రారండోయ్‌ | Events in Hyderabad | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Apr 2 2018 1:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Events in Hyderabad - Sakshi

  • శ్రీవిరించి(ఎన్‌.సి.రామానుజాచారి)కి పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య పురస్కారాన్ని ఏప్రిల్‌ 5న సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని హోటల్‌ ఐలాపురంలో ప్రదానం చేయనున్నారు.
  • మద్దాళి రఘురామ్‌ కవితాసంపుటి ‘తూకానికి కన్నీళ్లు’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 7న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది. 
  • డాక్టర్‌ శాంతి నారాయణ కథా సంపుటి ‘బతుకు బంతి’, కవితా సంపుటి ‘కొత్త అక్షరాలపై’ ఆవిష్కరణ, అంకితోత్సవ సభ ఏప్రిల్‌ 8న ఉదయం 10:30కు అనంతపురం జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో జరగనుంది.
  • దేవనపల్లి వీణావాణి కవిత్వం ‘నిక్వణ’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహిత్య సమాఖ్య.
  • ఎం.బాలగంగాధరయ్య కథల సంపుటి ‘వలస బతుకులు’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరగనుంది.
  • వసుంధర విజ్ఞాన వికాస మండలి, గోదావరిఖని వారు నిర్వహించిన కవితల పోటీల బహుమతుల ప్రదానం ఏప్రిల్‌ 9న సీఈఆర్‌ క్లబ్‌ నిర్వహించనున్న సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల్లో జరగనుంది.
  • బహుజనం సాంస్కృతిక వేదిక– తెలంగాణ ఏప్రిల్‌ 8న 3 గంటలకు సంగారెడ్డిలోని గాంధీ సెంటినరీ ఉన్నత పాఠశాలలో బహుజన కవిగాయక సమ్మేళనం నిర్వహించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement