గొంతులో ప్రతి సమస్య త్రోటింగ్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు
‘‘నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది’’ అన్న సామెత విన్నా "We are what we eat"అంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన శారీరక మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అన్న సత్యాన్ని తెలుసుకున్నా, నలుగురితో మంచిగా మాట్లాడడానికి, చక్కటి ఆహారం తీసుకోవడానికి మనస్సు, తెలివి కంటే ముందు ‘‘గొంతు’’ ప్రాధాన్యత ఏమిటో అందరూ గుర్తిం^è గలుగుతారు. మరీ ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మన మనస్సు సరిగ్గా లేనప్పుడు తప్పనిసరి నలుగురిలోకి వెళ్ళటం, వ్యాపకాలు పెట్టుకోవటం, మంచి ఆహారం తీసుకుంటూ మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తే చాలా త్వరగా కోలుకోగలుగుతారు. క్యాన్సర్ లాంటి మహమ్మారిని ఎదిరించి మంచి ట్రీట్‌మెంట్స్‌తో పాటు గుండె నిబ్బరంతో వారు ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రముఖులను ఎందరినో మనము చూస్తున్నాం.
వారు అలా జయించారంటే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ, ‘‘నాకేం అవ్వలేదు’’. మిగతా వ్యాధులలానే ఈ వ్యాధి’’ అనుకుంటూ నలుగురిని కలిసి వారి వృత్తిలో వారు కొనసాగటమే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కాని దురదృష్టవశాత్తు అన్నవాహిక క్యాన్సర్‌కు గురైనవారు, తినటానికి ఇబ్బందిపడటమే కాకుండా గొంతు కూడా బొంగురుపోవటం, కొన్నిసార్లు మాట్లాడ లేక పోవటం వంటి లక్షణాలు ఉండటం వలన మరింత వ్యధ చెందే పరిస్థితులు తలెత్తుతుంటాయి. అందుకే ఈ క్యాన్సర్ పట్ల అవగాహన ముందుగా గుర్తించటం, ఎవ్వరిలో ఈ క్యాన్సర్ తలెత్తె ప్రమాదం ఉంటుందో తెలుసుకుని ఎదుర్కొవటం మరింత ముఖ్యం. గొంతునొప్పి అనగానే త్రోట్ ఇన్‌ఫెక్షన్ గొంతు బొంగురుగా మారినా, మింగడానికి కష్టంగా ఉన్నా నీళ్ల మార్పిడి జరిగిందని, వాతావరణ మార్పిడి, వేడి చేసింది, పడని ఆహార పదార్థాలు తీసుకున్నాం. ప్రయాణం చేయటం వలన అని అనుకునే వారిని మన చుట్టూ, మనం ఎంతో మందిని చూస్తుం టాం. అప్పుడప్పుడు అలాంటి లక్షణాలు కన్పించి రెండు, మూడు రోజుల్లో తగ్గితే అంతగా భయపడాల్సిన పనిలేదు కాని తగ్గకుండా కొన్నిరోజులుగా
1) మింగటానికి కష్టంగా, నొప్పిగా ఉండటం.
2) ద్రవ పదార్థాలు మాత్రమే
తీసుకోగలగటం.
3) ఆకలి, బరువు తగ్గటం.
4) ఆగని దగ్గు, దగ్గులో రక్తం కన్పించటం.
5) గుండెలో మంట.
6) జ్వరం వంటి లక్షణాలు కన్పించే సొంత వైద్యం మానుకుని డాక్టర్‌ని సంప్రదించటం చాలా ముఖ్యం. ఒక్కొక్క సారి ఈ లక్షణాలు కన్పించే సరికే లేటు దశ అయి ఉండి కాలేయానికి, ఊపిరితిత్తులకు కూడా వ్యాపించి ఉండే ప్రమాదం కూడా ఉంటుంది.
అన్నవాహిక మెడ కింద నుండి పొట్ట పై భాగం దాకా 25 సె.మీ. పొడవు ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్‌ను ఉపరిభాగంలో, మధ్య భాగంలో కింది భాగంలో వచ్చేవిగా మూడు భాగాలుగా విడదీస్తారు. ఉపరి భాగంలో వచ్చే క్యాన్సర్‌కు సాధారణంగా కీమో, రేడియోషన్ థెరఫి మాత్రమే ఇస్తుంటారు స్వరపేటికకు దగ్గరగా ఉండటం వలన సర్జరి చేయటం కష్టం. మిగతా రెండు భాగాలకు సర్జరి, కణితి బాగా పెద్దగా ఉన్నప్పుడు ముందు కీమో, రేడియేషన్ తర్వాత సర్జరి చేయటం జరుగుతూ ఉంటుంది. కణితి పెద్దగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకోలేని పరిస్థితులలో స్పెంట్ అమర్చటం కూడా జరుగుతూ ఉంటుంది. అన్నవాహికలో కణితి ఉన్న భాగాన్ని సర్జరి ద్వారా తీసివేయటాన్ని ‘‘ఈసోఫేగక్టమి’’ అంటారు.
ఈ సర్జరిలో అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేసి పొట్టలోని కొంత భాగాన్ని అన్నవాహికకు కలిపి వేయటం జరుగుతుంది. స్త్రీలకన్నా పురుషలలో మూడు రెట్లు అధికంగా కన్పించే ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించకపోతే జీవిత కాలం పెంపొందించటం చాలా కష్టమనే చెప్పాలి కణితి కొంచెం పెద్దదయినప్పుడే లక్షణాలు కన్పించటం వలన ఈ క్యాన్సర్ లేటు దశలోనే గుర్తించటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వారికి కొంత వరకు ఇబ్బందులు తగ్గించుట స్టెంట్స్ వంటివి అమర్చి పాలియేటివ్ కేర్ అందించటం జరుగుతుంది. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవ్వరిలో ఎక్కువ అన్న విషయాన్ని అందరూ తెలుసుకుని, ముందుగా గుర్తించడానికి ప్రయత్నించటమే మనము చేయవలసిన ప్రధానమైన పని. మరి ఈ క్యాన్సర్ ఎవరిలో వచ్చే ప్రమాదం ఎక్కువ, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి... ఒక సారి తెలుసుకుందాం.
1) 60 ఏళ్ల పై బడిన పురుషులు.
2) పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు.
3) గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ (ఎఉఖఈ) సంవత్సరాల తరబడి ఉన్నవారికి.
4) ఏ్కV (హ్యూమన్ పాపిలోమా వైరస్)
5) అన్నవాహికకు యాసిడ్స్‌తో తీవ్రవైన గాయాలు.
6) హెడ్ – నెక్ క్యాన్సర్‌కు గురయిన వారికి.
7) గొంతు భాగంలో రేడియేషన్.
8) థైలోసిస్ సమస్యలున్నవారికి.
9) కొన్ని రకాల రసాయన కర్మాగారాలలో వృత్తులు.
10) కొంత వరకు వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది.
దురలవాట్లకు దూరంగా ఉంటూ చక్కని జీవనశైలితో అధికబరువునూ, ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. లక్షణాలు కన్పించినప్పుడు మరీ ముఖ్యం గా పైన పేర్కొన్న రిస్క్‌గ్రూప్‌కు చెందిన వారు ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహామేరకు ఎండోస్కోపి, బయాప్సి అవసరమైతే ఛ్టి స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి, వ్యాధి నిర్థారణ, స్పే ఏ రకానికి చెందిన క్యాన్సర్, ఏఏ భాగాలకు వ్యాపించింది అనే విషయాల నిర్థారణకు ఈ పరీక్షలు తప్పనిసరి, నిర్థారణ, అయ్యాక సర్జరి, కీమో, రేడియేషన్, లేజర్ థెరఫి, లేక రేడియోఫ్రీక్వెన్సి అబ్లేషన్ వంటి వాటిలో ఏవి అవసరమో ఎంత కాలం తీసుకోవాల్సి ఉంటుందో వంటి విషయాలపై వైద్యులు నిర్ణయం తీసుకోగలుగుతారు.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001