నేడు రజని వేడుక
ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు జన్మదినాన్ని (అధిక మాసాలు కలుపుకొని 100వ జన్మదినం) పురస్కరించుకుని నేటి సాయంత్రం విజయవాడలో ఆయన అభిమానులు, మిత్రులు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. స్థానిక మినర్వా గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో వేడుకలు ప్రారంభం అవుతాయి. మండలి బుద్ధప్రసాద్, మోహన్ కందా, వి.ఎ.కె. రంగారావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతీదేవి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వేడుకల్లో పాల్గొని రజనీకాంతరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.
అనంతరం భాగవతుల వెంకట్రామశర్మ బృందం రజని ‘విశ్వయానం’ రూపకాన్ని, ‘మహేశ్వరీ మహాకాళి’ గేయ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే రజని అభిమానుల నోట ఆయన గేయాల గానం ఉంటుంది. ఈ ఆత్మీయ సత్కార వేడుకలకు ఆహ్వాన సంఘ సభ్యులుగా డాక్టర్ జంధ్యాల శంకర్, కె.సదాశివరావు, సి.రాఘవాచారి, అండవిల్లి సత్యనారాయణ, గోవిందరాజన్, డాక్టర్ హేమ పరిమి, డాక్టర్ పరిమి, డాక్టర్ జి.వి.పూర్ణచందు, వి.వి.ఎమ్.కృష్ణ, వి.నాగలక్ష్మి, డి.ఇందుమతి, మూల్పూరు నర సింహారావు వ్యవహరిస్తున్నారు.
చిత్రం: శంకర నారాయణ (శంకర నారాయణ ప్రముఖ చిత్రకారుడు ‘బాపు’ సోదరుడు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పని చేశారు. ఆ సమయంలో చిత్రాన్ని గీసి రజనీకి చూపించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారట!)