Cartilage
-
మోకాళ్ళ నొప్పులకు త్రీడీ ప్రింటింగ్..!
మోకాళ్ళ నొప్పులతోపాటు, దెబ్బతిన్న చెవి, ముక్కు వంటి వాటికి త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్స్ తో సులభంగా చికిత్స చేయొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. క్రీడాకారులు, వృద్ధులు, గాయాలవల్ల ఇబ్బందిపడే అనేక మందితో పాటు ఆర్థరైటిస్ ఉన్నవారు కార్టిలేజ్ (మృదులాస్థి) కోల్పోయి తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికోసం ఓ సరికొత్త ప్రయోగాన్ని అందుబాటులోకి తెచ్చింది అమెరికా శాండియాగోలోని అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీసీ). 251వ జాతీయ సమావేశాల సందర్భంలో ఈ ప్రయోగాన్ని పరిశోధకులు పరిచయం చేశారు. త్రీ డైమెన్షనల్ బయో ప్రింటింగ్ అనేది సాంకేతిక కణజాల పునరుత్పత్తికి తోడ్పడుతుందని, ఇది వైద్య చరిత్రలో విప్లవాన్ని సృష్టిస్తుందని స్వీడన్ వాలెన్ బర్గ్ వుడ్ సైన్స్ సెంటర్ కు చెందిన పరిశోధక బృందంలోని పాల్ గాటెన్ హోమ్ చెప్తున్నారు. గాయాలు, కేన్సర్ వంటి వాటివల్ల నష్టపోయిన కార్టిలేజ్ (మృదులాష్టి) ను సృష్టించేందుకు తమ బృదం ప్లాస్టిక్ సర్జన్స్ తో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ప్రస్తుతం సర్జెన్లు ముక్కు, చెవి వంటి శరీరంలోని ఇతర భాగాలను బాగు చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోందని, ఏదో ఓరోజు త్రీడీ ప్రింటింగ్ ద్వారా రోగి కణాల నుంచి తయారు చేసే బయో ఇంక్ తో అటువంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని గాటెన్ హోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా తయారు చేసే బయో ఇంక్ తో గాటెన్ హోమ్ బృదం ప్రయోగశాల ద్వారా మృదులాస్థిని ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు జరుపుతోంది. ప్రయోగశాల్లో తయారైన ప్రింటెడ్ టిష్యూ శాంపిల్స్ ను పరిశోధకులు ఎలుకలకు అమర్చి చూశారు. కణాలు పనిచేయడంతోపాటు మృదులాస్థి ఉత్పత్తి అయినట్లుగా కొనుగొన్నారు. అయితే కణజాల సంఖ్యను పెంచేందుకు ఇక్కడ మరో అడ్డంకి ఎదురైంది. దీంతో ఎముక మజ్జు నుంచి తీసిన మూల కణాలతో కాండ్రోసైట్స్ ను కలిపి 60 రోజులపాటు వివో టెస్టింగ్ లో ఉంచారు. ఈ ప్రాధమిక పరిశోధనలు కాండ్రోసైట్ ను మృదులాస్థిని పెంచేందుకు ప్రోత్సహించినట్లు కనుగొన్నారు. ఇక మానవులపై ప్రయోగించేందుకు ముందుగా కొన్ని ప్రీ క్లినికల్ పరీక్షలు చేయాల్సి ఉన్నట్లుగా గాటెన్ హోమ్ తెలిపారు. -
మూత్రనాళ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకు దెబ్బ!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 సంవత్సరాలు. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. వీటికి తోడు ఈ మధ్య భుజం నొప్పి తరచు బాధిస్తుండడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన ఎమ్మారై చేసి, పెరి ఆర్థరైటిస్ అని నిర్థారించారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? -బాలకృష్ణ, తెనాలి శరీరంలోని కీళ్లన్నింటిలోకీ ఎక్కువగా కదిలేది భుజంకీళ్లే. దాదాపు మనం చేతులతో చేసే ప్రతిపనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. భుజం కీళ్లు కూడా మోకాలు, తుంటికీళ్లవంటివే. ఇలాంటికీళ్లను బంతిగిన్నె కీళ్లు అంటారు. ఈ కీళ్లను గుళిక అనే పల్చటి పొర కప్పి ఉంచుతుంది. కీళ్లు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. భుజంలో ఉండే ఎముకలను ఒకదానినొటి కలిపే లిగమెంట్లు ఉంటాయి. ఇవి భుజం ఎముకల చుట్టూ ఒక గుండ్రని పొరను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రదేశంలో వాపు వచ్చినప్పుడు భుజం ఎముకలని సులువుగా కదల్చలేము. అప్పుడు భుజం పనితనం తగ్గడంతోపాటు నొప్పి రావచ్చు. భుజ నిర్మాణం చూసినట్లయితే చేతిపై ఎముక చివరిభాగంలో కార్టిలేజ్ ఉంటుంది. ఇది భుజపు ఎముక చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్ లాంటి అమరికలో చేతి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతుంటుంది. ఈ నిర్మాణంలో భుజపుటెముక స్థిరంగా ఉండి కండరాలు, టాండన్స్ సహాయంతో చేతి కీలును గ ట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది. కారణాలు: భుజానికి దెబ్బ తగలడం, భుజం కప్ ప్రాంతంలో చీలిక రావడం, భుజపుటెముక ఇన్ఫెక్షన్కు గురికావడం, భుజంపై చేతికీళ్లలోని కార్టిలేజ్‌లో మార్పు రావడం, మెడ ఎముకలకు సంబంధించిన సమస్యలు, అతి మూత్ర వ్యాధి లేదా చక్కెర వ్యాధి, భుజానికి లేదా గుండెకు శస్త్ర చికిత్స జరగడం. లక్షణాలు: భుజంలో నొప్పి, భుజం కదలికలు తగ్గడం, భుజం బిగపట్టినట్లుగా ఉండటం, చేతిని పైకి ఎత్తలేకపోవటం, చేతిలో వస్తువులను పట్టుకోవాలన్నా, రాయాల న్నా, భుజం నొప్పి రావడం, సమస్య తీవ్రమైతే చేతిని తల వెనక భాగానికి ఆన్చడమూ కష్టమవుతుంది. వ్యాధి నిర్ధారణ: ఎమ్మారై స్కాన్, టీ3, టీ4, టీఎస్‌హెచ్, ఎఫ్బీఎస్, సుగర్ టెస్ట్, ఎక్స్‌రే, ఆర్బీఎస్. హోమియో చికిత్స: రోగి శారీరక, మానసిక తత్వాన్ని అనుసరించి లక్షణాలను బట్టి హోమియో చికిత్స ఉంటుంది. బెలడోనా, ఫై మెట్, రస్టాక్స్, లెడమ్పాల్, ఆర్నికా, సాంగ్యునేరియా, కాల్బికమ్లతో ఆపరేషన్ లేకుండా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23. నాకు గత కొంతకాలంగా మూత్రవిసర్జన సమయంలో మంట వస్తోంది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తే మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మందులు ఇచ్చారు. మూడు రోజుల పాటు మందులు వాడిన తర్వాత సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు వైద్యులు రాసిచ్చిన మందులు ఇప్పుడు వాడవచ్చా? ఇప్పుడు మళ్లీ వైద్యులను సంప్రదించాలా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించండి. - ఒక సోదరి మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మూత్రవిసర్జన సమయంలో మంట వస్తుంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. చాలామంది ఇలాంటి సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ వైద్యులను సంప్రదించకుండా అలాగే ఉంటారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రత పెరగవచ్చు. గతంలో వైద్యులు రాసిన మందులు ఇప్పుడు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీకు గతంలో వచ్చిన సమస్యకు, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకు వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి మీరు వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు మందులు వాడండి. నా వయస్సు 54 సంవత్సరాలు. నాకు 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఈ మధ్యన కాస్త ప్రయాణం చేస్తే చాలు... కాళ్లు వాస్తున్నాయి. నా బ్లడ్ టెస్టులో క్రియాటినిన్ 10 మి.గ్రా./డెసిలీటర్ యూరియా 28 మి.గ్రా. డెసిలేటర్ ఉంది. యూరిన్ పరీక్షలో ప్రొటీన్ 3 ప్లస్ అని తెలిపారు. నాకు షుగర్ వల్ల కిడ్నీ సమస్య ఉందా? ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలి. - జి.వి.ఎల్.బి.రాజేశ్వరి, మాగులూరు మీకు యూరిన్‌లో ప్రొటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. (డైయూరిటిక్ నెఫ్రోపతి). మొదటిది షుగర్ వల్లా లేదా కిడ్నీ లేదా ఇతర కారణాల వల్ల తెలుసుకోవాలి. మీరు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ 140 మి.గ్రా. లోపు; తిన్న తరువాత 160 మి.గ్రా. ఉండేటట్లు చూసుకోవాలి. యూరిన్‌లో వెళ్లిపోయే ప్రొటీన్‌ని తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మీరు మందులు వాడాలి. ఇవి కాకుండా ఉప్పును తగ్గించాలి. రోజుకి రెండు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. పొగతాగడానికి, మద్యానికి దూరంగా ఉండాలి.పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడకూడదు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ యశోద హస్పిటల్స్ సికింద్రాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను రోజూ ఆఫీసుకు బైక్ మీద వెళ్తుంటాను. నేను గమనించిన అంశం ఏమిటంటే... చలికాలంలో బైక్ కు ఉండే ముందు బ్రేక్స్‌కు, క్లచ్కూ నా వేళ్లు అనుకునే ప్రదేశంలోనూ, హ్యాండిల్ మీద నా అరచేయి అనుకునే చోటా చర్మం బాగా బిరుసుగా, గట్టిగా కాయలాగా మారిపోతోంది. ఆ ప్రదేశం మళ్లీ నునుపుగా మారేందుకు తగిన సలహా ఇవ్వగలరు. - మానస్, హైదరాబాద్ చలికాలంలో చర్మంలోని తేమ బయటకు వెళ్లిపోవడం వల్ల మీరు చెప్పినట్లుగా చర్మం కొన్నిచోట్ల బిరుసుగానూ, గరుకుగానూ మారిపోతుంది. ఇక చర్మం పైన కాస్తంత ఒత్తిడి పడటం, ఒరుసుకుపోతున్నట్లుగా ఉండే ప్రదేశాల్లో అది మందంగా మారిపోవడం కూడా మామూలే. ఇలా చర్మం మందంగా మారే ప్రక్రియను వైద్యపరిభాషలో ‘క్యలాసిటీ’స్ అంటారు. మామూలు వాడుక భాషలో దీన్నే కాయకాయడం అంటారు. ఇది తగ్గడానికి అనుసరించాల్సిన మార్గాలు చర్మంపై కాయ కాసే చోట తేమను సంరక్షించే షియా బటర్, గ్లిజరిన్, వైట్ సాఫ్ట్ పారఫిన్ వంటి వాటిలో దైనినైనా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు రాయాలి. కార్టికో స్టెరాయిడ్స్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ పైపూత మందులను కాయ కాసిన చోట పది రోజుల పాటు రాయాలి. ఈ కాయలు (క్యలాసిటీస్) మరీ గట్టిగా ఉంటే ‘పేరింగ్’ అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించవచ్చు. నా మడమలు విపరీతంగా పగులుతున్నాయి. మడమ నేలకు ఆనించాలంటేనే కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి రక్తం కూడా వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రవికుమార్, నేలకొండపల్లి చలికాలంలో ఇది చాలా సాధారణ సమస్య. కొన్నిసార్లు ప్లాంటార్ సోరియాసిస్, హైపర్కెరటోసిస్తో పాటు కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కాళ్లలో చాలా లోతైన పగుళ్లతో పాటు, రక్తస్రావమూ కనిపించవచ్చు. కాళ్లు పగిలి ఉన్న చోట క్రమం తప్పకుండా పారఫిన్ ఆయిల్, గ్లిజరిన్, స్క్వాలీన్ వంటివి రాయండి. క్లోబెటసాల్ ప్రాపియోనేట్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ క్రీములను రెండు వారాల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రాయండి. ప్రతిరోజూ సాక్స్ ధరించండి. పగుళ్లతో గరుకుగా మారిన చోట సున్నితంగా రుద్దండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
ఆర్థోస్కోపీ కౌన్సెలింగ్
రోడ్డు కూడా దాటలేనంత నొప్పి! నేను దూరాలు నడవలేకపోతున్నాను. దాంతో ఇటీవల డాక్టర్‌కు చూపించుకుంటే నా మోకాలి లిగమెంట్ చీరుకుపోయిందని, వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘ఏసీఎల్’ అంటారని చెప్పారు. ఈ సమస్య వచ్చినప్పటి నుంచీ నొప్పితో కనీసం రోడ్డు దాటడం కూడా కష్టమైపోయింది. రోడ్డు దాటే లోపు నేను పడిపోతానేమో అన్నంత భయంగా ఉంది. దీనికి శస్త్రచికిత్స అవసరమని కొందరు చెబుతున్నారు. మోకాలిని పూర్తిగా తెరచి చేస్తారని అన్నారు. ఇది వాస్తవమేనా? దీని కంటే మెరుగైన చికిత్సలు ఏవైనా ఉన్నాయా? నా సమస్య గురించి సరైన వివరాలను విపులంగా చెప్పండి. - వెంకటేశ్వరరావు, కర్నూలు మీరు విన్నది నిజమే. ‘ఏసీఎల్’ అనే మీ సమస్యకు మీ లక్షణాలను బట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్’ అనే కండిషన్‌కు సంక్షిప్త రూపమే ‘ఏసీఎల్’. ఇలా మీ లిగమెంట్కూ, కార్టిలేజ్కూ (మృదువుగా ఉండే ఎముక లేదా మృదులాస్థి) గాయమై, అది చీరుకుపోతే దాన్ని ‘ఆర్థోస్కోపీ’ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేసి సరిదిద్దాల్సి (రిపేర చేయాల్సి) ఉంటుంది. ఆర్థోస్కోపీ అనే ప్రక్రియలో ఒక చిన్న గాటు ద్వారా అతి చిన్నదైన ఒక కెమెరాను రెండు ఎముకలు కలిసే కీలు ప్రాంతంలో ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశపెట్టిన కెమెరా ద్వారా అక్కడి దృశ్యాలను, ఆ కెమెరాతో అనుసంధానించిన ఒక తెరపై స్పష్టంగా చూడవచ్చు. ఇలా అక్కడి దృశ్యాలను చూస్తూ గాయపడ్డ లిగమెంట్ను, కార్టిలేజ్‌కు అయిన గాయాన్ని రిపేర్ చేస్తారు. గట్టిగా ఉండే మన ఎముకల చివరన మెత్తగా ఉండే చిగురు ఎముక లేదా మృదులాస్థి అని పిలిచే మెత్తటి ఎముక కప్పి ఉంటుంది. ఇది ఎముకపై భారం ఒక్కసారిగా పడకుండా ఒక మెత్త /తలగడ (కుషన్) లాగా షాక్ అబ్జార్బర్లాగా పనిచేస్తుంటుంది. ఆర్థోస్కోపీ ప్రక్రియ ద్వారా అటు లిగమెంట్నూ, ఇటు మృదులాస్థికి అయిన గాయాన్ని ఏకకాలంలో చికిత్స చేయవచ్చు. పైగా ఇప్పుడు వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక పురోగతి వల్ల మీ ఎముక నుంచే మీ సొంత ఎముకమజ్జ (మ్యారో)ను తీసుకొని, మీ మృదులాస్థి కణాలను రిపేర్ చేయవచ్చు. దీన్నే కార్టిలేజ్ మార్పిడి చికిత్స (కార్టిలేజ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) అంటారు. దీనివల్ల భవిష్యత్తులో మీకు రాబోయే ఆస్టియో ఆర్థరైటిస్‌ను నివారించవచ్చు. అంటే మోకాళ్లు అరిగే పరిస్థితిని నివారించవచ్చన్నమాట. మోకాలిని పూర్తిగా తెరచి చేసే చికిత్సతో పోలిస్తే ఆర్థోస్కోపీ ద్వారా చేసే చికిత్స వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి... కెమెరా ద్వారా చూస్తూ చికిత్స చేయడం వల్ల అక్కడి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి పూర్తిగా మోకాలు తెరవడానికి కోతకు బదులుగా చిన్న గాటుతోనే శస్త్రచికిత్స పూర్తవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు, రక్తస్రావం, నొప్పి, శస్త్రచికిత్సకు పట్టే సమయం... ఇవన్నీ గణనీయంగా తగ్గుతాయి. దాంతో రోగి త్వరగా నడవవచ్చు. డాక్టర్ సుకేశ్రావు సంకినేని కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ - కార్టిలేజ్ రిపేర్ సర్జన్, సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఆర్థరైటిస్‌కు...
సమర్థవంతమైన వైద్యం ప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం ప్రకృతి సహజమైన విధానాలకు విరుద్ధంగా ఉండటం వలన సరైన వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరిత గతిన ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని పదార్థం అరుగుదలకు గురికావడంతో ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. అధిక బరువు, వయస్సు, ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్యం, ఇన్ఫ్లమేటరీ కారణాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్‌లో రకాలు: ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటిన వారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి పెరగడం వలన వస్తుంది. ఈ విధమైన ‘డీజనరేటివ్ ఆర్థరైటిస్’ మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్ళలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కానీ శరీర బరువునంతటినీ మోసే మోకాలులో ఇది అధికంగా కనబడుతుంది. మోకాళ్ళ వాపు నొప్పి, చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించడం, నడిచే సమయంలో కిరకిరమని శబ్దం, నడిచేందుకు ఇబ్బంది పడటం, కింద కూర్చోలేకపోవడం, ఉదయాన్నే నిద్రలేచేసరికి కీళ్ల నొప్పులు అధికమవడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఈ వ్యాధి ప్రధానంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తుంది. ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. జీవనక్రియలలో ఏర్పడే అసమతుల్యత వలన తలెత్తే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ శరీరంలో ఇరువైపులా ఉండే కాళ్ళకు సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్ళ వైకల్యానికి దారి తీస్తోంది. గౌటీ ఆర్థరైటిస్: సాధారణంగా మన రక్తంలో ‘యూరిక్ ఆమ్లం’ అనే ముఖ్య రసాయనం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల మోనో సోడియం సిట్రేట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది. మొదట్లో ఇది కాలి బొటనవేలు వంటి ఏదో ఒకటి రెండు కీళ్శకు పరిమితమై క్రమేపీ ఇతరత్రా జాయింట్లకు వ్యాపిస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సీరో నెగెటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. దీర్ఘకాలికంగా సోరియాసిస్ బాధితులైన వారిలో 30% మంది ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఈ తరహా కీళ్లనొప్పులనే వైద్య పరిభాషలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: రక్తం ద్వారా గానీ లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్ఫెక్షన్కు గురి అయినప్పుడు గానీ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఎక్కువగా ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకునేవారిలో కనిపిస్తుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: పైన చెప్పబడిన అన్ని రకాల ఆర్థరైటిస్‌లకు హోమియో వైద్యంలో మెరుగైన చికిత్సలుంటాయి. మిగతా వైద్య ప్రక్రియలతో పోలిస్తే నొప్పిని తగ్గించడంలోనూ కీళ్ళ కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ హోమియోపతిలో చక్కటి పరిష్కారం లభిస్తుంది. జెనెటిక్ కాన్ స్టిట్యూషనల్ విధానం ద్వారా హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో లభించే సమర్థవంతమైన చికిత్సతో ఆర్థరైటిస్ వ్యాధి బాధలను సంపూర్ణంగా నివారింపజేయవచ్చు. వ్యాధి పరిణామాలను పెరగకుండా కాపాడేందుకు కూడా వీలుంది. ఉచిత కన్సల్టేషన్ 955 000 1188 / 99 టోల్ ఫ్రీ 1800 102 2202 www.homeocare.in -
సొంత కణాలతో.. కొత్త ముక్కు
లండన్: ప్రమాదాల్లోనో, కేన్సర్ కారణంగానో ముక్కును పోగొట్టుకున్నవారికి శుభవార్త. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన కార్టిలేజ్ (మృదులాస్థి)తో ముక్కును పూర్తిస్థాయిలో రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇవాన్ మార్టిన్ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ తరహా శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు కూడా. ముందుగా బాధితుల ముక్కులోని కార్టిలేజ్ కణాలను తీసుకుని.. టిష్యూ ఇంజనీరింగ్ (కణజాల వర్థనం) పద్ధతిలో కొల్లాజెన్ మెంబ్రేన్‌గా అభివృద్ధి చేశారు. అనంతరం దానిని బాధితుల్లో దెబ్బతిన్న ముక్కు భాగానికి అనుగుణంగా.. అవసరమైన ఆకారంలోకి మలిచి.. శస్త్రచికిత్స చేసి అమర్చారు. అయితే, 76 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురికి ఈ తరహా శస్త్రచికిత్స చేశామని ఇవాన్ మార్టిన్ చెప్పారు. శస్త్రచికిత్స చేసిన ఆనవాళ్లు ఏడాదిలోగా మాయమయ్యాయని, ఇతర దుష్ర్పభావాలేమీ కనిపించలేదని వెల్లడించారు. ముక్కుతో పాటు చెవులు, కనురెప్పలు వంటివి దెబ్బతిన్నప్పుడు కూడా ఈ తరహా చికిత్స చేయవచ్చని పేర్కొన్నారు.