిస్తుంది. జెనెటిక్ కాన్ స్టిట్యూషనల్ విధానం ద్వారా హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో లభించే సమర్థవంతమైన చికిత్సతో ఆర్థరైటిస్ వ్యాధి బాధలను సంపూర్ణంగా నివారింపజేయవచ్చు. వ్యాధి పరిణామాలను పెరగకుండా కాపాడేందుకు కూడా వీలుంది.
 
ఉచిత కన్సల్టేషన్  955 000 1188 / 99  టోల్ ఫ్రీ  1800 102 2202
 www.homeocare.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement