magnifying glass
-
నువ్వు నిజంగా దేవుడివి సామి
టెక్నాలజీ ఎంతగా కొత్త పుంతలు తొక్కుతుందనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. టెక్నాలజీ ఉపయోగించి ఎదుటివారి కళ్లను కూడా మోసం చేయగలం. దానిలో ఉండే చిన్న కిటుకు తెలిస్తే చాలు.. విచ్చలవిడిగా వాడేయచ్చు. ఇప్పుడు మనం చూడబోయే వార్త అలాంటిదే మరి. ఒక వ్యక్తి భూతద్దంలోంచి మనకు ఏదో చూపిస్తున్నట్లు ఒక కన్నును పెద్దదిగా చేసి చూపిస్తాడు. అప్పటివరకు కంటిపాప మాత్రమే కనిపించే అద్దంలో ఒక్కసారిగా వ్యక్తి ముఖం పైకి చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అదేంటి కంటిపాప లోంచి అతను ఎలా బయటికి వచ్చాడా అంటూ ఆశ్చర్యంతో పాటు సందేహం కూడా కలుగుతుంది. మూములుగా ఆలోచిస్తే ఇందులో మర్మమేంటనేది చిక్కదు.. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది. కేవలం టెక్నాలజీని ఉపయోగించి వీడియో చూసేవారి కళ్లను మోసం చేశాడు కెవిన్ పారీ అనే వ్యక్తి. కెవిన్ పారీ వాడిన ఆ టెక్నాలజీ గురించి రెండో వీడియో విడుదల చేశాడు. రెండో వీడియోలో భూతద్దం నుంచి కంటిపాపలో ఆ ముఖం ఎలా కనపడిందనేది వివరించాడు. మొదట గ్రీన్ కలర్ కోటింగ్ ఉన్న భూతద్ధం తీసుకున్నట్లు చెప్పాడు. తర్వతా దాని స్థానంలో మాములు భూతద్ధంను ఉంచాడు. తర్వాతి స్టెప్‌లో తానే ఒక నల్ల డ్రెస్ వేసుకొని కంటిపాపలో నుంచి పైకి చూస్తున్నట్లుగా చిన్న స్టిల్ ఏర్పాటు చేసి యానిమేషన్ టెక్నాలజీతో మొదటి దానితో రెండో దానిని అటాచ్ చేశాడు. ఈ రెండింటిని కలిపి మనకు చూపించాడు. భూతద్దం లోంచి చూడగానే మనకు ఆ కంటిపాపలో అతని ముఖం కనిపించే విధంగా భ్రమ కలిగించాడు. వీడియో చూడడానికి కొంచెం భయం కలిగినా కెవిన్ పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ఇదంతా ఏదో సరదా కోసం చేశానని కెవిన్ వెల్లడించాడు. ఏది ఏమైనా కెవిన్ చేసిన ఈ వీడియో మోస్ట్ పాపులర్ వీడియోల్లో ఒకటిగా నిలిచింది. న సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అసలు ఇలాంటి ట్రిక్ ఇంతవరకు చూడలేదు.. నువ్వు నిజంగా దేవుడివి సామి.. అమేజింగ్.. నీలాంటి వాళ్లు ఇక్కడ కాదు ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram I don’t know what this is or why I made it 🔍👁 A post shared by Kevin Parry (@kevinbparry) on Aug 21, 2020 at 2:01pm PDT View this post on Instagram How I made this weird eyeball trick 🔍👁 A post shared by Kevin Parry (@kevinbparry) on Aug 31, 2020 at 2:22pm PDT -
రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్ టికెట్ కలెక్టర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అవి రెగ్యులర్ రైళ్లు కాదు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 139, 138కు ఫోన్ చేయాలని కోరింది. -
సమస్యలను భూతద్దంలో చూడకండి...
మంచి మాట హృతిక్ రోషన్, హీరో - విషాదం మూర్తీభవించిన వ్యక్తి, ప్రతి విషయం లోనూ ప్రతికూల ఫలితాలనే ఊహించే వ్యక్తి... తాను సుఖంగా ఉండలేడు. చుట్టూ ఉన్న వాళ్లను సంతోషపెట్టలేడు. - ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతమాత్రాన అదే పనిగా ఆందోళన చెందనవసరం లేదు. దుఃఖించాల్సిన పని అంతకంటే లేదు. బాధ పడుతూ కూర్చో వడం వల్ల... సమస్య ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. - ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామనేది పెద్దవిషయం కాదు... వాటి నుంచి ఎంత ఆత్మస్థైర్యంతో బయటపడుతున్నామనేది ముఖ్యం. - బలహీన సందర్భాలు ఎదురైనప్పుడు, అప జయాలు చుట్టుముట్టినప్పుడు... జీవితాన్ని ఆశావహదృక్పథం నుంచి చూడడం మొదలు పెడతాను. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది. - ప్రతి మనిషిలోనూ సమస్యలపై పోరాడే మహత్తర శక్తి ఉంటుంది. కొందరు ఆ శక్తిని గుర్తిస్తారు. మరికొందరు గుర్తించరు. అంతేతేడా! - మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతి ఆధారపడి ఉంటుంది. - కండలు పెంచి, బిల్డింగ్‌ల మీద నుంచి దూకేవారు సూపర్ హీరోలు కాదు. విలువలతో జీవించేవారే సూపర్ హీరోలు! - నిత్యజీవితంలో సంతోషం అనేది... ఒక పుస్తకం చదవడం ద్వారా లభించవచ్చు. ఒక పాత పాట వినడం ద్వారా లభించవచ్చు. చివరికి ఒక జోక్ ద్వారా కూడా దొరకవచ్చు!