పెద్ద మనసున్నవాడు... దేవుడు పంపినవాడు! | Celebreties Children's different type of names! | Sakshi
Sakshi News home page

పెద్ద మనసున్నవాడు... దేవుడు పంపినవాడు!

Published Fri, Sep 2 2016 11:44 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

సంజయ్‌దత్ భార్య మాన్యత, కొడుకు షారాన్, కూతురు ఇక్రా. - Sakshi

సంజయ్‌దత్ భార్య మాన్యత, కొడుకు షారాన్, కూతురు ఇక్రా.

పిల్లలకు పేర్లు పెట్టడంలో సగటు మనుషులైనా, సెలబ్రిటీలైనా ఒకే విధంగా ఆలోచిస్తారు. క్రియేటివ్‌గా ఉండాలని, అలాగే మంచి అర్థం కూడా ఉండాలని. బాలీవుడ్ తారలు కొందరు ఇటీవల, లేదా కొంతకాలం క్రితం తమ పిల్లకు భలే వెరైటీ పేర్లను పెట్టారు. వాటిని, వాటి అర్థాలను ఒకసారి చూద్దాం.
రాణీముఖర్జీ కూతురు అదీరా. అరబ్‌లో అదీరా అంటే స్ట్రాంగ్, పవర్‌ఫుల్, నోబుల్ అని. జెనీలియా కొడుకు రియాన్. లిటిల్ కింగ్ అని అర్థం అట. ఇలాంటి పేరే వియాన్. శిల్పాశెట్టి కొడుకు వియాన్. ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ అని ఈ పేరుకు అర్థం. ఇమ్రాన్, అవంతికల కూతురు ఇమారా. అంటే స్ట్రాంగ్ అండ్ రిజల్యూట్ అని.
 
ఐశ్వర్య కూతురు పేరు తెలిసిందే. ఆరాధ్య. ఆరాధ్యకు అర్థమూ తెలిసిందే. ఆరాధించదగిన అని. ఆమిర్ ఖాన్ అద్దెగర్భం ద్వారా తెచ్చుకున్న కొడుకు ఆజాద్. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అజాద్ పేరు పెట్టుకున్నారు ఆమిర్ తన కొడుక్కి. ఆజాద్ అంటే స్వేచ్ఛ, విముక్తి అని అర్థం. హృతిక్ రోషన్ తనయులు హృదాన్, హ్రెహాన్. ఇవి రెండూ అరబ్ పేర్లు. పెద్ద మనసున్న వాడు హృదాన్. దేవుడు ఎంపిక చేసి పంపినవాడు హ్రెహాన్. షారుక్‌ఖాన్‌కి ముగ్గురు పిల్లలు. ఆర్యన్, అమ్మాయి సుహానా, అబ్రామ్.
 
ఆర్యన్ అంటే యుద్ధయోధుడు, సుహానా అంటే అందమైన అని. ప్రవక్త అబ్రహాం, శ్రీరాముడిలో రామ్ ఇద్దరి పేర్లు కలిపి కొడుక్కి అబ్రామ్ అని పెట్టుకున్నారు షారుక్ దంపతులు. అక్షయ్ కుమార్‌కి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆరవ్ (పీస్‌ఫుల్), అమ్మాయి నిటారా (బలమైన పునాదులు కలిగినది). కాజోల్ కూతురు నైసా. గ్రీకులో ఈ మాటకు ‘గోల్’ అని అర్థం. కాజోల్‌కి ఈ మధ్య పుట్టినవాడి పేరు యుగ్. తెలిసిందే. యుగం అని. మాధురీ దీక్షిత్‌కు ఇద్దరు కొడుకులు రాయన్, ఆరిన్. రాయన్ అంటే స్వర్గం. ఆరిన్ అంటే శక్తి పర్వతం. సుస్మితాసేన్ దత్తపుత్రికలు రెనీ, అలీసా. మళ్లీ పుట్టబోతున్నదీ, పవిత్రమైనదీ అని. సంజయ్‌దత్ కొడుకు, కూతురు షారాన్, ఇక్రా. యోధుడు, నేర్చుకోవలసినవాడు అని ఈ రెండు పేర్ల భావం. ఇంకా చాలా చాలా పేర్లు వెరైటీ వెరైటీగా ఉంటాయి. అందుకే బాలీవుడ్ న్యూస్ ఫాలో అవుతుండండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement