టెక్నాలజీ ఎంతగా కొత్త పుంతలు తొక్కుతుందనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. టెక్నాలజీ ఉపయోగించి ఎదుటివారి కళ్లను కూడా మోసం చేయగలం. దానిలో ఉండే చిన్న కిటుకు తెలిస్తే చాలు.. విచ్చలవిడిగా వాడేయచ్చు. ఇప్పుడు మనం చూడబోయే వార్త అలాంటిదే మరి. ఒక వ్యక్తి భూతద్దంలోంచి మనకు ఏదో చూపిస్తున్నట్లు ఒక కన్నును పెద్దదిగా చేసి చూపిస్తాడు. అప్పటివరకు కంటిపాప మాత్రమే కనిపించే అద్దంలో ఒక్కసారిగా వ్యక్తి ముఖం పైకి చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అదేంటి కంటిపాప లోంచి అతను ఎలా బయటికి వచ్చాడా అంటూ ఆశ్చర్యంతో పాటు సందేహం కూడా కలుగుతుంది. మూములుగా ఆలోచిస్తే ఇందులో మర్మమేంటనేది చిక్కదు.. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది.
కేవలం టెక్నాలజీని ఉపయోగించి వీడియో చూసేవారి కళ్లను మోసం చేశాడు కెవిన్ పారీ అనే వ్యక్తి. కెవిన్ పారీ వాడిన ఆ టెక్నాలజీ గురించి రెండో వీడియో విడుదల చేశాడు. రెండో వీడియోలో భూతద్దం నుంచి కంటిపాపలో ఆ ముఖం ఎలా కనపడిందనేది వివరించాడు. మొదట గ్రీన్ కలర్ కోటింగ్ ఉన్న భూతద్ధం తీసుకున్నట్లు చెప్పాడు. తర్వతా దాని స్థానంలో మాములు భూతద్ధంను ఉంచాడు. తర్వాతి స్టెప్‌లో తానే ఒక నల్ల డ్రెస్ వేసుకొని కంటిపాపలో నుంచి పైకి చూస్తున్నట్లుగా చిన్న స్టిల్ ఏర్పాటు చేసి యానిమేషన్ టెక్నాలజీతో మొదటి దానితో రెండో దానిని అటాచ్ చేశాడు. ఈ రెండింటిని కలిపి మనకు చూపించాడు. భూతద్దం లోంచి చూడగానే మనకు ఆ కంటిపాపలో అతని ముఖం కనిపించే విధంగా భ్రమ కలిగించాడు.
వీడియో చూడడానికి కొంచెం భయం కలిగినా కెవిన్ పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ఇదంతా ఏదో సరదా కోసం చేశానని కెవిన్ వెల్లడించాడు. ఏది ఏమైనా కెవిన్ చేసిన ఈ వీడియో మోస్ట్ పాపులర్ వీడియోల్లో ఒకటిగా నిలిచింది. న సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అసలు ఇలాంటి ట్రిక్ ఇంతవరకు చూడలేదు.. నువ్వు నిజంగా దేవుడివి సామి.. అమేజింగ్.. నీలాంటి వాళ్లు ఇక్కడ కాదు ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment