సమస్యలను భూతద్దంలో చూడకండి...
మంచి మాట
హృతిక్ రోషన్, హీరో
- విషాదం మూర్తీభవించిన వ్యక్తి, ప్రతి విషయం లోనూ ప్రతికూల ఫలితాలనే ఊహించే వ్యక్తి... తాను సుఖంగా ఉండలేడు. చుట్టూ ఉన్న వాళ్లను సంతోషపెట్టలేడు.
- ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతమాత్రాన అదే పనిగా ఆందోళన చెందనవసరం లేదు. దుఃఖించాల్సిన పని అంతకంటే లేదు. బాధ పడుతూ కూర్చో వడం వల్ల... సమస్య ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది.
- ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామనేది పెద్దవిషయం కాదు... వాటి నుంచి ఎంత ఆత్మస్థైర్యంతో బయటపడుతున్నామనేది ముఖ్యం.
- బలహీన సందర్భాలు ఎదురైనప్పుడు, అప జయాలు చుట్టుముట్టినప్పుడు... జీవితాన్ని ఆశావహదృక్పథం నుంచి చూడడం మొదలు పెడతాను. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది.
- ప్రతి మనిషిలోనూ సమస్యలపై పోరాడే మహత్తర శక్తి ఉంటుంది. కొందరు ఆ శక్తిని గుర్తిస్తారు. మరికొందరు గుర్తించరు. అంతేతేడా!
- మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతి ఆధారపడి ఉంటుంది.
- కండలు పెంచి, బిల్డింగ్‌ల మీద నుంచి దూకేవారు సూపర్ హీరోలు కాదు. విలువలతో జీవించేవారే సూపర్ హీరోలు!
- నిత్యజీవితంలో సంతోషం అనేది... ఒక పుస్తకం చదవడం ద్వారా లభించవచ్చు. ఒక పాత పాట వినడం ద్వారా లభించవచ్చు. చివరికి ఒక జోక్ ద్వారా కూడా దొరకవచ్చు!