పరిశోధనలకు ప్రోత్సాహం | Encouragement of research | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు ప్రోత్సాహం

Published Mon, Nov 3 2014 12:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

పరిశోధనలకు ప్రోత్సాహం - Sakshi

పరిశోధనలకు ప్రోత్సాహం

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంఎస్ రీసెర్చ్, పీహెచ్‌డీ వంటి కోర్సులను అందిస్తూ.. అత్యుత్తమ సదుపాయాలతో విరాజిల్లుతోంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాయివంశీ తన క్యాంపస్ ముచ్చట్లను చెబుతున్నాడిలా..
 
ప్రత్యేకంగా ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్

ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. రూమ్‌కు ఇద్దరు చొప్పున ఉంటారు. విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ పేరుతో ప్రత్యేకంగా ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. తరగతుల షెడ్యూల్‌ను, ఇతర క్యాంపస్ ఈవెంట్స్‌ను మెయిల్ ద్వారా తెలియజేస్తారు. సెమిస్టర్‌కు అన్ని ఫీజులు కలుపుకుని దాదాపు రూ.1,30,000 వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఒక్కో పీరియడ్ దాదాపు గంటన్నర ఉంటుంది. చివరి 15 నుంచి 20 నిమిషాలు ఏమైనా సమస్యలు ఇచ్చి పరిష్కార మార్గాలను వివరిస్తారు. ఫ్యాకల్టీ అంతా వారివారి సబ్జెక్టుల్లో మంచి నిపుణులు. బోధనలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్ వంటివాటిని వినియోగిస్తారు. గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి విదేశాల నుంచి ప్రొఫెసర్లు కూడా వస్తుంటారు. అకడమిక్‌పరంగా ఎదురయ్యే అన్ని సందేహాలను ఫ్యాకల్టీ నివృత్తి చేస్తారు.
 
టీచింగ్ అసిస్టెంట్స్

ప్రతి సెమిస్టర్‌లో రెండు మిడ్ టర్మ్స్, ఎండ్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను ఇప్పటివర కు 10 కి 8 సీజీపీఏ సాధించాను. సెమిస్టర్‌లో సాధారణంగా ఆరు సబ్జెక్టులు ఉంటాయి. డీన్ అనుమతితో ఒక సబ్జెక్టును తగ్గించుకోవచ్చు. దీన్ని తర్వాతి ఏడాదిలో పూర్తిచేయాలి. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఎంఎస్, పీహెచ్‌డీ విద్యార్థులకు సంబంధిత ప్రొఫెసర్ డిపార్ట్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో విజేతలుగా నిలిచినవారిని, ఆసక్తి ఉన్నవారిని టీచింగ్ అసిస్టెంట్స్‌గా తీసుకుంటారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచింగ్ అసిస్టెంట్ ఉంటారు.
 
అత్యుత్తమ స్థాయిలో లైబ్రరీ, లేబొరేటరీలు

మౌలిక సదుపాయాల పరంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన కంప్యూటర్స్, లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్ (పీసీ టు స్టూడెంట్ రేషియో- 1:2) అందుబాటులో ఉంది. అదే విధంగా రీసెర్చ్ జర్నల్స్, సీడీరామ్స్, ఆన్‌లైన్ రిసోర్సెస్‌తో వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలు లైబ్రరీలో లభిస్తాయి. డిజిటల్ లైబ్రరీలోనూ అనేక పుస్తకాలు, మరెన్నో పూర్వ లెక్చర్స్‌ను పరిశీలించే అవకాశం ఉంది.
 
ఎన్నో అంతర్జాతీయ అవార్డ్‌లు

ఇన్‌స్టిట్యూట్ బోధన, రీసెర్చ్ పరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డ్‌లు ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు లభించాయి. నాసా నేతృత్వంలోని అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ నిర్వహించే అంతర్జాతీయ పోటీలు.. కాన్‌శాట్ అవార్డులు, గూగుల్ ఇండియా ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ అవార్డులు; గూగుల్ - ఇండియా స్కాలర్‌షిప్ అవార్డ్‌లు వంటివి ఇందుకు కొన్ని నిదర్శనాలు.
 
స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహం


ఇక్కడ కొత్త స్టార్టప్స్‌ను ఏర్పాటు చేయాలనుకునేవారికి మంచి ఫండింగ్ లభిస్తోంది. క్యాంపస్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ ఎన్నో స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. కార్యాలయం కోసం ఆఫీసు, ఫర్నీచర్, ప్రింటర్ సదుపాయం కూడా కల్పిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్‌లో ప్రతిఏటా టెక్నికల్  ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ పోటీలు నిర్వహిస్తారు. గతేడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సగటున ఏడాదికి రూ.15 లక్షలు, గరిష్టంగా రూ.57 లక్షల వరకు కంపెనీలు వేతనాలు అందించాయి. బీటెక్ పూర్తయ్యాక జీఆర్‌ఈ రాసి విదేశాల్లో ఎంఎస్ చేస్తా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement