- పల్లా దుర్గయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని నందిని సిధారెడ్డికి మే 24న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: మానస ఆర్ట్ థియేటర్స్, త్యాగరాయ గానసభ.
- చల్లపల్లి స్వరూపరాణి కవితాసంపుటి ‘వేకువ పిట్ట’ పరిచయ సభ మే 26న రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. నిర్వహణ: కవిసంధ్య, బహుజన రచయితల వేదిక, భీమ్‌భూమి మాసపత్రిక.
- ముస్లిం సంఘీభావ కవితా సంకలనం ‘మిలన్’ కోసం మే 31లోగా కవితలు పంపాలని సంపాదకులు కోరుతున్నారు. ప్రచురణ: ప్రేమలేఖ. మెయిల్: ఝజీ ్చnఞ్ఛ్టౌటyఃజఝ్చజీ .ఛిౌఝ
- పెన్నా సాహిత్య పురస్కారం–2017కు అనిల్ డ్యానీ కవితా సంపుటి ‘ఎనిమిదో రంగు’ ఎంపికైంది. పురస్కార ప్రదానం జూన్‌లో నెల్లూరులో ఉంటుంది. నిర్వహణ: పెన్నా రచయితల సంఘం.
- ‘నవ్యాంధ్రప్రదేశ్’ ఐదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ‘మన ఆంధ్రప్రదేశ్’ పేరిట ఏకదిన కవిసమ్మేళనం జూన్ 10న విజయవాడలో జరగనుంది. వివరాలకు: 9247475975. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం.
- కిన్నెర–ద్వానా స్ఫూర్తి పురస్కారాలకు ‘అనంత పద్యం’(ఆమళ్లదిన్నె రమణప్రసాద్), ‘పుట్ట బంగారం’(గుడిపాటి), ‘వరంగల్ జిల్లా పత్రికలు: నాడు, నేడు’(నమిలికొండ సునీత) సాహిత్య విమర్శ గ్రంథాలు ఎంపికైనాయి. ప్రదానం, జూన్ 15న త్యాగరాయ గానసభలో.
- ‘ఉ కొట్టండి... ఉల్లాసం, ఉద్వేగం, ఉత్కంఠ, ఉత్సాహం నిండిన కథల’ పేరుతో ఆన్‌లైన్ పత్రిక ‘సుకథ’ పోటీ నిర్వహిస్తోంది. మొదటి మూడు బహుమతుల విలువ 25 వేలు. చివరి తేది: జూన్ 20. వివరాలకు: storyboard@sukatha.com
రారండోయ్
Published Mon, May 21 2018 1:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment