
కమలా పండు సగ భాగం, కొన్ని కీరా ముక్కలు, శీకాకాయ పొడి మూడు టీ స్పూన్లు, పెసరపిండి ఐదు టీ స్పూన్లు తీసుకుని, అన్నింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.ప్యాక్ వేసుకునే విధానం: దువ్వెనతో జుట్టు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి, తర్వాత నూనెలో కరివేపాకు వేసి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి.
ఈ నూనెను తలకుపట్టించుకుని మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టంతా పట్టించుకోవాలి. ఆ తరువాత ప్రశాంతంగా కూర్చుని మీకు నచ్చే మ్యూజిక్ వింటూ ఒక గంట తర్వాత హెయిర్‌వాష్ చేసేయండి. ఈ ప్యాక్ కేశాలకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. తేడా మీరే గమనిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment