వ్యాయామంతో కేన్సర్‌కు చెక్!
పరిపరి...శోధన
వ్యాయామం వల్ల స్థూలకాయం, మధుమేహం అదుపులోకి వస్తాయని తెలిసిందే. అయితే, వేగంగా పరుగు తీయడం, బరువులు ఎత్తడం సహా శరీరానికి అలసట కలిగించేలా వ్యాయామాలు చేయడం ద్వారా కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చని కోపెన్‌హాగన్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
వ్యాయామం వల్ల కేన్సర్ కణితుల పెరుగుదల దాదాపు యాభైశాతం వరకు తగ్గుతుందని ఎలుకలపై తాము నిర్వహించిన ప్రయోగాల్లో తేలినట్లు కోపెన్‌హాగన్ వర్సిటీ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పెర్నిల్లె హోజ్‌మన్ తెలిపారు. వ్యాయామం వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే ఎడ్రినలిన్ కేన్సర్ కణాలను నిర్మూలించడంలో కీలకంగా పనిచేస్తున్నట్లు తాము గమనించామని ఆయన వివరించారు.