రారండోయ్‌ | Events in Hyderabad | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Mar 26 2018 1:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Events in Hyderabad - Sakshi

  • కె.ఎన్‌.వై.పతంజలి స్మారక సాహిత్య పురస్కారాన్ని సతీష్‌ చందర్‌కు మార్చి 29న సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: పతంజలి సాంస్కృతిక వేదిక, విజయనగరం.
  • డాక్టర్‌ వి.గీతానాగరాణి పరిశోధన గ్రంథం ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లిం జీవన చిత్రణ’, సలీం నవల ‘అనూహ్య పెళ్లి’ల ఆవిష్కరణ సభ మార్చి 30న సాయంత్రం 5:40కి శ్రీత్యాగరాయ గానసభలో జరగనుంది. 
  •  ‘భారతీయ సాహిత్యంపై అంబేడ్కర్‌ ప్రభావం’ అంశంపై జాతీయ సదస్సు మార్చి 28, 29 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం– అంబేడ్కర్‌ ఛైర్‌; ఏపీ బహుజన రచయితల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. వివరాలకు: 9966990797.
  • మల్లెతీగ పురస్కారం–2017ను ర్యాలిప్రసాద్‌ కవిత ‘డెత్‌ సర్టిఫికెట్‌’ గెలుచుకుంది. ఆత్మీయ పురస్కారాలు సుధేరా, అనిల్‌ డ్యానీ, కె.జి.వేణు, కె.కిషోర్‌కుమార్‌–శిఖా ఆకాశ్, చిత్తలూరి సత్యనారాయణకు లభించాయి.
  • జాతీయ సాహిత్య పరిషత్తు, సిద్దిపేట వారి ఐతా భారతీ చంద్రయ్య సంప్రదాయ కథా పురస్కారాన్ని డాక్టర్‌ బి.వి.ఎన్‌.స్వామి; తడకమడ్ల సంప్రదాయ సాహితీ పురస్కారాన్ని కటుకోజ్వల ఆనందం; సంటి అనీల్‌కుమార్‌ బాల సాహితీ పురస్కారాన్ని పైడిమర్రి రామకృష్ణ; గాడేపల్లి వెంకటమ్మ– వీరయ్య స్మారక పురస్కారాన్ని మెరుగు ప్రవీణ్‌కుమార్‌ మార్చి 30న సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో స్వీకరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement