![తాజాగా.. మృదువుగా..!](/styles/webp/s3/article_images/2017/09/3/71458499859_625x300.jpg.webp?itok=EGC4Sb2x)
తాజాగా.. మృదువుగా..!
ఇంటిప్స్
కాకరకాయలను మధ్యలో చీరి ఉప్పు, శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత వండితే చేదు తగ్గుతుంది, రుచి ఇనుమడిస్తుంది. మిరప్పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే దానిని నిలవ ఉంచిన పాత్రలో చిన్న ఇంగువ ముక్క లేదా కొద్దిగా ఇంగువ పొడి వేయాలి. అల్యూమినియం పాత్రలో వండితే పుట్టగొడుగులు నల్లబడతాయి. స్టీలు లేదా నాన్‌స్టిక్ పాత్రలు వాడితే మంచిది. ఆపిల్స్, అరటిపండ్లు కలిపి ఒకే సంచిలో ఉంచితే అరటిపండ్లు త్వరగా పండుతాయి. అరటిపండ్లు మూడు నాలుగు రోజులు నిల్వ ఉండాలంటే రెండింటినీ కలిపి నిలవ చేయకూడదు. మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే వేరుచేయాలి.
మాంసం ఉడికించేటప్పుడు చిన్నముక్క కొబ్బరి వేస్తే త్వరగా ఉడుకుతుంది, మృదువుగా కూడ ఉంటుంది. కేక్ ఎగ్ వాసన రాకుండా ఉండాలంటే కోడిగుడ్డును గిలక్కొట్టేటప్పుడు కొద్దిగా తేనె కలపాలి. ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మెత్తబడతాయి.